ఓడిన సర్పంచ్‌ అభ్యర్థిపై దాడి.. పట్టణంలో బంద్‌ చేపట్టిన అఖిలపక్షం

Eenadu icon
By Telangana Dist. Team Published : 19 Dec 2025 13:17 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఎల్లారెడ్డి: సోమార్‌పేట పంచాయతీ ఎన్నికల్లో  ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థి బాలరాజు ఇంటిపై దాడిని నిరసిస్తూ శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో బంద్‌కు పిలుపునిచ్చారు.  బాలరాజు పోటీలో ఉండటంతోనే తాను ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చిందని పాపయ్య సోదరుడు చిరంజీవిలు.. ఆయన ఇంటిపై ట్రాక్టర్‌తో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాజీ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడారు. దాడికి ప్రేరేపించిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

► Read latest Nizamabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మండే ఎండలతో తాగునీటి ఎద్దడి [ 19-02-2026] వేసవి మొదలైంది. క్రమంగా ఎండలు మండుతున్నాయి. ఈ సీజన్‌లో అత్యధిక నీటి వినియోగంతో సహజంగా ఎద్దడి తలెత్తుతుంది. సమస్య ముదరకుండా నగరపాలిక యంత్రాంగం యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించాలి.
  • దర్జాగా తవ్వేస్తాం.. ఎవరొస్తారో చూస్తాం! [ 19-02-2026] మాక్లూర్‌ మండలంలోని చిక్లి వాగులో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ‘అంతా మా ఇష్టం’.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఏకంగా అధికారులకు సవాల్‌ విసురుతోంది. అందినకాడికి దండుకుంటూ అందకుండా పారిపోతోంది.
  • సిబ్బంది కొరత.. అగ్గి రాజుకుంటే కలత [ 19-02-2026] వేసవి ప్రారంభమైంది. ప్రమాదవశాత్తు లేదా మానవ తప్పిదాలతో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి. వీటి కట్టడికి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
  • సమస్యలతో ‘పరీక్ష’ పెట్టొద్దు [ 19-02-2026] ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు ఇటీవల ముగిశాయి. ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. వేసవిలో పరీక్షలు జరగనుండడంతో కేంద్రాల్లో అధికారులు తగినన్ని ఫ్యాన్లు ఏర్పాటు చేయించాలి.
  • ఓటీపీ చెప్పొద్దు.. తెలియని లింక్‌లు క్లిక్‌ చేయొద్దు [ 19-02-2026] బ్యాంకు లావాదేవీల నిర్వహణ, కేవైసీ, నామినీ వివరాలు, అన్‌క్లెయిమ్‌ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ వంటి విషయాల్లో చాలా మంది ఖాతాదారులకు సందేహాలు ఉంటాయి.
  • సమయపాలనపై పట్టింపేది..? [ 19-02-2026] కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 10.40 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉద్యోగుల బయోమెట్రిక్‌ హాజరును ‘న్యూస్‌టుడే’ పరిశీలన చేసింది. 10.40 నుంచి 12 గంటల మధ్య కనీసం 50 మంది ఉద్యోగులు ఆలస్యంగా విధులకు హాజరయ్యారు.
  • ఆధునిక సేవలు.. అత్యంత వేగంగా.. [ 19-02-2026] తపాలా శాఖ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. డిజిటలైజేషన్‌ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రైవేటుకు దీటుగా వాణిజ్య రంగం తలుపు తట్టి ప్రజలకు మెరుగైన సేవలందిస్తోంది.
  • రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు [ 19-02-2026] కొనుగోళ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కొనుగోలు చేసిన పంటకు బిల్లులు చెల్లించడం లేదంటూ మొక్కజొన్న రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలంటూ తాడ్వాయి
  • వచ్చినా.. వెళ్లినా.. ఒకేసారి [ 19-02-2026] రద్దీగా ఉండే మార్గాల్లో కామారెడ్డి నుంచి గుండారం రహదారి ఒకటి. కామారెడ్డి ఆర్టీసీ డిపో గతంలో ఈ మార్గంలో మెదక్‌ వరకు బస్సులు నడిపేది. వర్షాకాలంలో వచ్చిన వరదలకు మెదక్‌కు వెళ్లే బస్సులను  నిలిపివేశారు.