CM Revanth Reddy: విద్వేష ప్రసంగాలను సహించబోం

Eenadu icon
By Telangana News Desk Published : 21 Dec 2025 04:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఈనాడు, హైదరాబాద్, నారాయణగూడ, న్యూస్‌టుడే: పరమత సహనాన్ని పాటించకుండా ఇతర మతాలు, ప్రజల మధ్య విద్వేషం సృష్టించే ప్రసంగాలు చేసేవారిని చట్టపరంగా కఠినంగా శిక్షించేందుకు వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఒకేరోజు క్రిస్మస్‌ పండగను జరుపుకొంటారని, మానవుడే దేవుడిగా మారిన ఏసు ప్రభువు జన్మదినం ప్రపంచానికే గొప్ప పండగని అభివర్ణించారు. ‘‘రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా సరే వారికి నచ్చిన మతాన్ని, సంప్రదాయాలను ఆచరించవచ్చు. అదే సమయంలో ఇతర మతాలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాలు, వేదికల్లో ప్రసంగాలు చేస్తే సహించబోం. విద్వేష ప్రసంగాల నిరోధంపై కర్ణాటక శాసనసభలో రెండ్రోజుల క్రితమే బిల్లును ప్రవేశపెట్టారు. ఇదే తరహాలో తెలంగాణలోనూ కఠినంగా వ్యవహరిస్తాం. 

డిసెంబరు అద్భుత నెల.. 

విశ్వవ్యాప్తంగా డిసెంబరు అంటే అద్భుతమైన మాసం. ఏసు ప్రభువు జన్మించి దైవదూతగా అవతరించారు.. ఇంకా కాంగ్రెస్‌ పార్టీకి, తెలంగాణ ప్రజలకు ఈ నెల మిరాకిల్‌ మంత్‌...కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఈ నెలలోనే జన్మించారు. తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను చూసి చలించిపోయిన ఆమె డిసెంబరులోనే తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేశారు. రెండేళ్లక్రితం ఎల్బీ స్టేడియంలో ప్రజాపాలనకు శ్రీకారం చుట్టాం. నాలుగు కోట్ల మంది ప్రజలకు శాంతితో పాటు సంక్షేమాన్ని అందిస్తున్నాం. మా పాలనలో ఏసు ప్రభువు బోధనలను అనుసరిస్తున్నాం. బాధాతప్తులకు చేరువవుతున్నాం. మెరుగైన ఆరోగ్య భద్రత కోసం 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. వీటిని చంటి పిల్లలకు సంతోషంగా తినిపిస్తున్నారు.  

క్రిస్టియన్‌ మిషనరీ విద్యాసంస్థలు ఆదర్శం

విద్య, వైద్యం ప్రాధాన్యాలుగా పంచవర్ష ప్రణాళికలను దేశ తొలి ప్రధాని నెహ్రూ అమలు చేశారు. అప్పట్లో దేశ ప్రజల జీవన ప్రమాణం 32 సంవత్సరాలే. జనాభా పెరుగుతున్న కొద్దీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యాన్ని ప్రజలందరికీ అందించలేని పరిస్థితుల్లో క్రిస్టియన్‌ మిషనరీ విద్యాసంస్థలు ఒక యుద్ధంలా మారుమూల ప్రాంతాల్లో విద్యాసంస్థలు స్థాపించి, ఆసుపత్రులు నిర్మించి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను జాతికి అందించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు క్రిస్టియన్‌ మిషనరీ విద్యాసంస్థలు, ఆసుపత్రుల కారణంగా ఇప్పుడు మన దేశ ప్రజల సగటు ఆయుర్దాయం 72 సంవత్సరాలకు పెరిగింది. జనాభాలో తక్కువగా ఉన్న క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు వారిపై దయతో కాదు... వారికి ఇస్తున్న హక్కులు.  రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో క్రిస్టియన్లు, ముస్లింలు శ్మశాన వాటికలు కోరుతున్నారు. గ్రామాలకు దూరంలో ఉన్న స్థలాలను కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఏసు ప్రభువు జన్మదినం శాంతితో పాటు ప్రేమను పంచాలి. క్రిస్మస్, నూతన సంవత్సరం గొప్ప మార్పును తీసుకురావాలి. తెలంగాణ రైజింగ్‌తో దేశంలోనే మనం ప్రథమ స్థానంలో ఉండాలని ప్రభువును ప్రార్థించాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, మైనార్టీ సంక్షేమ కార్యదర్శి షఫివుల్లా, మైనార్టీ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ దీపక్‌జాన్, మాజీ డీజీపీ స్వరణ్‌జిత్‌ సేన్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బిషప్‌లు, క్రైస్తవ మతపెద్దలు పాల్గొన్నారు. వివిధ ఆశ్రమాల నుంచి వచ్చిన అనాథలకు సీఎం క్రిస్మస్‌ బహుమతులు అందజేశారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
  • బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
  • సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
  • రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • మీ టాయిలెట్టే మీ డాక్టర్‌ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
  • 70 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్‌ ఇవ్వనుంది.
  • డాన్‌.. సింబా.. లియో డాన్‌.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్‌.. రాణా.. విరాట్‌.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
  • చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్‌ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
  • ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్‌ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్‌ బయోటెక్‌ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేచస్‌ ఎల్ల తెలిపారు.
  • నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
  • మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
  • మున్సిపల్‌ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్‌ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్‌ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్‌ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
  • పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్‌ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
  • యాదగిరిని నేడు హాజరుపరచండి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆకుల యాదగిరిని బుధవారం ఉదయం 10.30కు కోర్టులో హాజరుపరచాలని ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
  • ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురు ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో నిందితురాలి (ఏ6)గా ఉన్న ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
  • ‘ల్యాబొరేటరీ ఆఫ్‌ ది ఫ్యూచర్‌’గా హైదరాబాద్‌: శ్రీధర్‌బాబు జీవశాస్త్ర రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ శరవేగంగా ఎదుగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
  • కార్‌ టీ-సెల్‌ థెరపీతో క్యాన్సర్‌ చికిత్సలో విప్లవాత్మక మార్పులు కార్‌ టీ-సెల్, జీన్‌ థెరపీలతో భవిష్యత్తులో క్యాన్సర్‌ చికిత్సలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం(అమెరికా) ప్రొఫెసర్‌ డాక్టర్‌ బ్రూస్‌ లెవిన్‌ పేర్కొన్నారు.