సీఎం గారూ.. వైద్యంపై దృష్టి సారించండి: జాగృతి అధ్యక్షురాలు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మానవపాడు : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందించే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆసుపత్రిని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను ఇప్పటి వరకు 15 జిల్లాల్లో పర్యటించానన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, మౌలిక సదుపాయాల కొరత ఉందని ఆమె తెలిపారు. అదేవిధంగా అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆసుపత్రిని నాసిరకంగా నిర్మించారని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ స్పందించి వంద పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బందితోపాటు మౌలిక వసతులకు చొరవ చూపాలని కోరారు. అనంతరం మానవపాడు మండలం కలుకుంట్ల శివారులోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్నిపరిశీలించి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
► Read latest Mahbubnagar Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పుర పీఠంపై ఇంతింతై [ 18-02-2026] మహిళలు రాజకీయాల్లోనూ ముందడుగు వేసి రాణిస్తున్నారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ సర్పంచులు, ఉపసర్పంచులుగా గెలిచి పల్లె పాలనలో సత్తా చాటుతున్నారు.
- పాలమూరుకు మణిహారం [ 18-02-2026] పేదల తిరుపతి మన్యంకొండ వేంకటేశ్వరాలయం ఎన్‌హెచ్ నుంచి కి.మీ. ఉంటుంది. దేవరకద్ర నుంచి కురుమూర్తి దేవస్థానం 25 కి.మీ. మాత్రమే.
- నిరంతర‘గంగా’ [ 18-02-2026] గండీడ్ మండలం సల్కర్‌పేట్ శివారులోని అంతరగంగ లింగేశ్వర ఆలయం వద్ద ఉన్న గుండంలో ఇప్పటి వరకు ఎండలేదు. లోతు చాలా తక్కువ. ఎంతటి కరవు పరిస్థితులు వచ్చినా నీటి మట్టం తగ్గలేదని స్థానికులు చెబుతున్నారు.
- వాహనాలు తెలిసేలా... ప్రమాదాలు ఆగేలా [ 18-02-2026] రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలో రాత్రివేళ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలొదులుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
- పారుతోంది కన్నీరే! [ 18-02-2026] గ్రామాల్లో సాగునీటి కాల్వలు అధ్వానంగా మారాయి. ఏళ్ల పాటు నిర్వహణ లేకపోవడంతో రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు.
- పెద్ద పులి దాడిలో లేగదూడ మృత్యువాత [ 18-02-2026] పెద్ద పులి దాడిలో లేగ దూడ మృతి చెందిన సంఘటన మండలంలోని గుంపన్‌పల్లి శివారులో చోటు చేసుకుంది. అటవీశాఖ సెక్షన్ అధికారి బాలకిష్టయ్య వివరాల ప్రకారం..
- పథకానికి ఏడాది.. నిధుల జాడేది..? [ 18-02-2026] రాష్ట్ర ప్రభుత్వం నేతన్న పొదుపు(త్రిఫ్టు ఫండ్) పథకం అమలు కోసం ఏడాది కిందట అధికారుల ద్వారా సర్వే చేయించి, మార్చి నుంచి పథకాన్ని అమలు చేసింది.
- అన్న దుకాణానికి సోదరి నిప్పు [ 18-02-2026] ఆస్తి తగాదా నేపథ్యంలో అన్న కిరాణా దుకాణానికి చెల్లెలు నిప్పు పెట్టిన ఘటన చిన్నచింతకుంటలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
- గుట్టుగా.. భ్రూణ హత్యలు! [ 18-02-2026] శ్రీరంగాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన పెళ్లికాని యువతిని ఓ యువకుడు గర్భవతిని చేశాడు. కర్నూలులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి గర్భస్రావం చేయించాడు.