దేవుడా.. క్షేమంగా ఇంటికి చేర్చవా!

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Updated : 21 Dec 2025 08:35 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఈనాడు, కడప: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకర స్థాయిలో నిలిచాయి. ఇటీవల అమరావతిలో కలెక్టర్ల సదస్సు సాగింది. ఇందులో నేరాలతో పాటు రోడ్డు ప్రమాదాల పైనా ప్రత్యేక చర్చ నడిచింది. ఈ సందర్భంగా రవాణా శాఖ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే జిల్లా ముందు వరుస వాటిలో ఒకటిగా నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. మృతుల శాతం అధికంగా ఉన్న ఐదు జిల్లాల్లో అన్నమయ్య కూడా ఒకటి కావడం కలవర పెడుతోంది. అతివేగం, రహదారి భద్రతా లోపాలు, ప్రమాదానంతరం వైద్య సహాయం ఆలస్యం వంటివి ఇందుకు కారణాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు భద్రతపై మరింత దృష్టి సారించి బ్లాక్‌ స్పాట్‌ల గుర్తింపు, వేగ నియంత్రణ, హెల్మెట్‌- సీట్‌బెల్ట్‌ అమలు, అత్యవసర వైద్య సేవల బలోపేతం అవసరమని గుర్తించారు. ప్రజలు కూడా రహదారి నియమాలు పాటించి జాగ్రత్తగా ప్రయాణించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.  

ఎక్కడ ఎక్కువంటే!

కడప- రేణిగుంట, కడప- పీలేరు, రాయచోటి- మదనపల్లె, మదనపల్లె పరిసరాలు.

వాహన రకం వారీగా ప్రమాదాలు...

  • ఎక్కువ: కార్లు, ద్విచక్ర వాహనాలు
  • మధ్యస్థం: మూడు చక్రాలు
  • తక్కువ: ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు

   ఇవీ కారణాలు...

  •  కార్లు, ద్విచక్ర వాహనాల ప్రమాద మృతుల్లో 53 శాతం స్వీయ డ్రైవింగ్‌ వాహనదారులు.
  • వాహన రకాల వారీగా పరిశీలిస్తే 2024, 2025(అక్టోబరు వరకు) చోటుచేసుకున్న ప్రమాదాల్లో ద్విచక్ర, కార్లలో మృతులు అధికం.
  • అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, రాత్రి వేళల్లో జాగ్రత్తలు పాటించకపోవడమే కారణాలు.

► Read latest Ysr kadapa Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 08:32 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విద్యుదాఘాతంలో రెండు ఎద్దులు మృతి [ 18-02-2026] విద్యుత్తు షాక్‌తో రెండు ఎద్దులు మృతి చెందిన ఘటన కడప జిల్లా కాశినాయన మండలం బాలాయపల్లిలో చోటుచేసుకుంది.
  • కోదండ రాముడి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం [ 18-02-2026] వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఈసారి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తితిదే జేఈవో వల్లూరు వీరబ్రహ్మం తెలిపారు.
  • కులవర్ధన్‌ను రక్షక్‌ వాహనంలో తరలిస్తుండగా తప్పించుకున్నాడు: ఎస్పీ [ 18-02-2026] అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారిపై హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని ఎస్పీ ధీరజ్‌ చెప్పారు.
  • బాలికపై హత్యాచారం.. చెరువులో నిందితుడు కులవర్ధన్‌ మృతదేహం [ 18-02-2026] అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది.
  • రూ. 30 కోట్లు చెత్తలో పోసినట్టేనా! [ 18-02-2026] కడప నగరపాలక, న్యూస్‌టుడే: రూ. 30 కోట్లు ఖర్చు పెట్టి అట్టహాసంగా పనులు చేపట్టారు. చెత్త కనుమరుగవుతుందని జనం సంతోషించారు. ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచలేదు.
  • ఎదురింట్లోనే మృగాడు! [ 18-02-2026] మానవీయ విలువలకే సమాధి కట్టే.. మనుషులమన్న విషయానికే అనుమానమొచ్చే దుర్ఘటన మంగళవారం మదనపల్లె జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృగాడి వాంఛాగ్నిలో ఓ లేత కలువ కాలిపోయింది.
  • కూడళ్లు.. నరకానికి నకళ్లు [ 18-02-2026] పుంగనూరు పట్టణ సమీపంలో వెళ్లే ముంబై-చెన్నై జాతీయ రహదారిలో పలు కూడళ్లు  ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. మదనపల్లె-పలమనేరు మధ్య గల ఈ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటోంది.
  • చురుగ్గా వసతి గృహ నిర్మాణాలు [ 18-02-2026] సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాల సమస్య వెంటాడుతోంది. కొన్ని చోట్ల ఎప్పుడో నిర్మించిన పాత భవనాలు శిథిలావస్థకు చేరాయి.
  • కాబోయే అమ్మకు ఆపద [ 18-02-2026] పండంటి శిశువుకు జన్మనివ్వాల్సిన అమ్మను రక్తహీనత వేధిస్తోంది. పౌష్టికాహార లోపమే చాలా మంది గర్భిణులకు శాపమై చుట్టుముడుతోంది.
  • సౌత్‌జోన్‌ క్రికెట్‌ పోటీల్లో.. [ 18-02-2026] ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌-12 అంతర్‌ జిల్లాల వన్డే క్రికెట్‌ పోటీల్లో చిత్తూరు, కర్నూలు జట్లు గెలుపొందాయి. కర్నూలు జట్టు సభ్యుడు గోవర్థన్‌రెడ్డి సెంచరీ చేశాడు.
  • ఉరేసుకుని యువకుడి బలవన్మరణం [ 18-02-2026] మండలంలోని ఇందిరానగర్‌లో నిఖిల్‌ (28) అనే యువకుడు మంగళవారం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతేడాది అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందగా తండ్రి రామకృష్ణతో కలిసి ఉంటున్నాడు.
  • మాఫియా దందా.. ఆగేదుందా! [ 18-02-2026] జిల్లాలో పొగాకు మాఫియాకు కళ్లెం వేసే వారే కరవయ్యారు.. రూ.కోట్లు దోపిడీ సాగిస్తున్నా కళ్లకు గంతలు కట్టుకున్నారు.. మాఫియా ఇచ్చే మామూళ్లకు అలవాటు పడిన అధికారులు యథేచ్ఛగా ధరల బాదుడు కొనసాగుతున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
  • ఏసీబీ ఆన్‌ డ్యూటీ [ 18-02-2026] అవినీతి నిరోధక శాఖ అవినీతి అధికారుల భరతం పడుతోంది. లంచం తీసుకుంటున్నారని కచ్చితమైన సమాచారం వస్తే చాలు దాడులు చేస్తోంది. 2025లో ఒక్క దాడీ లేదు.
  • బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు [ 18-02-2026] ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లిన ఘటన బి.కోడూరు మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.