పోలియో మహమ్మారిని తరిమికొట్టాలి: ఎమ్మెల్యే

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 21 Dec 2025 14:09 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఆమదాలవలస గ్రామీణం: పోలియో మహమ్మారిని తరిమికొట్టాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆదివారం ఆమదాలవలస పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పోలియో లాంటి ప్రమాదకర వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఈ కార్యక్రమం కీలకమన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని వారి తల్లిదండ్రులకు సూచించారు.  ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ అధికారులు, కళాశాల సిబ్బంది, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

► Read latest Srikakulam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • తరిమే ఆపదను ‘తల’చుకోరేం..! [ 19-02-2026] జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆగట్లేదు. వరుస ఘటనలతో పాటు మరణాల రేటు పెరుగుతోంది. బాధితుల్లో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ఉండటం గమనార్హం.
  • కలిసొచ్చే కాలం.. కోరుతోంది ఊతం [ 19-02-2026] ప్రపంచ వాణిజ్య చిత్రపటంలో జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చింది నీలి గ్రానైట్‌.. అగ్రశ్రేణి నాణ్యతను సొంతం చేసుకున్న ఆ గ్రానైట్‌ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది..
  • కాసులందక.. కన్నీళ్లు ‘ఆప్కో’లేక..! [ 19-02-2026] మగ్గాలపై నేసిన వస్త్రాన్ని మార్కెట్‌లో విక్రయించేందుకు చేనేత కార్మికులు ప్రభుత్వ రంగ సంస్థ ఆప్కోను ఆశ్రయిస్తారు. ఇతర ప్రాంతాల్లో అక్కడి ప్రజల అభిరుచికి తగినట్లుగా ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా నిల్వలను కార్మికులు అందజేస్తారు.
  • ముక్కంటి సన్నిధిలో.. భక్తజన‘ధార’.. [ 19-02-2026] వంశధార.. జనధార అయ్యింది.. ఆ ముక్కంటి స్మరణతో భక్తి ప్రవాహమై పారింది.. స్వామి సేవలో భక్తలోకం తడిసి ముద్దయింది.. ఇసుక తిన్నెలపై శివనామం మారుమోగింది.. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి.
  • యువకుడిపై బీరు సీసాలతో దాడి [ 19-02-2026] పాతకక్షల నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న యువకుడిపై బీరు సీసాలతో దాడి చేసిన ఘటన కొత్తూరులోని బ్రాహ్మణ వీధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు..
  • మద్యం దుకాణంలో చోరీ [ 19-02-2026] శ్రీకాకుళం నగర పరిధి ఫాజుల్‌బాగ్‌పేట పరిధి కిమ్స్‌ ఆసుపత్రి రోడ్డులోని లక్కీ వైన్స్‌ దుకాణంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. మంగళవారం రాత్రి పని వేళలు ముగిసిన తర్వాత ముగ్గురు సిబ్బంది తాళాలు వేసి వెళ్లారు.
  • బక్కచిక్కిన బాహుదా..! [ 19-02-2026] వైకాపా పాలనలో బాహుదా నదిని నిర్లక్ష్యం చేయడంతో రైతులు వ్యవసాయానికి, ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. 11 ఓపెన్‌ హెడ్‌ ఛానళ్లు అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించినా అమలుకు నోచుకోలేదు.
  • తేలుస్తారా.. తెలుసుకోవడమేనా? [ 19-02-2026] రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థినుల వేధింపుల ఫిర్యాదులపై మరోసారి విచారణ జరిగింది. రెండు నెలల కిందట ఉన్నతాధికారులు హడావుడి చేయడంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటారని విద్యార్థులు ఆశించినా అలా జరగలేదు.