తిమ్మసముద్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేస్తా: ఎమ్మెల్యే

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

కళ్యాణదుర్గం గ్రామీణం: తిమ్మసముద్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించి ఈ ప్రాంతంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి ఈ గ్రామ పేరును రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శుక్రవారం మండలంలోని బాలవెంకటాపురం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో డివిజనల్, మండల స్థాయి అధికారులతో కలిసి ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. ఆర్డీవో వసంత్‌బాబు, డీడీవో నాగేశ్వరరావు, తహసీల్దార్ భాస్కర్, మార్కెట్‌యార్డు ఛైర్‌పర్సన్ లక్ష్మీదేవి, మండల కన్వీనర్ వెంకటేశులు, సీనియర్ నాయకులు మల్లికార్జున, రామాంజనేయులు హాజరయ్యారు. రూ.2.40 కోట్లతో నిర్మించిని సీసీ రోడ్లను ప్రారంభించారు. పింఛన్లు, ఇళ్లు, ఇళ్ల పట్టాలు, రస్తా, పాఠశాలలో మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్తు సమస్య తదితర వాటిపై ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీలో నిధులు ఉన్నప్పటికీ తాగునీరు, వీధి దీపాలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. 10 రోజుల్లో బోరుబావి తవ్వించి మోటారు ఏర్పాటు చేసి తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
► Read latest Anantapur Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :