Elon Musk: కుప్పకూలుతున్న స్టార్‌లింక్‌ శాటిలైట్‌..!

Eenadu icon
By International News Team Updated : 21 Dec 2025 15:42 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్: ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ ప్రాజెక్టులోని శాటిలైట్స్‌లో ఒకటి ఇటీవల అంతరిక్షం నుంచి అదుపుతప్పి భూమివైపు వస్తోంది. ఈ నెల 17వ తేదీన శాటిలైట్‌ 35956 భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అది హఠాత్తుగా అక్కడి నుంచి కూలిపోవడం మొదలైంది. దానిపై నియంత్రణను స్పేస్‌ఎక్స్‌ కోల్పోయింది. ఆ తర్వాత ఆ సంస్థ దీనిపై వివరణ ఇచ్చింది. ‘‘హఠాత్తుగా ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తి ప్రొపెల్షన్‌ ట్యాంక్‌లో గ్యాస్‌ అత్యంత శక్తిమంతంగా బయటకు వెలువడింది. దీంతో ఒక్కసారిగా అది నాలుగు కిలోమీటర్ల కిందకు దూసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని భాగాలు విడిపోయి మెల్లగా కదలడం మొదలుపెట్టాయి. వారం రోజుల్లోగా భూవాతావరణంలోకి వచ్చి కూలిపోవచ్చు’’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. 

శనివారం ఈ ఉపగ్రహ శకలాలు అమెరికాలోని అలాస్కా సమీపంలో గగనతలంలో ప్రయాణిస్తుండగా.. వెంటోర్‌టెక్‌ సంస్థకు చెందిన వరల్డ్‌వ్యూ-3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి హైరిజల్యూషన్‌ చిత్రాలను తీసింది.

ఈ ఉపగ్రహం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి లేదా భూమికి ఎటువంటి ముప్పు లేదని స్పేస్‌ఎక్స్‌ చెబుతోంది. ప్రస్తుతం అది ఐఎస్‌ఎస్‌ కంటే కిందే ఉందని వెల్లడించింది. అది లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లో ఉండటంతో.. భూగురుత్వాకర్షణ శక్తి దానిని సులువుగా లాగేస్తుందని వెల్లడించింది. ఇవి వాతావరణ ఘర్షణతో కాలిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ప్రస్తుతం స్టార్‌లింక్‌ ప్రాజెక్టు కింద 9,000 ఉపగ్రహాలను స్పేస్‌ఎక్స్‌ అంతరిక్షంలోకి పంపింది. దీంతో భూమిపై మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ను సరఫరా చేయగలుగుతోంది. అమెరికాలోని నాసా, యూఎస్‌ స్పేస్‌ఫోర్స్‌తో సమన్వయం చేసుకొంటూ పనిచేస్తోంది.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 15:38 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • చర్చలు సాగిస్తూనే.. పశ్చిమాసియాకు అమెరికా యుద్ధ విమానాలు..! Iran-USA అమెరికా- ఇరాన్‌ల మధ్య అణుఒప్పందానికి సంబంధించి ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 24 గంటల్లో అగ్రరాజ్యం దాదాపు 50 అత్యాధునిక యుద్ధ విమానాలను పశ్చిమాసియాలో మోహరించింది.
  • మాకు పింఛన్లు వద్దు శ్రీలంక చట్టసభ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం ముగిశాక పింఛన్లు తీసుకోరాదని వారు నిర్ణయించారు.
  • అమెరికా పౌరహక్కుల నేత జెస్సీ జాక్సన్‌ మృతి అమెరికాలో శ్వేతజాతి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అనుచరుడు, రెండుసార్లు దేశాధ్యక్ష పదవికి పోటీచేసిన మానవ హక్కుల ఉద్యమ ప్రముఖుడు రెవరెండ్‌ జెస్సీ ఎల్‌.జాక్సన్‌ మంగళవారం మరణించారు.
  • భారత్‌ సాయం మాకు అత్యంత కీలకం అంతర్జాతీయ సమాజ అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్‌ అందిస్తున్న సాయం తమకెంతో కీలకమని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ స్పష్టం చేశారు.
  • బంగ్లా ప్రధానిగా రహమాన్‌ ప్రమాణం బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా బీఎన్‌పీ నేత తారిఖ్‌ రహమాన్‌ (60) మంగళవారం పదవీ ప్రమాణం చేశారు.
  • సౌదీలో దర్శనమిచ్చిన రంజాన్‌ నెలవంక సౌదీ అరేబియాతో సహా పలు గల్ఫ్‌ దేశాల్లో రంజాన్‌ నెలవంక దర్శనమిచ్చింది. దీంతో ఉపవాసాలు, భక్తిశ్రద్ధలకు ప్రత్యేకమైన పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైనట్లయింది.
  • విన్యాసాలకు హర్మూజ్‌ జలసంధి తాత్కాలిక మూసివేత అస్త్ర ప్రయోగాలతో కూడిన సైనిక విన్యాసాలు జరగకుండా హర్మూజ్‌ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.
  • అమెరికా ఐస్‌ హాకీ ప్రాంగణంలో కాల్పులు ఐస్‌ హాకీ క్రీడా ప్రాంగణంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందిన ఘటన ఇక్కడి పాటుకెట్‌లోని డెన్నిస్‌ ఎం.లించ్‌ ఎరీనాలో జరిగింది.
  • శ్రీలంక సర్కారు కీలక నిర్ణయం.. ఎంపీల పెన్షన్లు రద్దు SriLanka: పొరుగు దేశం శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదం పొందింది. 
  • ఆ యుద్ధ నౌకలు మునిగిపోవచ్చు! ట్రంప్‌నకు ఖమేనీ హెచ్చరికలు అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు.