Dhurandhar: ‘ధురంధర్’ అలా తీయడం దర్శకుడి గొప్పతనం: రామ్‌గోపాల్‌ వర్మ

Eenadu icon
By Entertainment Team Published : 19 Dec 2025 14:14 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది ‘ధురంధర్‌’. ఇప్పటికే ఈ చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) ఎక్స్‌ వేదికగా ‘ధురంధర్‌’పై తన రివ్యూ ఇచ్చారు. ఇది భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేసిందన్నారు. 

‘‘చరిత్రలో ఈ సినిమా (Dhurandhar) ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇది ఏ భాషలో తెరకెక్కిందనే దాని గురించి నేను మాట్లాడడం లేదు. ఇది భారతీయ సినిమా. ఎందుకంటే ఇందులో కనిపించే దృశ్యాలు ప్రతి ప్రేక్షకుడి మనసును హత్తుకుంటాయి. ఇప్పటివరకూ ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. వినోదాన్ని పంచడంతో పాటు ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడం చిత్రబృందం సాధించిన పెద్ద విజయం. ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రతి సీన్‌ ఎప్పటికీ గుర్తుండేలా తీర్చిదిద్దారు. హాలీవుడ్‌ చిత్రాల్లా కాకుండా మన నేటివిటీకి దగ్గరగా అంతర్జాతీయస్థాయిలో కథను రూపొందించొచ్చు అని ఆదిత్య నిరూపించారు. సినిమా మొత్తం చూసిన తర్వాత మన మనసుల్లో ఏదోతెలియని భావోద్వేగం నిండిపోతుంది. అలా తీయడం దర్శకుడి గొప్పతనం’’ అని రామ్‌గోపాల్‌ వర్మ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. 

  • నయనం.. సైకలాజికల్ థ్రిల్లర్.. థ్రిల్‌ పంచిందా!

ఈ పోస్ట్‌పై దర్శకుడు ఆదిత్య ధర్‌ (Aditya Dhar) స్పందిస్తూ.. తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఇకపై ఏ మూవీకి దర్శకత్వం వహించినా ఈ పోస్ట్‌ను చూసి తెరకెక్కిస్తానన్నారు. ‘‘నేను ఎన్నోఏళ్ల క్రితం ఒక చిన్న సూట్‌కేస్‌తో ఎన్నో కలలతో ముంబయికి వచ్చాను. రామ్‌గోపాల్‌ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసినా చాలనుకున్నాను. ఈరోజు ఆయనే నా సినిమాపై పోస్ట్‌ పెట్టడం నమ్మలేకపోతున్నా’’ అని రిప్లై పెట్టారు. ఆర్జీవీ అభిమానిగా ఈ పోస్ట్‌ చూసి తన హృదయం ఉప్పొంగుతోందన్నారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • 45 ఏళ్ల ‘ప్రేమాభిషేకం’.. స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌ ‘ప్రేమాభిషేకం’ విడుదలై 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రత్యేక వీడియో పంచుకుంది.
  • నన్ను చూడగానే మొహం మీదే ఆ మాట అన్నారు: సుహాస్‌ ‘హే బల్‌వంత్‌’తో ప్రేక్షకులకు నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు నటుడు సుహాస్‌.
  • బాలీవుడ్‌ హీరో తండ్రి మృతి.. బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర తండ్రి సునీల్‌ మల్హోత్ర కన్నుమూశారు.
  • అదే బాధగా అనిపిస్తుంది ‘‘మంచి వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమా ‘హే బల్‌వంత్‌’’ అన్నారు హీరో సుహాస్‌. ఇది తన కెరీర్‌లోనే చాలా వేగంగా పూర్తి చేసిన చిత్రమని.. దీనితో తాను ఎదురు చూస్తున్న విజయం అందుకుంటాననే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు.
  • ప్రియమణి.. ఇండో-హాలీవుడ్‌ చిత్రం తెరపై వైవిధ్యమైన పాత్రలతో భావోద్వేగాలను పంచడంతోపాటు.. యాక్షన్‌ సన్నివేశాలతోనూ అదరగొడుతుంది నటి ప్రియమణి. ఇప్పుడామె ఖాతాలో ఓ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ రూపొందించనున్న కొత్త ప్రాజెక్ట్‌ చేరింది.
  • బాలీవుడ్‌ వైపు తొలి అడుగు? గతేడాది ‘మదరాసి’, ‘కాంతార 2’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక రుక్మిణీ వసంత్‌. చిత్రపరిశ్రమకు వచ్చిన తక్కువ రోజుల్లోనే భాషతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంటోన్న ఈ భామ..
  • జోడీ కుదిరేనా! గతేడాది ‘జాక్‌’, ‘తెలుసు కదా’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
  • మరకతమణి 2కి శ్రీకారం ఆది పినిశెట్టి నుంచి వచ్చిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్‌ ‘మరకతమణి’ 2017లో విడుదలై.. ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘మరకతమణి 2’ని పట్టాలెక్కించారు ఆది.
  • ఆ పాటలు వాడొద్దు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. సరిగమ సంగీత సంస్థకు, ఆయనకు కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
  • వెబ్‌సిరీస్‌ కోసం! ‘క’, ‘కె-ర్యాంప్‌’ విజయాలతో జోరు మీదున్నారు యువ హీరో కిరణ్‌ అబ్బవరం. ఇప్పుడాయన ఓటీటీలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ ఫేమ్‌ భరత్‌ కమ్మ దర్శకత్వంలో ముస్తాబు
  • గ్రామీణ కథ ‘సెయాన్‌’ ‘సెయాన్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు శివ కార్తికేయన్‌. ‘అమరన్‌’ విజయం తర్వాత ఆయన.. కమల్‌హాసన్‌ సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. శివకుమార్‌ మురుగేశన్‌ తెరకెక్కిస్తున్నారు.
  • అలియాకు బాఫ్టా గౌరవం ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌కు మరోసారి అంతర్జాతీయ గౌరవం దక్కింది. బాఫ్టా(బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌) 79వ ఎడిషన్‌ పురస్కారాలను అందించే ప్రెజెంటర్ల జాబితాను ప్రకటించింది.
  • సంక్షిప్త వార్తలు (5) ప్రముఖ హిందీ సినీ రచయిత, నటుడు, సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌(90) అనారోగ్య పరిస్థితుల కారణంగా మంగళవారం ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. జావేద్‌ అక్తర్‌తో కలిసి ఆయన రచన చేసిన ‘షోలే’, ‘దీవార్‌’, ‘డాన్‌’ చిత్రాలు భారతీయ చిత్రసీమలో నిలిచిపోయాయి.
  • ‘లైకా’ కేసు.. విశాల్ పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్‌ హైకోర్టు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్‌’కు సంబంధించిన కేసులో ఉత్తర్వులను పాటించేందుకు గడువు కోరుతూ నటుడు విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
  • చెక్‌బౌన్స్‌ కేసు.. జైలు నుంచి రిలీజైన రాజ్‌పాల్‌ ఏమన్నారంటే? బాలీవుడ్‌ నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌ తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు.