ఇది ఇషాన్‌కు క్రికెట్‌ నుంచి లభించిన బహుమతి: అశ్విన్‌

Eenadu icon
By Sports News Team Published : 22 Dec 2025 00:05 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ను ఇషాన్‌ కిషన్‌ గౌరవించాడని.. అది అతడికి బహుమతి ఇచ్చిందని టీమ్‌ ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానల్లో వ్యాఖ్యానించాడు. ఇషాన్‌ పునరాగమనాన్ని ఆయన విశ్లేషించాడు. ‘‘ఇది ఇషాన్‌ కిషన్‌కు క్రికెట్‌ ఇచ్చిన గిఫ్ట్‌. చాలా మంది బయట నుంచి రకరకాలుగా ఊహించుకోవచ్చు. మరికొందరు ఇది అన్యాయం అని కూడా చెప్పొచ్చు. కానీ, జీవిత చక్రం తిరిగి అక్కడికే వచ్చింది. అతడు జట్టులో స్థానం కోల్పోవడానికి.. జట్టులోకి తిరిగి రావడానికి ఒకే కారణం ఉంది. అతడు క్రికెట్‌కు ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చాడు. 

ఇషాన్‌ బుచ్చిబాబు ట్రోఫీ ఆడాడు. ఆ టోర్నమెంట్‌లో చెన్నైకి వచ్చి ఝార్ఖండ్‌ జట్టుకు నాయకత్వం వహించాడు. రంజీ ట్రోఫీ ప్రిపరేషన్‌లో ఆ జట్టులో నంబర్‌ వన్‌ ఆటగాడిగా నిలిచాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పరుగుల వరద పారించాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నమెంట్‌లో జట్టును విజయపథంలో నడిపించాడు. ఆ టోర్నమెంట్‌లో అద్భుతంగా ఆడాడు. ఇషాన్‌ శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు. ఆటను గౌరవించి.. విజయం సాధించాడు.

నువ్వు పెద్ద ఆటగాడివా, చిన్న ఆటగాడివా.. కొత్తగా వచ్చావా.. అన్నది కాదు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రాణించు.. మా కళ్లు ఎప్పుడూ మీపై ఉంటాయి అనే సందేశాన్ని సెలక్టర్లు కూడా ప్లేయర్లకు బలంగా పంపారు. వన్డేల్లో ఇషాన్‌ డబుల్‌ సెంచరీ చేసిన తీరే అతడేంటో చెబుతోంది’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అజేయమేనా? హ్యాట్రిక్‌ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్‌ రన్‌రేట్‌.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
  • ఆస్ట్రేలియా ఔట్‌ మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాక్‌. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్‌..
  • కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్‌-డి పోరులో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
  • కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్‌ అనగానే టాప్‌ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
  • పాక్‌ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్‌.. తన చివరి గ్రూప్‌ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
  • వచ్చాడో బేబీ యువరాజ్‌ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్‌.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
  • ముగింపులో నేపాల్‌ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్‌.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్‌-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
  • ఫైనల్‌కు చేరువలో జమ్ముకశ్మీర్‌ రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్‌ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్‌ దిశగా అడుగులేస్తోంది.
  • శర్మా.. మొదట నువ్వు సింగిల్‌ తీసుకో: సునీల్‌ గావస్కర్‌ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
  • యువరాజ్‌ సింగ్‌ పేరు.. శతకంతో రికార్డ్‌: కెనడా ‘యువీ’ సెన్సేషన్‌ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.