Priyanka Chopra: ‘వారణాసి’ బడ్జెట్ రూ.1300 కోట్లా?: ప్రియాంకా చోప్రా ఏమన్నారంటే

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: రాజమౌళి ( SS Rajamouli) తెరకెక్కించే సినిమాల నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో.. ఆయా చిత్రాల బడ్జెట్ ఎంతో తెలుసుకునేందుకు అంతే ఆసక్తి చూపిస్తుంటారు. మహేశ్ బాబు ( Mahesh Babu) హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ (Varanasi) విషయంలోనూ అదే పరిస్థితి. ఈ క్రమంలోనే రూ.1300 కోట్ల బడ్జెట్ (Varanasi Budget)తో ఈ సినిమా తెరకెక్కుతుందంటూ ప్రచారం జరిగింది. తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ది కపిల్ శర్మ షో’లో కపిల్ శర్మ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అతిథిగా హాజరైన ప్రియాంకా చోప్రాను అడగ్గా.. దానికి సమాధానంగా ఆమె నవ్వులు చిందించారు. ‘మీరు ఈ ప్రాజెక్టులో జాయిన్ అయిన తర్వాతే బడ్జెట్ పెరిగిందట. నిజమేనా?’ అంటూ కపిల్ సరదాగా ప్రశ్నించగా.. ‘‘అందులో సగం నా బ్యాంకు ఖాతాలోకి వెళ్లిందనేది మీ ఉద్దేశమా?’’ అని చమత్కరించారు.
- రాజమౌళి విజన్ ఇంత పెద్దదా..? ఐమ్యాక్స్ వెర్షన్‌లో ‘వారణాసి’ స్పెషల్ వీడియో
ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో మహేశ్ రుద్రగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాల్లో రాముడిగానూ కనిపించనున్నారు. మందాకిని పాత్రలో ప్రియాంక (Priyanka Chopra), కుంభ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ సినిమాని రాజమౌళి ఏయే అంశాలతో తెరకెక్కిస్తున్నారనేది ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ తెలియజేసింది. అప్పటి వరకూ ఉన్న అంచనాలను అది మరింత పెంచేసింది. ఐమ్యాక్స్ వెర్షన్‌లోనూ రూపొందుతున్న ఈ సినిమా 2027 వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో రిలీజ్ చేయాలన్నది రాజమౌళి ప్లాన్.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 13:01 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మరో చారిత్రకగాథతో సంజయ్ లీలా భన్సాలీ.. ‘జై సోమనాథ్’ భారతీయ సినీ ప్రేక్షకులను అలరించడానికి మరో చారిత్రక కథ సిద్ధమవుతోంది. లార్జర్ దేన్ లైఫ్ కథలను అందించడంలో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సిద్ధహస్తులు.
- చిన్న ఛేంజ్.. థియేటర్లలోకి ‘సాంప్రదాయిని సుప్పిని..’రిలీజ్ ఆ రోజే.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (ఎస్‌ఎస్‌ఎస్) విడుదలలో చిన్న మార్పు చోటుచేసుకుంది.
- ఆ జాబితాలోకి ‘ది ప్యారడైజ్’.. కొత్త విడుదల తేదీ వచ్చేసింది నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల వాయిదా పడింది.
- దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్‌కుమార్.. అలరిస్తున్న ప్రమోషనల్ వీడియో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. దర్శకురాలిగా ఓ సినిమాని ప్రకటించారు.
- అందుకే మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ : ‘కపుల్ ఫ్రెండ్లీ’ నిర్మాత ‘కపుల్ ఫ్రెండ్లీ’ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిందని ధీరజ్ మొగిలినేని తెలిపారు.
- వాలెంటైన్స్ డే స్పెషల్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే! వాలెంటైన్స్ డే సందర్భంగా పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించే చిత్రాలేంటో చూసేయండి.
- 2027 సంక్రాంతికి అక్కినేని హీరో మూవీ.. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ఆసక్తికర పోస్టు తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ప్రకటించింది.
- ఈ కథ చిరంజీవికి బాగా తెలుసు.. విజయ్ సేతుపతిని అనుకున్నా కానీ: అర్జున్ తాను డైరెక్ట్ చేసిన ‘సీతాపయనం’ గురించి అర్జున్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
- పవర్‌ఫుల్ టైటిల్‌తో తరుణ్ భాస్కర్ మూవీ.. ‘జీపీఎస్’ అంటే ఇదే తరుణ్ భాస్కర్ కొత్త టైటిల్‌ను ప్రకటించారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న రెండో చిత్రమిది.
- రామ్‌చరణ్ ‘పెద్ది’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఇదే రామ్‌చరణ్ సినిమా ‘పెద్ది’ విడుదల వాయిదా పడింది.
- పవన్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’.. రిలీజ్ డేట్ ఫిక్స్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ విడుదల తేదీ ఖరారైంది.
- ‘డెకాయిట్’ మరోసారి వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే అడివి శేష్ ప్రధాన పాత్రలో రానున్న ‘డెకాయిట్’ మరోసారి వాయిదా పడింది
- ‘వారణాసి’కి ‘అవతార్’తో పోలిక.. రాజమౌళి ఏమన్నారంటే! ‘వారణాసి’ కోసం రాజమౌళికి ప్రియాంక చోప్రా ఒక విజ్ఞప్తి చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె దాని గురించి వివరించారు.
- వేసవిలో ‘బైకర్’.. శర్వా మూవీ కొత్త విడుదల తేదీ ఇదే శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘బైకర్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది.
- ధనుష్- సాయి పల్లవి జోడీ.. మరోసారి.. ఆ హిట్ డైరెక్టర్‌తో ధనుష్, సాయి పల్లవి మరో సినిమాలో సందడి చేయనున్నారు.
- ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో వినోదం వాటిదే! 2026లో మరో నెల ముగిసింది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు వస్తున్నాయి. మరి అవేంటో చూసేయండి.
- 94 ఏళ్ల వయసులో సింగీతం కొత్త మూవీ.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వైవిధ్యంగా సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. ప్రయోగాత్మక చిత్రాలకే కేరాఫ్ అడ్రస్.. మాటలే లేకుండా మూవీ తీసిన సినీ రుషి.
- ‘వారణాసి’ విడుదల అప్పుడే.. ప్రకటించిన రాజమౌళి ‘వారణాసి’ (Varanasi) విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది.
- టాలీవుడ్‌కు కొత్తందం.. రషా థడానీ ఫస్ట్‌లుక్ చూశారా! ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి రషా థడానీ లుక్‌ను రిలీజ్ చేశారు.
- ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టికెట్స్.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. వారికి మాత్రమే! ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్ర బృందం టికెట్లపై ఆఫర్ ప్రకటించింది.