Madhya Pradesh: ఇంటి బయట కూర్చున్న వృద్ధుడిపై.. బోల్తాపడిన కంకర ట్రక్కు..

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: ఇంటి బయట కూర్చున్న ఓ వృద్ధుడిపై అటుగా వెళ్తున్న ఓ కంకర ట్రక్కు (Dump truck loaded with gravel) బోల్తాపడిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 90 ఏళ్ల వృద్ధుడు గిరిరాజ్ శర్మ తన మనవడు సతీష్‌తో కలిసి నివసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఎండ కోసం వృద్ధుడు ఇంటి బయట ఉన్న అరుగుపైన కూర్చున్నాడు. అటుగా వెళ్తున్న ఓ కంకర ట్రక్కు అదుపుతప్పి ఒక్కసారిగా అతడిపై బోల్తా పడింది. కంకర మీద పడడంతో గిరిరాజ్ శర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు (Madhya Pradesh Man Killed).
కొద్ది రోజుల క్రితం ఆ ప్రాంతంలో నీటి పైపులైను వేయడం వల్ల గుంతలు పడ్డాయి.. వాటిలో ట్రక్కు టైరు దిగబడడంతో వాహనం బ్యాలెన్స్ కోల్పోయి బోల్తా పడినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామన్నారు. ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ పారిపోయాడని.. కేసు నమోదు చేసుకొని అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/02/2026) ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
- ఏప్రిల్‌లో బెంగాల్, తమిళనాడు ఎన్నికలు..! బెంగాల్, తమిళనాడు సహా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ వర్గాలు వెల్లడించాయి.
- వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. కన్నడ నటి వీడియో రికార్డు చేసి, బ్లాక్‌మెయిల్ Kannada actress: ఒక కన్నడ నటికి చేదు అనుభవం ఎదురైంది. వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి, ఆ వీడియోతో తనను బ్లాక్‌మెయిల్ చేశారంటూ ఆమె ఆరోపించారు.