Insurance: అందరికీ బీమా సాధ్యమే

Eenadu icon
By Business News Desk Published : 21 Dec 2025 03:00 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని ప్రజలందరికీ బీమా రక్షణ కల్పించాలనే లక్ష్య సాధనకు చేరువ  అయ్యే అవకాశం బీమా చట్టాల సవరణతో లభిస్తుందని కేర్‌ ఎడ్జ్‌ రేటింగ్స్‌ తాజాగా విశ్లేషించింది. 2047 నాటికి ప్రజలందరికీ తప్పనిసరిగా బీమా కవరేజీ ఉండాలని కేంద్రం లక్ష్యం పెట్టుకున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే సబ్‌కా బీమా, సబ్కీ రక్షా పేరుతో బీమా చట్టాల (సవరణ) బిల్లు-2025ని ఈ నెల 17న రాజ్యసభ ఆమోదించింది. బీమా సంస్థలు, రీ-ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ఇంటర్మీడియేట్స్‌కు సంబంధించిన నియమ నిబంధనలు, వృద్ధి అవకాశాలు, బీమా వినియోగదార్ల సంరక్షణకు సంబంధించిన పలు అంశాలు ఇందులో ఉన్నాయి.

100% ఎఫ్‌డీఐకి అవకాశం

ఈ సవరణ బిల్లుతో బీమా చట్టం-1938, ఎల్‌ఐసీ చట్టం-1956, ఐఆర్‌డీఏఐ చట్టం- 1999లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బీమా సంస్థల్లో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ)కి అవకాశం కలుగుతోంది. ప్రస్తుతం ఈ పరిమితి 74% వరకూ ఉంది. ఇకపై విదేశీ సంస్థలు భారతీయ భాగస్వామి లేకుండానే 100% పెట్టుబడితో బీమా వ్యాపారంలోకి అడుగుపెట్టవచ్చు. ప్రస్తుత చట్ట సవరణ వల్ల విదేశీ రీ-ఇన్సూరెన్స్‌ సంస్థలకు నికర సొంత నిధుల (నెట్‌ ఓన్డ్‌ ఫండ్స్‌) అవసరాలు తగ్గుతాయి. బీమా సంస్థలు, ఇంటర్మీడియేట్‌ సంస్థలపై ఐఆర్‌డీఏఐకు ఇంకా అధిక నియంత్రణ అధికారాలూ లభిస్తాయి. ముఖ్యంగా బీమా ఏజెంట్లకు ఇచ్చే కమీషన్లను నియంత్రించే అవకాశం కలుగుతుంది. ‘పాలసీ హోల్డర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌’ ఏర్పాటు చేయటానికీ మార్గం సుగమం అయ్యింది. ఇకపై డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ (డీపీడీపీ) యాక్ట్‌- 2023 నిబంధనల ప్రకారమే సమాచారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

కొన్ని బీమా సంస్కరణలకు ప్రస్తుత చట్ట సవరణలో చోటు దక్కలేదు. కాంపోజిట్‌ లైసెన్స్‌ జారీ, కొత్త బీమా సంస్థలకు మూలధన నిబంధనల సడలింపు, క్యాప్టివ్‌ ఇన్సూరర్స్, ఓపెన్‌ ఏజెంట్‌ విధానం... తదితర అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. 

