PM Modi: కాంగ్రెస్.. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది: ప్రధాని మోదీ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

దిబ్రుగఢ్: విపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ( PM Modi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీ జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్న వలసదారులు అస్సాంలో ( Assam) స్థిరపడేందుకు సహకరిస్తోందని విమర్శించారు. అస్సాంలోని దిబ్రుగఢ్ జిల్లాలో రూ.10,601 కోట్లతో నిర్మించిన ఎరువుల తయారీ కర్మాగారాన్ని మోదీ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు.
- రైల్వే ఛార్జీల పెంపు.. ఈనెల 26 నుంచి అమల్లోకి..!
బంగ్లాదేశ్ వలసదారులకు అస్సాంలో ఆశ్రయం కల్పించడం ద్వారా కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును పెంచుకోవాలనే ఉద్దేశంతో ఉందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల గుర్తింపు, ఉనికి, ఆత్మగౌరవం గురించి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం పట్టింపు లేదని మండిపడ్డారు. ‘‘ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అడ్డుకునేందకు కాంగ్రెస్ అడుగడుగునా ప్రయత్నిస్తోంది. నేనేం మంచి చేయాలనుకున్నా.. దానికి మోకాలడ్డుతోంది. ప్రజల గౌరవం, ఉనికిని కాపాడేందుకు భాజపా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల నుంచి అస్సాంను కచ్చితంగా రక్షించాల్సిన అవసరం ఉంది. అందుకు భాజపా ఓ రక్షణ కవచంలా నిలుస్తుంది’’ అని మోదీ తెలిపారు.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- తప్పు జరిగింది.. క్షమించండి: దిల్లీలో కారు ప్రమాదానికి కారణమైన బాలుడి తండ్రి Delhi: దిల్లీలో మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఓ వ్యక్తి మృతికి కారణమైన సంగతి తెలిసిందే. దీనిపై బాలుడి తండ్రి స్పందిస్తూ.. మృతుని కుటుంబానికి క్షమాపణలు తెలిపారు.
- కొంకణ్ తీర పర్యాటకులకు డాల్ఫిన్ల గుంపు కనువిందు మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా పరిధిలో గల కొంకణ్ తీరంలో పర్యాటకులకు డాల్ఫిన్లు గుంపుగా కనిపించి కనువిందు చేశాయి.
- వైద్యుడి ఫోన్ నంబరు కోసం గూగుల్‌లో వెదికితే.. ఖాతా ఖాళీ సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో ప్రజల ఖాతాలను గుల్ల చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని శహడోల్ జిల్లాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.
- ఐఎన్‌ఎస్ కృష్ణ జలప్రవేశం తొలి స్వదేశీ కేడెట్ శిక్షణ నౌక (సీటీఎస్) ఐఎన్‌ఎస్ కృష్ణ జలప్రవేశం చేసినట్టు నేవీ వర్గాలు మంగళవారం తెలిపాయి. చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సన్ అండ్ టుబ్రో యార్డులో ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించాయి.
- కర్ణాటకలో హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్ కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో భారత తొలి ప్రైవేటురంగ హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్ ‘ఫైనల్ అసెంబ్లీ లైన్’ (ఎఫ్‌ఏఎల్)ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ముంబయి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
- నూరుకోట్లకు బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య దేశంలో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో ఆరు కోట్ల నుంచి వంద కోట్లకు చేరిందని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2014-2025 మధ్యకాలంలో ఈ గొప్ప మైలురాయిని దాటడం సాధ్యమైందని చెప్పారు.
- శ్రీపెరుంబుదూర్‌లో అతిపెద్ద కార్మిక ఆసుపత్రి తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో కార్మికుల కోసం దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు ప్రకటించారు. 18,720 పడకల ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.706 కోట్లు కేటాయించారు.
- ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం ఇక ప్రత్యేకం తమ మధ్య సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని భారత్-ఫ్రాన్స్ నిర్ణయించాయి.
- పిటిషన్లలో ఏఐ వినియోగం ఆందోళనకరం కృత్రిమ మేధ సాధనాల సాయంతో రూపొందించిన పిటిషన్లను న్యాయస్థానాలకు సమర్పించే వైఖరి న్యాయవాదుల్లో ప్రబలడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
- కాంగ్రెస్ మనుగడకు మూలం అసమ్మతే అసమ్మతిని సహించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంటే అది ఆ పార్టీ వినాశనానికే దారి తీస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు.
- అదో తుగ్లకీయ కమిషన్ ఎన్నికల సంఘం ‘‘తుగ్లకీయ కమిషన్’’లా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు.
- బెంగాల్, తమిళనాడుల్లో ఏప్రిల్‌లో ఎన్నికలు! నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు మంగళవారం వెల్లడించారు.
- రైళ్ల మరుగుదొడ్లలో జెట్ స్ప్రేలు రైలు బోగీల్లోని మరుగుదొడ్లలో కొళాయి, చైన్‌తో కూడిన స్టీలు మగ్గుల స్థానంలో జెట్ స్ప్రేలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
- ఆసక్తికరమైన ఏఐ ప్రాజెక్టులు ప్రదర్శించిన ఎల్‌పీయూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పోలో లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయ (ఎల్‌పీయూ) ప్రాజెక్టులు అందరి మన్ననలు పొందాయని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
- మాకు పెన్షన్లు వద్దు శ్రీలంక చట్టసభ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం ముగిశాక పెన్షన్లు తీసుకోరాదని నిర్ణయించారు.
- కె2 విటమిన్‌తో ఎముకలు బలోపేతం డి విటమిన్ క్రియాశీల రూపమైన కాల్సిట్రియోల్‌గా మారేందుకు మెగ్నీషియం చాలా అవసరం.
- గేట్స్ హాజరుపై సందిగ్ధం! ఏఐ సమిట్‌కు బిల్ గేట్స్ హాజరవుతారా లేదా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఆయన హాజరుకాబోవడం లేదని తొలుత ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
- చదరపు మీటరు ఉష్ణమండల అడవితో ఏటా 240 లీటర్ల వర్షపాతం ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రతి చదరపు మీటరు అడవి వల్ల ఏటా దాదాపు 240 లీటర్ల వర్షపునీరు లభ్యమవుతోందని తాజా అధ్యయనం పేర్కొంది.
- బైకర్‌ను ఢీకొన్న కారు.. వైరల్‌గా మారిన వీడియో దేశరాజధాని దిల్లీలో ఒక మైనర్ బాలుడు(17) తన స్కార్పియో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి బైక్‌పై ప్రయాణిస్తున్న 23 ఏళ్ల సాహిల్ ధానేశ్ర అనే వ్యక్తి మృతికి కారణమయ్యాడు.
- కేంద్ర మంత్రి పురీ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైళ్ల వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ వరుసబెట్టి అబద్ధాలాడుతున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండు చేసింది.