Hyderabad: రూ.14కోట్ల సైబర్ మోసం.. సత్తుపల్లికి చెందిన నలుగురి అరెస్ట్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

హైదరాబాద్: సైబర్ నేరాలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నకిలీ పెట్టుబడుల పేరిట జరిగిన మోసంలో ఓ వైద్యుడు ఏకంగా రూ.14.61 కోట్లను పోగొట్టుకున్నారు. సైబర్మోసంలో ఇంత పెద్ద మొత్తంలో పోగొట్టుకున్న ఉదంతం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి కావడంతో పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈకేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బ్రహ్మినాయుడు, పవన్, మణిరామ్, శివకృష్ణను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టయిన నలుగురు నిందితులు.. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సమకూర్చినట్టు గుర్తించారు. నిందితులను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లికోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :