Shubman Gill: ఏదో అనుకుంటే..

Eenadu icon
By Sports News Desk Updated : 21 Dec 2025 07:01 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈ ఏడాది జూన్‌లో టెస్టు జట్టు కెప్టెన్‌ అయ్యాడు శుభ్‌మన్‌ గిల్‌. కొన్ని నెలలకే వన్డేల్లోనూ సారథ్య బాధ్యతలు వరించాయి. టీ20ల్లోనూ అతనే కెప్టెన్‌ కాబోతున్న సంకేతాలు కనిపించాయి. నేరుగా కెప్టెన్‌ను చేయకుండా ముందు వైస్‌ కెప్టెన్సీ అప్పగించారు సెలక్టర్లు. నిలకడగా రాణిస్తే.. సూర్యకుమార్‌ స్థానంలోకి అతణ్ని తీసుకొచ్చి మూడు ఫార్మాట్ల కెప్టెన్‌ను చేయాలన్నది కోచ్, సెలక్టర్ల ఆలోచన! కానీ వారి ప్రణాళిక ఫలించలేదు. కెప్టెన్‌ కావడం సంగతి అటుంచితే.. ఇప్పుడు జట్టులోనే చోటు లేకుండా పోయింది. భారత భవిష్యత్‌ సూపర్‌ స్టార్‌ అవుతాడనుకున్న ఆటగాడికి ఈ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరమే. వైస్‌ కెప్టెన్‌ను చేయడానికి ముందు ఏడాది పాటు గిల్‌ టీ20 జట్టులోనే లేడు. కోచ్‌ గంభీర్‌కు ఫేవరెట్‌గా మారిన అతణ్ని ఉన్నట్లుండి టీ20ల్లోకి తీసుకొచ్చారు. సరైన కారణం లేకుండానే అక్షర్‌ పటేల్‌ను వైస్‌ కెప్టెన్‌గా తప్పించి అతడికి ఆ బాధ్యతలు ఇచ్చారు. గిల్‌ నిలకడగా ఆడి ఉంటే.. పేలవ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ను తప్పించి టీ20 ప్రపంచకప్‌కు అతణ్నే సారథిని చేసేవారేమో. అలా కాకపోయినా పొట్టి కప్పు తర్వాత అయినా అతడికి పగ్గాలు దక్కేవేమో. కానీ వైస్‌ కెప్టెన్‌గా జట్టులోకి వచ్చాక 15 టీ20లు ఆడిన అతను.. 24.25 సగటుతో 291 పరుగులే చేశాడు. అందులో ఒక్క అర్ధశతకం కూడా లేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 4, 0, 28 పరుగులే చేయగలిగాడు గిల్‌. రద్దయిన నాలుగో టీ20 ముంగిట అతడి బొటనవేలికి గాయమైంది. అయినా చివరి టీ20లో ఆడడానికి అది అడ్డంకిగా ఏమీ మారలేదని జట్టు వర్గాల సమాచారం. అయినా గిల్‌ను ఆ మ్యాచ్‌లో ఆడించలేదు. సంజు శాంసన్‌కు అవకాశమిచ్చారు. అతను 37 పరుగులతో రాణించాడు. మరోవైపు ముస్తాక్‌ అలీ టోర్నీలో ఇషాన్‌ కిషన్‌ అదరగొట్టాడు. ఇషాన్‌ మెరుపు శతకంతో ఫైనల్లో ఝార్ఖండ్‌ను గెలిపించాడు. ఆ మ్యాచ్‌కు సెలక్టర్లు ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్‌ ఓజా హాజరయ్యారు. ఫామ్‌ పరంగా సంజు, ఇషాన్‌ల ముందు గిల్‌ నిలవలేని పరిస్థితి ఉండడంతో అతడిపై వేటు వేయక తప్పని పరిస్థితి తలెత్తింది. నిజానికి శుభ్‌మన్‌ టీ20ల్లో ఫామ్‌ అందుకోనప్పటికీ.. కొన్ని రోజుల ముందు వరకు అతణ్ని టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేయాలనే కోచ్, చీఫ్‌ సెలక్టర్‌ భావించారు. కానీ తర్వాత వేగంగా పరిస్థితులు మారిపోయాయి. ఈ వైఫల్యం కారణంగా ఇప్పుడిప్పుడే గిల్‌ మళ్లీ టీ20 జట్టులోకి రావడం కష్టంగా కనిపిస్తోంది. మరోవైపు కొంత కాలంగా ఫినిషర్‌ పాత్రలో ఉపయోగించుకుంటున్న జితేశ్‌ శర్మపై ఇప్పుడు హఠాత్తుగా వేటు వేయడం ఆశ్చర్యానికి గురి చేసేదే. తన గణాంకాలు గొప్పగా లేకపోవచ్చు కానీ.. 7, 8 స్థానాల్లో వస్తున్న అతడికి ఎక్కువ బంతులు ఆడే అవకాశం రాలేదు. రింకును పక్కన పెట్టి జితేశ్‌ను ఆడిస్తూ వచ్చిన జట్టు యాజమాన్యం.. ఇప్పుడు ఉన్నట్లుండి అతడిపై వేటు వేసి మళ్లీ రింకుకు అవకాశం ఇవ్వడంలో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదు. 

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 06:58 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • జింబాబోయ్‌ ఇంగ్లాండ్‌ను నేపాల్, దక్షిణాఫ్రికాను అఫ్గానిస్థాన్‌ వణికించాయి. భారత్‌ను అమెరికా, పాకిస్థాన్‌ను నెదర్లాండ్స్‌ భయపెట్టాయి. మిగతా చిన్న జట్లూ సత్తా చాటాయి. కానీ వాటిలో ఏ జట్టూ గెలుపు తీరాన్ని మాత్రం చేరలేకపోయింది.
  • మనోడు దంచేశాడు తెలుగు కుర్రాడు సాయితేజ ముక్కమల్ల (79; 51 బంతుల్లో 5×4, 4×6) సత్తా చాటాడు. అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో ఆ జట్టు టీ20 ప్రపంచకప్‌లో ఘనంగా బోణీ కొట్టింది.
  • అమెరికా క్రికెట్లో తెలుగుతేజం అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పని చేసే తెలుగు వాళ్లు లక్షల్లో ఉంటారు. ఇంకా అక్కడ డాక్టర్లు, వ్యాపారవేత్తల్లోనూ ఎంతోమంది తెలుగువాళ్లున్నారు.
  • లోటు డబ్బుకే.. ఆటకు కాదు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడి పేరు సంపాదిస్తే.. కోట్లల్లో డబ్బొస్తుంది. కోట్లాది అభిమానుల ఆదరణా దక్కుతుంది. జీవితానికి ఏ లోటూ ఉండదు. భారత్‌ సహా చాలా క్రికెట్‌ దేశాల ఆటగాళ్ల విషయంలో ఇది నిజమే.
  • కెనడాకు యూఏఈ పంచ్‌ టీ20 ప్రపంచకప్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) బోణీ కొట్టింది. ఉత్కంఠభరిత పోరులో కెనడాకు షాకిచ్చి తొలి విజయం నమోదు చేసింది.
  • ముకేశ్‌కు రజతం ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు ముకేశ్‌ నేలవల్లి సత్తాచాటాడు. టోర్నీ చివరి రోజు శుక్రవారం 25 మీటర్ల పిస్టల్‌ జూనియర్ల విభాగంలో 582 పాయింట్లతో రజతం సాధించాడు.
  • భారత్‌కు రజతం ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌ ఛాంపియనషిప్‌ వీల్‌చైర్‌ విభాగంలో భారత్‌ తొలిసారి రజతం నెగ్గింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో అల్ఫియా జేమ్స్, ప్రేమ్‌ కుమార్‌ జోడీ 6-21, 4-21తో క్యుజిమొ, యుటాంగ్‌ (చైనా) జంట చేతిలో ఓడింది.
  • అర్ష్‌దీప్‌ స్థానంలో కుల్‌దీప్‌? భారత్‌- పాకిస్థాన్‌ మధ్య ఆదివారం జరిగే హైఓల్టేజ్‌ మ్యాచ్‌కు పేసర్‌ అర్ష్‌దీప్‌ స్థానంలో స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని భారత్‌ మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ పేర్కొన్నాడు.
  • సంక్షిప్త వార్తలు రాజస్థాన్‌ రాయల్స్‌కు రియాన్‌ పరాగ్‌ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్‌ 2026లో రాజస్థాన్‌కు రియాన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని శుక్రవారం ఫ్రాంచైజీ ప్రకటించింది.