ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకోలేకపోతున్నాం: ఎమ్మెల్యే

- A
- A+
- A++

ఇల్లందు గ్రామీణం: కమ్యూనిస్టులపై ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకోలేకపోతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం ఇల్లందులో ఏర్పాటు చేసిన రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఏపూరి బ్రహ్మం స్తూపం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మధ్యకాలంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు మృతి చెందడం బాధాకరమన్నారు. కార్మిక వర్గ స్వరూపం మారిపోయిందన్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
► Read latest Khammam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.