Avatar Fire and Ash Review: రివ్యూ: అవతార్ 3.. జేమ్స్ కామెరూన్ ‘మ్యాజిక్’ వర్కౌట్ అయిందా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
Avatar Fire And Ash Review || చిత్రం: ఫైర్ అండ్ యాష్; నటీనటులు: సామ్ వర్దింగ్టన్, జోయా సల్దానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్ తదితరులు; దర్శకత్వం: జేమ్స్ కామెరూన్; విడుదల: 19-12-2025
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ‘అవతార్ ఫైర్ అండ్ యాష్’ (Avatar: Fire and Yash). అవతార్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన మూడో సినిమా ఇది. ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) తెరకెక్కించిన ఈ కొత్త చిత్రం ఎలా ఉందంటే?

కథేంటంటే..
Avatar: Fire and Yash Story || రెండో భాగం అవతార్: ది వే ఆఫ్ వాటర్’ సంఘటనల తర్వాత జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్డానా) జంట తమ పెద్ద కొడుకును కోల్పోయిన బాధలో ఉంటారు. వారి పిల్లలైన కిరి (సిగౌర్నీ వీవర్), లోక్ (బ్రిటన్ డాల్టన్), టూక్ (ట్రినిటీ జో-లి బ్లిస్)తోపాటు దత్త పుత్రుడు లాంటి స్పైడర్ (జాక్ ఛాంపియన్)తో కలిసి జీవిస్తుంటారు. లోక్ కూడా తన వల్లే సోదరుడు మరణించాడనే అపరాధ భావంతో ఉంటాడు. రెండో భాగంలోనే మరణించిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్).. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ జీవం పోసుకొని సల్లీపై ప్రతీకారానికి దిగుతాడు. అతడికి ఈసారి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. సల్లీ కుటుంబం విశ్వసించే ఈవా దేవతపై కోపంతో రగిలిపోతుంటుంది వరంగ్. కల్నల్ క్వారిచ్ నుంచి అత్యాధునికమైన ఆయుధాల్ని ఎలా వాడాలో వరంగ్ తెలుసుకుంటుంది. అలా ఆ ఇద్దరు శత్రువులు కలిసి సల్లీ కుటుంబంపైనా, పండోరా గ్రహంలో ఉన్న ఇతర తెగలపైనా అగ్గి పిడుగులు కురిపించాలని నిర్ణయిస్తారు. మరోవైపు పండోరాని నాశనం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఆర్డీఏ బృందం కూడా వీళ్లకు తోడవుతుంది. (avatar fire and ash review) అంతమంది శత్రువుల్ని జేక్ సల్లీ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరికి ఎవరు పైచేయి సాధించారన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
ఎలా ఉందంటే..
Avatar Fire And Ash Review Telugu || అవతార్ సినిమా అనగానే అందమైన పండోరా గ్రహం, చూడటానికి రెండు కళ్లు చాలవనిపించే ఆ విజువల్సే గుర్తొస్తాయి. ది వే ఆఫ్ వాటర్ అంటూ రెండో భాగాన్ని నీటి ప్రపంచం వైపు తీసుకెళ్లి... తొలి భాగం కంటే భిన్నమైన విజువల్స్‌ని ఆవిష్కరించి ప్రేక్షకుల్ని కట్టిపడేశారు జేమ్స్ కామెరూన్. మూడో చిత్రంలో అగ్నియుద్ధం కోణాన్ని ఆవిష్కరించారు. ఈసారి కూడా విజువల్స్ అద్భుతం అనిపించే స్థాయిలోనే ఉంటాయి. కానీ ప్రేక్షకులు తొలి రెండు సినిమాల స్థాయిలో అబ్బురపడి చూసేలా అయితే ఉండవు. ఇంతకుముందు చూసిన సన్నివేశాల్నే మళ్లీ తెరపై చూసిన అనుభూతి కలుగుతుంది. కొన్ని యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకుంటాయి. స్పైడర్ పాత్ర నేపథ్యంలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి (Avatar 3 Review).
- నయనం.. సైకలాజికల్ థ్రిల్లర్.. థ్రిల్ పంచిందా!
వరంగ్, కిరి పాత్రల నేపథ్యంలో సన్నివేశాలు ఈ సినిమాకి కాస్త కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. ఈవా దేవతతో ఆ పాత్రల్ని ముడిపెట్టిన తీరు, ఆపదలో ఉన్న స్పైడర్‌ని ఈవా దేవత సాయంతో కిరి గట్టెక్కించే సన్నివేశాలు, కల్నల్ క్వారిచ్, వరంగ్ కలిసే సన్నివేశాలు ఈ సినిమాలో మంచి డ్రామా పండిస్తాయి. ఆర్డీఏ చెర నుంచి జేక్ సల్లీ తప్పించుకునేందుకు చేసే పోరాట ఘట్టాలు కూడా ఉత్కంఠ రేకెత్తిస్తాయి. కల్నల్ క్వారిచ్, వరంగ్ పాత్రల కలయికతోనే ఈ సినిమా కథ దాదాపుగా పూర్తయిపోతుంది. ఆ తర్వాత సన్నివేశాలన్నీ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగుతుంటాయి. పతాక సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. యాక్షన్ ప్రధానంగా సాగే విజువల్స్ కట్టిపడేస్తాయి. మొత్తంగా ఫ్రాంచైజీలో భాగంగా వచ్చే సినిమాలకు కథలో కొత్త సంఘర్షణలు చాలా అవసరం అని మరోసారి నిరూపిస్తుందీ చిత్రం.

ఎవరెలా చేశారంటే..
Avatar fire and ash cast and crew || ఈ సినిమాపై నటీనటుల ప్రభావం బలంగా కనిపిస్తుంది. కథానాయకుడు జేక్స్ సల్లీ పాత్రలో సామ్ వర్తింగ్టన్ కనిపించిన తీరు, అభినయం మెప్పిస్తుంది. జో సల్డానా పాత్రని డిజైన్ చేసిన విధానం బాగుంది. స్పైడర్ విషయంలో ప్రథమార్ధంలో ఆమె కోణం ఒకలా ఉన్నా, ద్వితీయార్థంలో ఆ పాత్రలో వచ్చే మార్పు ఆకట్టుకుంటుంది. స్టీఫెన్ లాంగ్, ఊనా చాప్లిన్ పాత్రలు సినిమాకి హైలైట్. ముఖ్యంగా వరంగ్ పాత్రలో ఊనా చాప్లిన్ నటన అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సైమన్ ఫ్రాంగ్లెన్ సంగీతం, రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫీ సినిమాకి బలాలు. ముఖ్యంగా త్రీడీలో సన్నివేశాలు పైసా వసూల్ అనిపిస్తాయి. దర్శకుడు జేమ్స్ కామెరూన్ మరోసారి అవతార్ బలమైన దృశ్య ప్రపంచం పైనే దృష్టిపెట్టారు. కథ, భావోద్వేగాల పైనా ఆయన ప్రభావం కనిపిస్తుంది.
- బలాలు
- + యాక్షన్ ఘట్టాలు
- + విజువల్స్
- + వరంగ్ పాత్ర నేపథ్యం
- బలహీనతలు
- - కొత్తదనం లేని కథనం
- - కొరవడిన భావోద్వేగాలు
- చివరిగా: అవతార్ ఫైర్ అండ్ యాష్: అక్కడక్కడా ఆకట్టుకునే అగ్ని యుద్ధం (Avatar 3 Review)!
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 15:19 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రివ్యూ: సీతా పయనం.. అర్జున్ దర్శకత్వం వహించిన మూవీ ఎలా ఉంది? ఐశ్వర్య అర్జున్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ స్వీయ దర్శకనిర్మాణంలో ‘సీతాపయనం’ చిత్రాన్ని రూపొందించారు అర్జున్. మరి ఈ మూవీ ఎలా ఉంది?
- రివ్యూ: కామెడీ డ్రామా ‘టీటీటీ’.. పెళ్లి ముఖ్యమా? అంతిమయాత్రా? జీవా హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘టీటీటీ’. ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.
- ‘కపుల్ ఫ్రెండ్లీ’ రివ్యూ.. ప్రేమకథ మెప్పించిందా! ప్రేమికుల రోజు వచ్చిన ప్రేమకథ ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకులను మెప్పించిందా..
- రివ్యూ: ఫంకీ.. విష్వక్‌సేన్‌కు విజయం దక్కిందా? విష్వక్‌సేన్ కథానాయకుడిగా కేవీ అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్‌టైన్ ‘ఫంకీ’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: హనీ.. మరో క్షుద్ర నేపథ్యంతో వచ్చిన నవీన్ చంద్ర థ్రిల్లర్ మెప్పించిందా? నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ ‘హనీ’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: శ్రీ చిదంబరంగారు.. వైవిధ్య కథాంశంతో వచ్చిన మూవీ మెప్పించిందా? ఫిబ్రవరిలో బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల జోరు కనిపిస్తోంది. అలా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘శ్రీ చిదంబరంగారు’.
- రివ్యూ: యుఫోరియా.. గుణశేఖర్‌కు విజయాన్ని అందించిందా? ఈసారి విజయమే లక్ష్యంగా యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని గుణశేఖర్ తీసిన చిత్రం ‘యుఫోరియా’. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది?Euphoria Movie Review
- రివ్యూ: సర్వం మాయ.. మలయాళంలో రూ.140కోట్లు వసూలు.. మూవీ ఎలా ఉంది? సింపుల్ కథకు హృద్యమైన సన్నివేశాలు జోడించి సినిమాను తీర్చిదిద్దుతుంటారు మలయాళ దర్శకులు. అలాంటి చిత్రమే ‘సర్వం మాయ’.
- రివ్యూ: గాంధీ టాక్స్.. మూకీ సినిమా ఎలా ఉంది? ‘గాంధీ టాక్స్’ పేరుతో ఓ నిశ్శబ్ద చిత్రాన్ని తెరపైకి తెచ్చి అందరి దృష్టినీ ఆకర్శించారు దర్శకుడు కిశోర్. ఈ చిత్ర కథేంటి? మాటల్లేని ఈ సినిమా భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా?
- రివ్యూ: ఓం శాంతి శాంతి శాంతిః.. భార్యాభర్తల కామెడీ డ్రామా మెప్పించిందా? ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళంలో విజయవంతమైన ‘జయ జయ జయ జయహే’కి రీమేక్ ఇది. మరి మాతృకతో పోలిస్తే ఇందులో కనిపించే కొత్త అంశం ఏంటి? ఎలాంటి వినోదాన్ని ఇచ్చింది?
- ‘సిరై’.. రూ.3కోట్లతో తీస్తే రూ.30 కోట్లు వసూలు చేసిన క్రైమ్ డ్రామా ఎలా ఉంది? తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న నటుడు విక్రమ్ ప్రభు. వైవిధ్యమైన కథలతో అలరించే ఆయన నటించిన 25వ చిత్రం ‘సిరై’.
- రివ్యూ: ‘బోర్డర్2’.. దేశభక్తి నేపథ్యం మరోసారి మెప్పించిందా? బాలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప దేశభక్తి చిత్రాల్లో ‘బోర్డర్’కి ప్రత్యేక స్థానముంది. ఇప్పుడు 28ఏళ్ల తర్వాత ‘బోర్డర్ 2’ను తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు అనురాగ్ సింగ్. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకుల్ని అలరించిందా?
- రివ్యూ: చీకటిలో.. శోభిత ధూళిపాళ్ల క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రలో నటించిన ‘చీకటిలో..’ ఎలా ఉంది?ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: తస్కరీ.. ఇమ్రాన్ హష్మీ వెబ్‌సిరీస్ థ్రిల్ పంచిందా? ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘తస్కరీ’. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందంటే?
- రివ్యూ: కలాంకావల్.. సైకో కిల్లర్‌గా మమ్ముట్టి.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది? మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ‘కలాంకావల్’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: నారీ నారీ నడుమ మురారి.. శర్వానంద్ మూవీ ఎలా ఉందంటే? శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’. సంక్రాంతి సందర్భంగా బుధవారం సాయంత్రం విడుదలైంది.
- రివ్యూ: అనగనగా ఒక రాజు.. నవీన్ పొలిశెట్టి ఎంటర్‌టైనర్ ఎలా ఉంది? నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో మారి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైన్ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. రవితేజ ఖాతాలో హిట్ పడిందా? రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: మన శంకరవరప్రసాద్‌గారు.. చిరు-అనిల్ కాంబో మెప్పించిందా? చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- వెబ్‌సిరీస్ రివ్యూ: కానిస్టేబుల్ కనకం: సీజన్-2.. చంద్రిక బతికే ఉందా? వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్‌కు కొనసాగింపు ఉంటుందని చివరిలో చూపించారు. మరి ఇప్పుడు వచ్చిన సీజన్2 ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది.