Kishan Reddy: ఆరు గ్యారంటీల అమలు పట్టించుకున్నారా? సోనియాకు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

హైదరాబాద్: తెలంగాణలో స్వయంగా ప్రకటించిన 6 గ్యారంటీలు, మేనిఫెస్టో అమలు గురించి ఏనాడైనా తెలుసుకునేందుకు ప్రయత్నించారా? అని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కనీసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సమయంలోనైనా వీటి అమలు గురించి ఆరా తీశారా? అంటూ ఓ బహిరంగ లేఖ రాశారు.
‘‘ఆనాడు ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టి.. మళ్లీ ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇస్తున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలను గాలికొదిలేశారా? ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా? గాంధీభవన్‌లో పాతరేశారా? తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి.
ఇప్పటికైనా కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త హామీలు కల్పించే ముందు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. లేదంటే మీరు ప్రయోగించిన అభయహస్తమే ప్రజల ఆగ్రహం రూపంలో మీ పాలిట భస్మాసుర హస్తమై అధికారానికి దూరం చేస్తుంది. తెలంగాణ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు’’ అని కిషన్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 15:07 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఈ నెల 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ! రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 23న భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది.
- శివుడికి ప్రసాదంగా డ్రగ్స్.. సీపీ సజ్జనార్ పోస్టుతో పోలీసుల యాక్షన్ మహా శివరాత్రి రోజున దేవుడికి మాదకద్రవ్యాలు చూపిస్తూ కొందరు రీల్స్ చేయడంపై హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.