ఆ వార్తలు అవాస్తవం..బంగ్లా హైకమిషన్‌ వద్ద నిరసనలపై విదేశాంగ శాఖ

Eenadu icon
By National News Team Published : 21 Dec 2025 15:50 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల జరిగిన నిరసన (Protests Outside Bangladesh High Commission)ల్లో ఎటువంటి భద్రతా లోపం తలెత్తలేదని భారత విదేశాంగ శాఖ (MEA) ప్రకటించింది. దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ బయట ఉన్న కంచెలను ఆందోళనకారులు ధ్వంసం చేసి, లోపలికి చొరబడడానికి ప్రయత్నాలు చేసినట్లు బంగ్లాదేశ్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్‌ (Randhir Jaiswal) స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా అక్కడి మీడియా అబద్ధపు ప్రచారాలు చేస్తోందన్నారు. బంగ్లా హైకమిషన్‌ వద్ద ఎవరూ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదన్నారు.  

బంగ్లాదేశ్‌లో దీపూ చంద్ర దాస్‌ అనే మైనారిటీ యువకుడి హత్యకు వ్యతిరేకంగా శనివారం సాయంత్రం దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ (Bangladesh High Commission) ముందు దాదాపు 20-25 మంది యువకులు గుమిగూడి శాంతియుతంగా నినాదాలు చేసినట్లు రణధీర్ పేర్కొన్నారు. కొన్ని నిమిషాల తర్వాత అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టారన్నారు.  అయితే వారు అక్కడి నిబంధనలు ఉల్లంఘించడానికి, కంచెను దాటడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్య ఆధారాలు సోషల్‌ మీడియాలో అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఏప్రిల్‌లో బెంగాల్‌, తమిళనాడు ఎన్నికలు..! బెంగాల్‌, తమిళనాడు సహా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఎలక్షన్‌ కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి. 
  • ముంబయిలో మెక్రాన్‌-మోదీ భేటీ Emmanuel Macron India Visit: భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్.. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు
  • వాష్‌రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాలు.. కన్నడ నటి వీడియో రికార్డు చేసి, బ్లాక్‌మెయిల్‌ Kannada actress:  ఒక కన్నడ నటికి చేదు అనుభవం ఎదురైంది. వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి, ఆ వీడియోతో తనను బ్లాక్‌మెయిల్ చేశారంటూ ఆమె ఆరోపించారు.
  • ఏఐ సదస్సులో సమస్యలు.. కేంద్రమంత్రి క్షమాపణలు ఏఐ సదస్సు జరుగుతున్న భారత మండపం వద్ద సౌకర్యాలు లేవంటూ కొంతమంది ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలోనే కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ క్షమాపణలు తెలిపారు.
  • రీల్‌ చేస్తూ డ్రైవింగ్‌ చేయడం వల్లే.. దిల్లీ ప్రమాదం వీడియో వైరల్‌ ఇటీవల దిల్లీలో జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
  • కమల్‌హాసన్‌ ‘ఎంఎన్‌ఎం’ పార్టీకి టార్చిలైట్‌ గుర్తు కమల్‌హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీకి ఎన్నికల సంఘం టార్చిలైట్‌ గుర్తును కేటాయించింది.
  • ‘ఎంతసేపు చదివామన్నది కాదు’: జేఈఈ మెయిన్‌ టాపర్‌ కబీర్‌ చిల్లర్‌ జేఈఈ మెయిన్‌లో 300కు 300 స్కోర్‌ తెచ్చుకొన్న కబీర్‌ స్థానిక మీడియాతో మాట్లాడారు. జేఈఈలో మంచి మార్కులు సాధించడానికి ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే విషయంపై తోటి విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
  • డియర్‌ ఫ్రెండ్‌.. ముంబయిలో కలుద్దాం: మెక్రాన్‌కు ప్రధాని మోదీ స్వాగతం Emmanuel Macron India Visit: భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌ను ప్రధాని మోదీ స్వాగతించారు.
  • ప్రియురాలి ప్రాణం తీసి.. ఆపై తాంత్రిక పూజలు..! ఇటీవల ఇందౌర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎంబీఏ విద్యార్థిని కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
  • మేక పాలతో సబ్బులు మేకపాలతో సబ్బులు తయారు చేస్తూ గ్రామీణ ప్రాంత మహిళలు ఉపాధి పొందుతున్నారు.
  • ఈ శివలింగం పెరుగుతోంది.. జరుగుతోంది! బిహార్‌లోని నిరంజన నదిలో ఉన్న శివలింగం ఏటా అత్యంత స్వల్పంగా పెరుగుతోందని.. కదులుతోందని స్థానికులు చెబుతున్నారు.
  • నేను రాహుల్‌వాదిని కాదు.. కేరళలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్‌) విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
  • కర్ణాటకలో రూ.400 కోట్ల దారి దోపిడీ కట్టుకథే ఓ ట్రక్కులో హవాలా సొమ్ము తరలిస్తుండగా రూ.400 కోట్ల నగదు దోపిడీ జరిగిందంటూ ఆ వాహన డ్రైవర్‌ చేసిన ఫిర్యాదు బోగస్‌ అని తేలింది.
  • ఏఐ ప్రయాణంలో ముందున్నాం కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్‌ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026, సమిట్‌లు సోమవారం దిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
  • తొలి దఫా బోర్డు పరీక్షలకు ‘పది’ విద్యార్థుల హాజరు తప్పనిసరి పదో తరగతి విద్యార్థులు మంగళవారం నుంచి నిర్వహించే మొదటి దఫా బోర్డు పరీక్షలు తప్పనిసరిగా రాయాలని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) స్పష్టం చేసింది.
  • పెళ్లికి ముందు ఎవరినీ నమ్మవద్దు పెళ్లికి ముందే శారీరక సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది.
  • ‘పరిశ్రమ’ నిర్వచనాన్ని తేల్చేందుకు 9 మంది జడ్జీలతో విస్తృత ధర్మాసనం ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ‘పరిశ్రమ’ నిర్వచనం వివాదంపై 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరపనుంది.
  • 25-26 తేదీల్లో మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25-26 తేదీల్లో రెండ్రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.
  • దేశంలోనే అత్యంత పొడవైన తొండ మహారాష్ట్రలోని కొల్హాపుర్‌ జిల్లాలో నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో దేశంలోనే అత్యంత పొడవైన తొండ(ఇగ్వానా) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
  • ముచ్చటగా మూడోసారి.. ఐఏఎస్‌తోనే మనువు మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అవీ ప్రసాద్‌ తన పెళ్లితో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.