Harish Rao: హరీశ్‌రావు పెద్ద మనసు.. పేద విద్యార్థిని కోసం ఇంటిని తాకట్టుపెట్టి..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

సిద్దిపేట: బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) తన పెద్ద మనసును చాటుకున్నారు. పీజీ వైద్యవిద్య చదువుతున్న ఓ పేద విద్యార్థినికి రుణం కోసం తన ఇంటిని తనఖా పెట్టారు. విద్యార్థిని మమత చదువు కోసం ఏటా రూ.7.50 లక్షలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఏదైనా ఆస్తి తనఖా పెడితేనే రుణం ఇస్తామని బ్యాంకర్లు స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని హరీశ్‌రావు దృష్టికి మమత, ఆమె తండ్రి రామచంద్రం తీసుకెళ్లారు. దీంతో ఆయన సిద్దిపేటలోని తన ఇంటిని తనఖా పెట్టి రూ.20 లక్షల విద్యారుణం ఇప్పించారు. విద్యార్థిని హాస్టల్ ఫీజు కోసం రూ.లక్ష నగదు అందజేశారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 13:54 IST