పరిశ్రమకు మేలు

100% ఎఫ్‌డీఐకి అనుమతి ఇవ్వటం వల్ల బీమా సంస్థలకు మూలధన నిధుల లభ్యత పెరుగుతుందని, తత్ఫలితంగా బీమా పాలసీలకు ప్రజలు మరింత దగ్గర అయ్యే అవకాశం ఉంటుందని కేర్‌ ఎడ్జ్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ సంజయ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. అంతేగాక బీమా కంపెనీలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని తెలిపారు. మొత్తం మీద ఈ సంస్కరణలతో బీమా సదుపాయం విస్తరించటంతో పాటు బీమా పరిశ్రమ స్ధిరమైన వృద్ధి బాట పట్టే అవకాశం ఉంటుందని వివరించారు. ఐఆర్‌డీఏఐకి అదనపు అధికారాలు ఇవ్వటం వల్ల పరిశ్రమకు మేలు జరుగుతుందని విశ్లేషించారు.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఒక ఛార్జింగ్‌తో 543 కి.మీ. ప్రయాణం మారుతీ సుజుకీ ఇండియా తన తొలి బ్యాటరీ విద్యుత్‌ వాహనం (బీఈవీ) ఇ విటారాను దేశీయంగా విడుదల చేసింది. బ్యాటరీ యాజ్‌ ఎ సర్వీస్‌ (బాస్‌) పథకం కింద  ఇ విటారా బీఈవీలను రూ.10.99 లక్షల పరిచయ ధరకు విక్రయించబోతోంది.
  • ఏఐ రెడీ డేటా సెంటర్లపై రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు పునరుత్పాదక ఇంధన ఆధారిత, భారీ స్థాయి ఏఐ (కృత్రిమమేధ) రెడీ డేటా సెంటర్ల అభివృద్ధి నిమిత్తం 2035 కల్లా 100 బి. డాలర్ల (సుమారు రూ.9 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్‌ ప్రకటించింది.
  • ఔషధ తయారీలో ‘ఏఐ’శకం ప్రపంచ ఔషధ రంగం కూడా కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. మందుల ఆవిష్కరణ మొదలు, వాటి తయారీ వరకు ప్రతి దశలోనూ ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
  • ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ప్రపంచ దేశాలకు జనరిక్‌ ఔషధాల సరఫరాలో అగ్రగామిగా ఉన్న భారత్, 2030 నాటికి బయోలాజిక్స్, బయోసిమిలర్స్‌ విభాగాల్లో భారీ మార్పులు చూడబోతోందని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సహ-ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ ప్రసాద్‌ అన్నారు.
  • పుంజుకున్న ఐటీ షేర్లు వరుసగా రెండో రోజూ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, భారీ యంత్రపరికరాల రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం ఇందుకు దోహదం చేసింది.
  • ఏఐ సమిట్‌.. నియామకాల వేదిక! దేశీయ అగ్రగామి కార్పొరేట్‌ సంస్థలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, అదానీ గ్రూపు.. దిల్లీలో జరుగుతున్న ఏఐ సమిట్‌ను నిపుణుల నియామకాలకు ఒక వేదికగా వాడుకుంటున్నాయి. దేశీయ ఏఐ రంగంలో అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు వేగవంతం అవుతున్నాయి.
  • ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్‌! విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష సేవల సంస్థ స్పేస్‌ ఎక్స్‌ అధిపతి.. అమెరికా అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (54), ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌ (లక్ష కోట్ల డాలర్లు-రూ.90 లక్షల కోట్లు కలిగిన వ్యక్తి)గా అవతరించనున్నారు.
  • జియో ఆరోగ్య ఏఐతో నిమిషాల్లోనే పరిశీలన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం ఏఐ ఆధారిత క్లినిక్‌ మోడల్‌ను ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో జియో ఆరోగ్య ఏఐ ఆవిష్కరించింది.
  • ఈడీ విచారణకు టీనా అంబానీ గైర్హాజరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు రిలయన్స్‌ గ్రూపు ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ భార్య టీనా అంబానీ మళ్లీ గైర్హాజరు అయ్యారు. మనీలాండరింగ్‌ కేసులో విచారణ నిమిత్తం ఆమెకు ఈడీ ఇప్పటివరకు రెండు సార్లు సమన్లు జారీ చేసింది.
  • బంగారు రుణాలకు ప్రత్యేక శాఖలు బంగారం ధర పెరిగి, ఆభరణాల తనఖా రుణాలకు గిరాకీ పెరుగుతున్నందున, ప్రత్యేకంగా ‘గోల్డ్‌ లోన్‌’ శాఖలు ప్రారంభిస్తున్నట్లు ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ వెల్లడించింది.  గుజరాత్‌లోని జామ్‌నగర్, జునాగఢ్‌లలో ఈ విభాగంలో ప్రత్యేక శాఖలు నెలకొల్పినట్లు పేర్కొంది.
  • సంక్షిప్త వార్తలు(5) సీఓపీడీ, ఆస్తమా, బ్రాంకేటైసిస్‌ రోగులకు శ్వాసను మెరుగుపరచేందుకు, కంజెషన్‌ను తగ్గించేందుకు ఒక పరికరాన్ని ఆవిష్కరించినట్లు జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ పేర్కొంది.