పరిశ్రమల హబ్‌గా అనకాపల్లి

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Published : 21 Dec 2025 06:00 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఈనాడు డిజిటల్, అనకాపల్లి - న్యూస్‌టుడే, కశింకోట, అనకాపల్లి పట్టణం, గ్రామీణం, ఎస్‌.రాయవరం, మాకవరపాలెం: ‘అనకాపల్లి జిల్లా పరిశ్రమల హబ్‌గా మారనుంది. అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, మాకవరపాలెం మండలాల్లో 24,843 ఎకరాలను సేకరించాం. కోడూరు, పరవాడ, అచ్యుతాపురం మండలాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను తీసుకొచ్చాం. నక్కపల్లి మండలంలో 93 ఎకరాల్లో తొలి ప్రైవేటు పార్కు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో రూ.2.89లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకొచ్చాయి. వీటితో వేల మందికి ఉద్యోగ, ఉపాధి 
అవకాశాలు కలగనున్నాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెంలో శనివారం పర్యటించిన ఆయన సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆర్గానిక్‌ బెల్లంతో ఎగుమతులు:‘అరకు కాఫీ ఒకప్పుడు ఎవరికీ తెలీదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయింది. కొనుగోళ్లు భారీగా పెరిగాయి. దేశంలోనే రెండో అతిపెద్ద బెల్లం మార్కెట్‌ అనకాపల్లిలో ఉంది. ఇక్కడ ఆర్గానిక్‌ బెల్లం తయారు చేస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేయవచ్చు. ఈ బాధ్యత ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ తీసుకోవాలి. పోలవరం నీళ్లు త్వరలోనే అనకాపల్లికి వస్తాయి. ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తాం. గోదావరిని వంశధారకు అనుసంధానం చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

పర్యటన సాగిందిలా..:తాళ్లపాలెంలో ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ముందుగా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నడుచుకుంటూ సంపద తయారీ కేంద్రానికి వెళ్లారు. తడి, పొడి సేకరణపై పారిశుద్ధ్య కార్మికులు, స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. చెత్తను ఎరువుగా తయారు చేసే యూనిట్‌ నిర్వాహకుడితో మాట్లాడారు. 

సీఎంకు ఘన స్వాగతం: 

అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఉగ్గినపాలెం హెలిప్యాడ్‌ వద్ద  సభాపతి అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, హోం మంత్రి అనిత, పురపాలక శాఖా మంత్రి నారాయణ, కలెక్టర్‌ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్‌సిన్హా, స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పట్టాభి, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. సమావేశాల్లో ఎమ్మెల్యేలు పంచకర్ల, బండారు సత్యనారాయణమూర్తి, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ కోట్ని బాలాజీ, పాల్గొన్నారు. 

► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • నౌకల పండగ.. అంబరాన్నంటగా..! [ 19-02-2026] విశాఖ తీరంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష (ఐఎఫ్‌ఆర్‌) నావికాదళం సత్తా చాటింది. 66 భారత యుద్ధ నౌకలు, 19 విదేశీ నౌకలు..60కిపైగా విమానాలు.. 3 జలాంతర్గాములు..మొత్తం 74 దేశాల భాగస్వామ్యమయ్యాయి.
  • ఉకు ఉత్పత్తి మళ్లీ మొదటికి..! [ 19-02-2026] విశాఖ ఉక్కు కర్మాగారంలో మళ్లీ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. ఈ ఏడాది జనవరిలో రూ.54కోట్ల లాభాలు రాగా, మరింత ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన సమయంలో అడుగులు తడబడుతున్నాయి. కోక్, ముడి సరకు కొరతే దీనికి కారణమని చెబుతున్నారు.
  • సహిత విద్యలో సాంకేతిక వెలుగు [ 19-02-2026] దివ్యాంగుల భవిత మరింత ఉజ్వలం కానుంది. సహిత విద్య ఇప్పుడు సమూల మార్పులతో సరికొత్తగా అందుబాటులోకి వస్తోంది. వీరి సమగ్ర అభివృద్ధికి ‘దృష్టి’ ప్రాజెక్టు సిద్ధమైంది. ఇన్నాళ్లు చోటు చేసుకున్న తప్పిదాలు,
  • పగలు ఖాళీ.. రాత్రుళ్లు లూటీ [ 19-02-2026] జిల్లాలో గ్రావెల్‌ తవ్వకందారుల దందాకు అడ్డుకట్ట పడటం లేదు. గత ప్రభుత్వ హయాంలో చెలరేగిపోయిన వారు ఇటీవల కాలంలో మళ్లీ విజృంభించారు. రాత్రయితే చాలు.. కొండలను కొల్లగొట్టేస్తూ..
  • అక్వాకు ఆసరా.. నాణ్యతకు భరోసా! [ 19-02-2026] రొయ్యలు, చేపలు.. మాంసాహార ప్రియులకు ఎంతో ప్రత్యేకం. వీటి సాగు ద్వారా జిల్లాలో రూ.వందల కోట్ల వ్యాపారం జరుగుతుండగా, సాగులో వివిధ పరీక్షలుచేసే ప్రయోగశాలలు మత్స్య రైతులకు అందుబాటులోకి వచ్చాయి.
  • గూగుల్‌ డేటా సెంటర్‌కు మార్గం సుగమం! [ 19-02-2026] కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటీలో అతిపెద్ద పెట్టుబడిగా గూగుల్‌ డేటా సెంటర్‌ నిలిచింది. గూగుల్‌ ప్రకటించినప్పటి నుంచి వైకాపా నాయకులు భూసేకరణ జరగకుండా పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు.
  • సంకల్ప కళాగ్రామానికి స్వాగతం.. [ 19-02-2026] విశాఖ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నగరానికి తలమానికంగా నిలవగా పెందుర్తి మండలానికి కూడా కీలక పాత్ర దక్కింది. ఈ నెల 20వ తేదీన సుమారు 50 దేశాలకు చెందిన వంద మంది నేవీ డెలిగేట్ల బృందం పెందుర్తి మండలం
  • గడువు దాటితే అ‘ధనం’ చెల్లించాల్సిందే..! [ 19-02-2026] పాఠశాలల్లో ప్రవేశాలు, పాస్‌పోర్టు, ఓటరు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితరాలు పొందేందుకు జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఆస్తి వ్యవహారాలు, బ్యాంకు ఖాతాల్లోని నిధుల బదలాయింపు, ఇతర పనులకు మరణ ధ్రువీకరణ పత్రాలు కీలకంగా మారుతున్నాయి.
  • 44 ఏళ్ల ఉక్కు యాత్ర [ 19-02-2026] విశాఖ ఉక్కు 44 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, కర్మాగారం కేవలం ఉక్కు మాత్రమే ఉత్పత్తి చేయలేదు. ఒక నగరానికి కొత్త గుర్తింపునిచ్చింది. ఒక రాష్ట్రానికి ఆర్థిక బలం అందించింది. ఒక దేశానికి ఆత్మవిశ్వాసం నింపింది.
  • రక్షణ గర్జన.. చూసొద్దాం రండి..! [ 19-02-2026] అంతర్జాతీయ యుద్ధనౌకల పండగను పురస్కరించుకుని గురువారం సాయంత్రం ఆర్కేబీచ్‌ కేంద్రంగా నిర్వహించే అంతర్జాతీయ సిటీ పరేడ్‌కు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 5 గంటల నుంచి 7.20 గంటల వరకు కార్యక్రమం జరగనుంది.
  • ప్రాణం తీసిన చక్రం [ 19-02-2026] కార్ల చక్రాలు ఊడి పోయి ప్రమాదాలు జరగడం చూస్తుంటాం. కానీ ద్విచక్ర వాహనం చక్రం ఊడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన షీలానగర్‌ పోర్టు రోడ్డులో జరిగింది. దీనికి సంబంధించి గాజువాక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.