‘అమరజీవి జలధార’తో గోదావరి జిల్లాల దాహార్తి తీరుస్తాం

- A
- A+
- A++

ఈనాడు, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే, పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం: ‘గోదావరి పారుతున్నా ఇక్కడి ప్రజలకు మంచి నీరు లేకపోవడం బాధాకరం. అందుకే ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టు నిర్మాణం. దీనిని కేటాయించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకారులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ శాతం తీర ప్రాంతాలను కలిపేలా రూ.3050 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 2027 నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భీమవరం పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి జలాలు పచ్చగా ఉండడాన్ని గమనించానని, ఆ నీటినే వడబోసి తాగుతున్నారని తెలిసి ఆవేదనకు గురయ్యానన్నారు.
నియంత్రణ పాటించాలి..ప్రాంగణం బయట ఉన్న అభిమానులు బారికేడ్లు దాటి లోపలకు వచ్చే ప్రయత్నం చేస్తుండగా పవన్ కల్యాణ్ వారిని సముదాయించారు. కొంత నియంత్రణ పాటించాలని సుతిమెత్తగా హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో 60 శాతం ద్విచక్రవాహనాలే ఉంటున్నాయని, అంతా జాగ్రత్తగా ఇళ్లకు చేరాలని సూచించారు. సభలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, రామాంజనేయులు, పితాని సత్యనారాయణ, ధర్మరాజు, ఆరిమిల్లి రాధాకృష్ణ, చింతమనేని ప్రభాకర్, బాలరాజుతోపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
పెరవలిలో అమరజీవి జలధార శంకుస్థాపన కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్. చిత్రంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రులు కందుల దుర్గేష్, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే బలరామకృష్ణ, పితాని సత్యనారాయణ, సత్యప్రభ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆరిమిల్లి రాధాకృష్ణ తదితరులు

సభలో ఎవరేమన్నారంటే..
రఘురామకృష్ణరాజు, ఉప సభాపతి:ఉభయగోదావరి వాసుల తాగునీటి సమస్యకు పవన్ పరిష్కారం చూపడం గర్వించతగ్గ విషయం. రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నాం. మహానుభావుల పేర్లు జనబాహుళ్యంలో ఉండేలా పథకాలకు పెట్టడం వారి స్ఫూర్తిని భావితరాలకు అందించడమే.
భూపతిరాజు శ్రీనివాసవర్మ, కేంద్రమంత్రి:జల్‌జీవన్ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వడానికి ముందుకు రాగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయడానికి ముందుకు రాలేదు. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి చొరవతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ.3050 కోట్లు విడుదల చేయించగలిగారు.
► Read latest West godavari Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 05:01 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- చిన్నారి తల్లులు [ 19-02-2026] ఇటీవల జరిపిన ‘పాపులేషన్ మేనేజ్‌మెంటు సర్వే 2025-26’లో జిల్లా అత్యధిక కౌమార గర్భధారణలు జాబితాలో ఉన్నట్లు తెలింది. తీవ్రత 12-15 శాతం ఉంటే ప్రమాదకరం, 10-12 శాతంగా ఉంటే అత్యంత ఎక్కువ. ఏలూరు జిల్లా 10-12%లో ఉంది.
- బెయిల్‌పై వచ్చి.. చోరీకి పాల్పడి [ 19-02-2026] ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల కిందట గుంటూరు జిల్లా పొన్నూరు పరిధి చింతలపూడిలోని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాతృమూర్తి ప్రమీలాదేవి ఇంట్లో రూ.70 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీ అయిన విషయం తెలిసిందే.
- కలత తీరేలా.. కలల ఇల్లు కట్టేలా! [ 19-02-2026] తిండి తిన్నా.. తిన్నకున్నా.. మంచి వస్త్రం కట్టినా.. కట్టకున్నా.. తల దాచుకునేందుకు గూడు ఉండాలన్నది సగటు పేద, మధ్య తరగతి ప్రజల కల. అల్పదాయ వర్గాలకు ఇల్లు అందని ద్రాక్షవుతోంది.
- నమ్మించి.. నిలువునా ముంచేసి.. [ 19-02-2026] ఉద్యోగాల పేరుతో దాదాపు రెండేళ్లుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాగుతున్న దందాలో చిక్కుకున్న బాధితుల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది.
- షార్ట్‌సర్క్యూట్‌తో పేలిన ఫ్రిజ్ [ 19-02-2026] విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ ప్రభావంతో ఇంట్లో ఫ్రిజ్ పేలిపోగా గది ధ్వంసమైంది. ఇతర గృహోపకరాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.