మొటిమల మచ్చలు తగ్గట్లేదు!

నా వయసు 38. ఎన్ని సౌందర్య ఉత్పత్తులు వాడుతున్నా... ముఖం మీద మొటిమలూ, అవి వచ్చి తగ్గాక మచ్చలూ పోవడం లేదు.

Eenadu icon
By Vasundhara Team Published : 21 Dec 2025 01:30 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

నా వయసు 38. ఎన్ని సౌందర్య ఉత్పత్తులు వాడుతున్నా... ముఖం మీద మొటిమలూ, అవి వచ్చి తగ్గాక మచ్చలూ పోవడం లేదు. అవి తగ్గి ముఖం కాంతిమంతంగా మారాలంటే ఏం చేయాలి?

సాధారణంగా మొటిమలు వచ్చే టెండెన్సీ ఉన్నవారికి పీరియడ్స్‌ ముందు, నూనె పదార్థాలు, స్వీట్లు వంటివి తింటే చాలు... ఇవి కనిపిస్తుంటాయి. కొందరిలో అవి తగ్గాక ఎర్రటి, నల్లటి మచ్చలు పడుతుంటాయి. మీరూ ఈ సమస్యని ఎదుర్కొంటున్నానని అంటున్నారు. ఇందుకు మార్కెట్లో దొరికే సాధారణ సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఫలితం ఉండకపోవచ్చు. ముందు మీ డైట్‌పై శ్రద్ధ వహించాలి. పాల పదార్థాలు, హైగ్లైసమిక్‌ ఇండెక్స్‌ ఉన్న స్వీట్లు వంటివి తగ్గించాలి. అలానే తరచూ చేతుల్ని ముఖంపై పెట్టడం, గిల్లడం వంటివి చేయొద్దు. జిడ్డుగా అనిపిస్తే శుభ్రమైన నీళ్లతో రెండు మూడు సార్లు ముఖం కడుక్కోండి. అలానే మొటిమలు తగ్గడానికి అడాప్లిన్, క్లిండామైసిన్, నాడీఫ్లాక్ససిన్‌ లేదా మినోసైక్లిన్‌... వంటివాటిల్లో ఏదైనా ఆయింట్‌మెంట్‌ని వాడండి. పింపుల్స్‌ తగ్గి మచ్చలు రావు. అయినా మార్క్స్‌ కనిపిస్తే రోజూ తప్పనిసరిగా ఎస్‌పీఎఫ్‌ 50 ఉన్న సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాయండి. అలానే రాత్రిపూట ఎజిలిక్, శాలిసిలిక్, గ్లైకాలిక్, లాక్టోబయానిక్‌ యాసిడ్లలో ఏదైనా వాడినా మేలు. ఇవి పిగ్మెంటేషన్‌ మచ్చల్ని చర్మఛాయలో కలిసిపోయేలా చేస్తాయి. కొత్త మొటిమలు రాకుండా ఉంటాయి. అయితే, మొటిమల తీవ్రతతోపాటు ఎరుపుదనం ఉంటే డెర్మటాలజిస్ట్‌లను సంప్రదిస్తే వారు పరీక్షించి తగిన సూచనలు చేస్తారు.  

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :