అండర్-19 ఆసియా కప్‌ ఫైనల్.. భారత్ ఓటమి

Eenadu icon
By Sports News Team Updated : 21 Dec 2025 17:20 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

దుబాయి: అండర్-19 ఆసియా కప్‌ 2025లో ఓటమి అనేదే లేకుండా ఫైనల్‌కు చేరిన యువ భారత్.. కీలక పోరులో తడబడింది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో భారత కుర్రాళ్లు అన్ని రంగాల్లో నిరాశపర్చారు. ఫలితంగా భారత్ 191 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 348 పరుగుల భారీ లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. పదో స్థానంలో వచ్చిన దీపేశ్‌ దేవేంద్రన్ (36) టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.

ఒక దశలో 120 పరుగులకే భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోగా.. దీపేశ్‌ పోరాటంతో స్కోరు 150 దాటింది. వైభవ్ సూర్యవంశీ (26),  ఖిలాన్ పటేల్ (19), ఆరోన్ జార్జ్ (16), అభిజ్ఞాన్ కుందు (13), వేదాంత్ త్రివేది (9), కాన్షిక్ చౌహాన్ (9), విహాన్ మల్హోత్రా (7), హెనిల్ పటేల్ (6), ఆయుష్‌ మాత్రే (2), కిషన్ కుమార్ సింగ్ (3*) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అలీ రజా 4, మహ్మద్ సయామ్, అబ్దుల్ సుభాన్, హుజైఫా అహ్సాన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (172; 113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ శతకం చేశాడు. అహ్మద్ హుస్సేన్ (56; 72 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీ చేశాడు. ఉస్మాన్ ఖాన్ (35), ఫర్హాన్ యూసుఫ్‌ (19), హంజా జహూర్ (18) పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్ 3, హెనిల్ పటేల్ 2, ఖిలాన్ పటేల్ 2, కాన్షిక్ చౌహాన్ ఒక వికెట్ తీశారు. 

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 17:17 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మ్యాచ్ ఆడటానికి వెళ్లే ముందు గిన్నెలు కడుక్కోవాల్సి వచ్చింది: పాకిస్థాన్ హాకీ కెప్టెన్ ఆస్ట్రేలియా పర్యటనలో కనీస సౌకర్యాలకు నోచుకోకుండా, ఇబ్బంది పడుతూ గడిపి.. తిరిగి వచ్చిన తర్వాత పాకిస్థాన్‌ హాకీ కెప్టెన్ షకీల్ అహ్మద్ బట్ జాతీయ సమాఖ్యపై విమర్శలు గుప్పించాడు.
  • దక్షిణాఫ్రికా ఘన విజయం.. యూఏఈ చిత్తు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
  • రాణించిన అలీషన్‌ షరాఫు.. దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 123 పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా, యూఏఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది.
  • రంజీట్రోఫీ ఫైనల్స్‌కు జమ్మూకశ్మీర్‌ జట్టు .. 67 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో జమ్మూకశ్మీర్‌ జట్టు మాజీ ఛాంపియన్‌ బెంగాల్‌ జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో 67 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఫైనల్స్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది.
  • నా కెరీర్‌లో అదే కీలక మలుపు: హార్దిక్‌ పాండ్య టీమ్‌ఇండియా (Team India) ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య తన కెరీర్‌లో కీలకమైన విషయం గురించి మాట్లాడాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2016లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను వేసిన చివరి ఓవర్ ఎంతో ప్రత్యేకమన్నాడు.
  • కోహ్లీతో బాబర్‌ను పోల్చడం అన్యాయం: దినేశ్‌ కార్తిక్‌ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌ స్టేజిలో టీమ్ఇండియాతో (Team India) జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 61 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ విఫలమయ్యాడు. 7 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు.
  • భారత్‌తో మ్యాచ్‌లో.. పాకిస్థాన్ చేసిన తప్పిదం అదే: రవిచంద్రన్‌ అశ్విన్‌ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా టీమ్‌ఇండియా (Team India), పాకిస్థాన్‌ కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
  • వచ్చాడో బేబీ యువరాజ్‌ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్‌.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
  • అజేయమేనా? హ్యాట్రిక్‌ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్‌ రన్‌రేట్‌.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
  • ఆస్ట్రేలియా ఔట్‌ మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాక్‌. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్‌..
  • కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్‌-డి పోరులో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
  • కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్‌ అనగానే టాప్‌ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
  • పాక్‌ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్‌.. తన చివరి గ్రూప్‌ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
  • ముగింపులో నేపాల్‌ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్‌.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్‌-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
  • సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్‌ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్‌ దిశగా అడుగులేస్తోంది.
  • శర్మా.. మొదట నువ్వు సింగిల్‌ తీసుకో: సునీల్‌ గావస్కర్‌ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
  • యువరాజ్‌ సింగ్‌ పేరు.. శతకంతో రికార్డ్‌: కెనడా ‘యువీ’ సెన్సేషన్‌ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.