President Murmu: భారతీయ ప్రాచీన జ్ఞానంతో ప్రపంచ సమస్యల పరిష్కారం

Eenadu icon
By Telangana News Desk Published : 21 Dec 2025 04:09 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

 

ఈనాడు, హైదరాబాద్‌; గచ్చిబౌలి, న్యూస్‌టుడే: సామాజిక ఐక్యతకు, జాతీయ ప్రగతికి ఆధ్యాత్మికత ఒక బలమైన పునాదిగా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆధ్యాత్మిక చైతన్యంతో ప్రేరణ కలిగిన ప్రజలు సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేస్తారని, దేశ నిర్మాణానికి చురుగ్గా సహకరిస్తారని పేర్కొన్నారు. బ్రహ్మకుమారీస్‌ శాంతిసరోవర్‌ 21వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం గచ్చిబౌలిలోని గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ‘భారత కాలాతీత జ్ఞానం: శాంతి, పురోగతికి మార్గం’ సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు. భారతీయ ప్రాచీన జ్ఞానం, ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న మానసిక, నైతిక, పర్యావరణ సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఆమె అన్నారు. వేల ఏళ్లుగా భారతీయ నాగరికత సత్యం, న్యాయం, కరుణ, ప్రకృతితో మమేకమై జీవించడం వంటి సూత్రాలపై ఆధారపడి ఉందని గుర్తుచేశారు. వసుధైక కుటుంబం భావన నేటి ప్రపంచ శాంతికి అత్యంత అవసరమన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా భారతీయ ప్రాచీన జ్ఞానానికి ప్రపంచ గుర్తింపు లభించిందని... తద్వారా ప్రపంచ శాంతికి, మానవ కల్యాణానికి అగ్రదూతగా భారత్‌ నిలిచిందని ఆమె తెలిపారు. భౌతిక అభివృద్ధితో మాత్రమే జీవితంలో సుఖశాంతులు లభించవని... అంతర్గత స్థిరత్వం, భావోద్వేగాల నియంత్రణ, విలువలతో కూడిన ఆలోచన చాలా అవసరమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధిని కాంక్షించే సమతుల అభివృద్ధి ఉపనిషత్తుల సారాంశానికి అనుగుణంగా ఉందని రాష్ట్రపతి చెప్పారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ సంకల్పం మనకు స్వావలంబన నేర్పుతోందన్నారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ ఇంధనం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రకృతితో సహజీవనం చేయాలనే భారతీయ ఆలోచన విధానం నుంచి ఉద్భవించాయని వివరించారు. భారతీయ విలువలను వివిధ దేశాలకు వ్యాపింపజేస్తున్నాయంటూ బ్రహ్మకుమారీస్‌ సంస్థను రాష్ట్రపతి అభినందించారు. 21 ఏళ్లుగా విలువలతో కూడిన వ్యక్తిత్వ నిర్మాణం, శాంతి, సానుకూలతలు పెంపొందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

