Mohan Bhagwat: ఆరెస్సెస్‌ను రాజకీయ కోణంలో చూడడం తప్పు: మోహన్ భాగవత్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( RSS)ను రాజకీయ కోణంలో చూడడం అతిపెద్ద తప్పుగా సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) అన్నారు. భాజపాతో ఆర్‌ఎస్‌ఎస్‌ను పోల్చడం, రాజకీయ కోణంలో చూడడంతో ప్రజల్లో తరచు అపార్థాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నైతిక విలువలు సామాజిక బాధ్యత కలిగిన సంఘ్‌సేవక్‌లను సృష్టించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని, బలమైన దేశాన్ని నిర్మించడానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ గురించి తమ అభిప్రాయం చెప్పే హక్కు దేశంలోని ప్రతివ్యక్తికీ ఉందని, కానీ అది వాస్తవికత ఆధారంగా ఉండాలని భాగవత్ (Mohan Bhagwat) అన్నారు. సంఘ్‌కు ఎటువంటి రాజకీయ అజెండా లేదని.. దేశమే తొలి ప్రాధాన్యం అన్న సిద్ధాంతాన్ని పాటిస్తూ పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తమ కార్యకర్తలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సంఘ్ చేస్తున్న ఈ కృషితో భారత్ మళ్లీ విశ్వగురువుగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :