Smriti Mandhana - Deepti Sharma: భారీ రికార్డులపై కన్నేసిన స్మృతి మంధాన, దీప్తి శర్మ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ సాధించిన తర్వాత కొంత విరామం తీసుకున్న భారత మహిళా క్రికెటర్లు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు. డిసెంబరు 21 నుంచి శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు తలపడనుంది. తొలి రెండు మ్యాచ్‌లు విశాఖపట్నం వేదికగా, మిగతా మ్యాచ్‌లు తిరువనంతపురంలో జరగనున్నాయి. ఈ సిరీస్‌లో ఆడనున్న స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ భారీ రికార్డులపై కన్నేశారు. మంధాన మరో 18 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో 4,000 పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కనుంది. స్మృతి ఇప్పటివరకు 153 మ్యాచ్‌లు ఆడి 3,982 రన్స్ చేసింది. న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్ సుజీ బేట్స్ మాత్రమే ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20ల్లో 4 వేల పరుగులు చేసింది.
దీప్తి శర్మ మరో 5 వికెట్లు తీస్తే..
ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) ఆల్‌టైమ్ రికార్డుకు అతి చేరువలో ఉంది. ఆమె మరో ఐదు వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా బౌలర్ మేగాన్ షట్ (151)ని అధిగమించి మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవనుంది. ఇప్పటివరకు 129 మ్యాచ్‌లు ఆడిన దీప్తి.. 6.12 ఎకానమీ రేటుతో 147 వికెట్లు తీసింది. బ్యాటింగ్‌లో 1,100 రన్స్ చేసింది. అంతేకాదు మహిళల అంతర్జాతీయ టీ20ల్లో 1,000 పరుగులు, 150 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించనుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. పురుషుల ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ ఎవరూ ఇప్పటికీ ఈ ఘనత సాధించలేదు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మార్‌క్రమ్ సూపర్ ఇన్నింగ్స్.. కివీస్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
- స్పిన్‌దళం.. పాక్‌లో ఆ ‘ఐదుగురు’.. మరి భారత్‌కు ఎవరు? ప్రేమదాస స్టేడియంలో పేస్‌తోపాటు స్పిన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో భారత్, పాకిస్థాన్ జట్లు నాణ్యమైన స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నాయి.
- కివీస్‌తో మ్యాచ్.. దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 176 పరుగులు టీ20 ప్రపంచ కప్‌లో మరో ఆసక్తికరమైన పోరు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడుతున్నాయి.
- అభిషేక్ శర్మ ఆడతాడు.. ఆ నిర్ణయం మా చేతుల్లో ఉండదు: సూర్యకుమార్ పాక్ బౌలర్ తారిక్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
- ఆదుకొన్న బాంటన్.. స్కాట్లాండ్‌పై ఇంగ్లాండ్ విజయం స్వల్ప లక్ష్య ఛేదనలో కాస్త తడబాటుకు గురైనప్పటికీ ఇంగ్లాండ్ ఆఖరికి విజయం సాధించింది.
- తారిక్ ‘యాక్షన్’కు.. భారత్ ‘రియాక్షన్’ ఎలా ఉంటుందో? ఆదివారం భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్. అయితే, పాక్ ఆటగాడు ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌పైనే ఇప్పుడందరి దృష్టి ఉంది.
- స్కాట్లాండ్‌తో మ్యాచ్.. ఇంగ్లాండ్ లక్ష్యం 153 పరుగులు టీ20 ప్రపంచ కప్‌లో కోల్‌కతా వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు స్కాట్లాండ్ 153 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.
- అప్పట్లో ధోని కెప్టెన్సీ ఎందుకు వీడాడంటే..: జతిన్ పరాంజ్‌పే రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి శుభ్‌మన్ గిల్‌కు (Shubman Gill) 2025లో కెప్టెన్సీ మార్పు జరిగింది. ఇది భారత క్రికెట్‌లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
- అవును..భారత్‌పై మాకు మంచి రికార్డ్ లేదని అంగీకరిస్తాం: పాక్ ఫిబ్రవరి 15న భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య కొలంబో వేదికగా మ్యాచ్. ఇప్పటికే ఇరు జట్లూ అందుకోసం సిద్ధంగా ఉన్నాయి.
- వర్షం వల్ల ఇండియా పాక్ మ్యాచ్ రద్దైతే..? పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాక్.. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఈ మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- ఒమన్ చిత్తు.. 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం కొలంబో వేదికగా ఒమన్‌తో టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.
- భారీ స్కోర్ బాదిన ఐర్లాండ్.. ఒమన్ లక్ష్యం 236 పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా.. కొలంబో వేదికగా ఒమన్, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఒమన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.
- బాబూ.. మీరూ ‘బాధ్యత’ తీసుకోవాలి! టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అసలైన కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 15న తలపడనుంది.
- కొలంబోలో హోటల్ లాబీలో గర్ల్‌ఫ్రెండ్‌తో దర్శనమిచ్చిన హార్దిక్ పాండ్య పాకిస్థాన్‌తో మ్యాచ్ వేళ టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి వార్తల్లో నిలిచాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం జట్టు విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లు కుటుంబసభ్యులతో ఉండటానికి వీల్లేదు. అయితే హార్దిక్ పాండ్య తన గర్ల్‌ఫ్రెండ్ మహిక శర్మతో కొలంబోలోని హోటల్ లాబీలో కనిపించాడు.
- టీమ్‌ఇండియాకు ఆ సత్తా ఉంది: హర్భజన్ సింగ్ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా.. ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో భారత్ విజయ కేతనం ఎగుర వేస్తుందని టీమ్ఇండియా (Team India) మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ అన్నాడు.
- పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ Vaibhav Suryavanshi: అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
- మళ్లీ ‘శివరాత్రి’ మ్యాచ్.. ఫ్యాన్స్‌లో హైవోల్టేజ్ సచిన్‌ను క్రికెట్ దేవుడిగా మార్చిన ఇన్నింగ్స్‌ల్లో ‘శివరాత్రి’ మ్యాచ్ ఒకటి. ఇది యూఏఈలో ఆసీస్‌పై ‘డిజర్ట్ స్ట్రామ్’ ఇన్నింగ్స్‌తో పోటీపడుతూ మాస్టర్ బ్లాస్టర్ కీర్తికిరీటంలో కలికితురాయిగా నిలిచింది.
- జింబాబోయ్ ఇంగ్లాండ్‌ను నేపాల్, దక్షిణాఫ్రికాను అఫ్గానిస్థాన్ వణికించాయి. భారత్‌ను అమెరికా, పాకిస్థాన్‌ను నెదర్లాండ్స్ భయపెట్టాయి. మిగతా చిన్న జట్లూ సత్తా చాటాయి. కానీ వాటిలో ఏ జట్టూ గెలుపు తీరాన్ని మాత్రం చేరలేకపోయింది.
- మనోడు దంచేశాడు తెలుగు కుర్రాడు సాయితేజ ముక్కమల్ల (79; 51 బంతుల్లో 5×4, 4×6) సత్తా చాటాడు. అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆ జట్టు టీ20 ప్రపంచకప్‌లో ఘనంగా బోణీ కొట్టింది.
- అమెరికా క్రికెట్లో తెలుగుతేజం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేసే తెలుగు వాళ్లు లక్షల్లో ఉంటారు. ఇంకా అక్కడ డాక్టర్లు, వ్యాపారవేత్తల్లోనూ ఎంతోమంది తెలుగువాళ్లున్నారు.