మానవాళికి విలువలు నేర్పుతున్నాం: గవర్నర్‌ 

శాంతి, కరుణ, ఆత్మనియంత్రణ, సామరస్యం, శాంతియుత సహజీవన విలువలను మన దేశం యుగాలుగా మానవాళికి అందించిందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. వేగవంతమైన శాస్త్రీయ పురోగతితో పాటు ఒత్తిడి, సంఘర్షణలు, పర్యావరణ సమస్యలు, నైతిక అయోమయాన్ని మానవాళి నేడు ఎదుర్కొంటోందన్నారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, బ్రహ్మకుమారీస్‌ సంయుక్త ప్రధాన నిర్వాహకుడు రాజయోగి బి.కె.సంతోష్‌ దీక్షిత్, అదనపు ప్రధాన కార్యదర్శి రాజయోగి బి.కె.మృదుంజయ, హైదరాబాద్‌ డైరెక్టర్‌ రాజయోగిని బి.కె.కుల్దీప్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో చేపట్టే పలు సేవా ప్రాజెక్ట్టులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. వృద్ధుల కోసం సంజీవని, పాఠశాల ఉపాధ్యాయుల కోసం విలువల ఆధారిత శిక్షణ కార్యక్రమాలు, డిజిటల్‌ వ్యసనాన్ని తగ్గించేందుకు యువత, కార్పొరేట్‌ రంగం కోసం డిజిటల్‌ వెల్‌నెస్‌ కార్యక్రమాలను ప్రారంభించారు. అంతకుముందు శాంతి సరోవర్‌ ప్రాంగణంలో రాష్ట్రపతి మొక్కలు నాటారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పార్టీలో అవమానం ఇంకెంతకాలం.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి ప్రశ్న వలసవాదికి జగిత్యాల పురపాలక ఛైర్‌పర్సన్‌ పదవి ఇచ్చారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాలలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
  • ఆ బూడిద భారం కరెంటు ఛార్జీలపై వద్దు! థర్మల్‌ విద్యుత్కేంద్రాల (టీపీపీల) నుంచి వెలువడుతున్న బూడిదను అవసరమైతే పరిశ్రమలకు ఉచితంగానైనా ఇచ్చేయాలని, దాని తరలింపు పేరుతో సామాన్య ప్రజలు చెల్లించే కరెంటు ఛార్జీలపై ఆర్థికభారం మోపవద్దని కేంద్ర విద్యుత్‌శాఖ ఆదేశించింది.
  • రూ.కోట్లు పోయె... గెలవకపాయే! వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల పరిస్థితి ఇది. ఖర్చుల కోసం అప్పులు చేసి, వాటిని తీర్చే మార్గంలేక ఆస్తుల అమ్మకానికి సిద్ధపడుతున్నారు.
  • కర్ల రాజేశ్‌ మృతి కేసులో అలసత్వం ఎందుకు? దళిత యువకుడు కర్ల రాజేశ్‌ మృతి ఘటనలో అధికారుల పనితీరుపై జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు వడ్డేపల్లి రామచందర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.
  • మేయర్‌ జీతమెంతో తెలుసా? రాష్ట్రంలోని 7నగరపాలక సంస్థలు, 105 పురపాలక సంఘాలకు ప్రథమ పౌరులు వచ్చారు. కొత్త మేయర్లు, ఉపమేయర్లు.
  • తల్లడిల్లుతూ.. తల్లి ప్రేమను చాటిన ఆవు తల్లి ప్రేమకు భాష అక్కర్లేదని, పేగు బంధానికి మాటలు అవసరంలేదని ఓ మూగజీవి చాటింది. తన బిడ్డను కోల్పోయిన ఆవేదనలో ఉన్న ఆ గోమాత చూపిన చొరవ అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
  • ‘పుర’ విజేతల్లో 64 మంది మహిళలే రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 112 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్లు, ఛైర్‌పర్సన్ల పదవులకు జరిగిన పరోక్ష ఎన్నికల్లో 57.14% మంది మహిళలు విజయం సాధించారు.
  • వైభవంగా మల్లన్న ‘పెద్ద పట్నం’ సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున ‘పెద్ద పట్నం’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
  • శ్రీ చైతన్య ప్రభంజనం జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌-1 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టించాయి. శ్రీ చైతన్య విద్యార్థి పసల మోహిత్‌ 300/300 మార్కులతో 100 పర్సంటైల్‌ సాధించి జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు.
  • జమ్మికుంటలో తోపులాట కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పురపాలక ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికలో హైడ్రామా చోటుచేసుకుంది.
  • కాంగ్రెస్‌ మద్దతుతో.. భారత రాష్ట్ర సమితి అభ్యర్థికి పీఠం వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక ఉద్రిక్తతకు దారి తీసింది. ఇక్కడ మొత్తం 10 వార్డులకుగాను.. భాజపా, భారత రాష్ట్ర సమితి  , కాంగ్రెస్‌ అభ్యర్థులు మూడేసి వార్డుల్లో గెలిచారు.
  • ‘సీఐఐ-ఐజీబీసీ’ జాతీయ ఛైర్మన్‌గా సి.శేఖర్‌రెడ్డి కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ)-ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) జాతీయ ఛైర్మన్‌గా సీఎస్‌ఆర్‌ ఎస్టేట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.శేఖర్‌రెడ్డి ఎంపికయ్యారు.
  • జగిత్యాల భాజపా జిల్లా అధ్యక్షుడిపై దాడి మెట్‌పల్లి పట్టణంలో ఛైర్మన్‌ సీటు కోల్పోయామన్న ఆగ్రహంతో భాజపా కార్యకర్తలు, ఆ పార్టీ తరఫున ఎన్నికైన కౌన్సిలర్లు.. తమ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు ఇంటిపై సోమవారం దాడి చేశారు.
  • బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం ‘అరుదైన వ్యాధి తినేస్తోంది..ఆదుకోండి!’ అనే శీర్షికన ‘ఈనాడు’లో సోమవారం ప్రచురితమైన మానవీయ కథనానికి దాతలు స్పందించారు.
  • విద్యుత్తు బకాయిల వివాదంలో గీతం వర్సిటీకి ఊరట విద్యుత్తు బకాయిల వివాదం నుంచి హైదరాబాద్‌లోని గీతం యూనివర్సిటీకి తాత్కాలిక ఉపశమనం లభించింది.
  • క్యాన్సర్‌కు కణ చికిత్స క్యాన్సర్‌ చికిత్సలో ఒక విప్లవాత్మక అధ్యాయం మొదలైంది. మహమ్మారిని అంతమొందించేందుకు ‘కణ’ చికిత్సను విజయవంతంగా ఆవిష్కరించారు అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డాక్టర్‌ బ్రూస్‌ లెవిన్‌. వర్సిటీలోని ‘పెరెల్మాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో క్యాన్సర్‌ చికిత్సలో సెల్, కార్‌-టి సెల్, జన్యు థెరపీలపై ఆయన చేసిన పరిశోధనలు విజయవంతమయ్యాయి.
  • ఒకే వాహనంలో వచ్చిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, భాజపా ఎంపీ ఇస్నాపూర్‌ పురపాలక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ఒకే వాహనంలో వచ్చారు.
  • హైదరాబాద్‌లో సనోఫీ జీసీసీ విస్తరణ ఔషధ తయారీ సంస్థ సనోఫీ హెల్త్‌కేర్‌ ఇండియా, హైదరాబాద్‌లో తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను భారీగా విస్తరించింది. అత్యాధునిక హంగులతో అదనపు కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించింది.
  • పీఠాలపై దంపతులు నిర్మల్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన అప్పాల కావ్య, గణేశ్‌చక్రవర్తి దంపతులు ఎన్నికయ్యారు.
  • ఆ మూడు పార్టీల మధ్య బంధమేంటో ప్రజలకు చెప్పాలి కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి  , ఎంఐఎం పార్టీలు ఏకమై భాజపాను ఎదగనీయకుండా కుట్రలు చేస్తున్నాయని, అయినా రాష్ట్రంలో కమలం బలపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు.