Kalyani Priyadarshan: ‘కొత్తలోక: చాప్టర్‌1’.. ఆ భయంతో గదిలో నుంచి బయటకు రాలేదు: కల్యాణి ప్రియదర్శన్‌

Eenadu icon
By Entertainment Team Updated : 19 Dec 2025 20:29 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: 2025లో బాగా వినిపించిన సినిమా పేర్లలో ‘కొత్తలోక: చాప్టర్‌1’ ముందువరుసలో ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా ఆదరణను సొంతం చేసుకొని అత్యధిక కలెక్షన్లతో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా విడుదలకు ముందు తానెంతో భయపడినట్లు ఇందులో ప్రధాన పాత్రలో నటించిన కల్యాణి (Kalyani Priyadarshan) తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

‘‘నన్ను సూపర్‌ హీరో పాత్రలో ప్రేక్షకులు అంగీకరిస్తారో, లేదోనని భయపడ్డాను. రివ్యూలు వచ్చే వరకూ భయంతో గదిలో నుంచి బయటకు కూడా రాలేదు. నేను కాదు.. మా చిత్ర బృందం మొత్తం అలానే టెన్షన్‌ పడ్డాం. మేం ఎంత భయపడ్డామో అంత పాజిటివ్‌ స్పందన వచ్చింది. రివ్యూలు చదవగానే మా ఆందోళన మొత్తం మాయమైంది. రెస్పాన్స్‌ ఎలా ఉన్నా.. విమర్శలు రాకుండా ఉంటే చాలని భావించాం. మధ్యాహ్నం 3 తర్వాత అందరం గదిలో నుంచి బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నాం’’ అని కల్యాణి ప్రియదర్శన్‌ తెలిపారు.

  • నయనం.. సైకలాజికల్ థ్రిల్లర్.. థ్రిల్‌ పంచిందా!

చిన్న చిత్రంగా విడుదలై రికార్డులు తిరగరాసింది ‘కొత్తలోక: చాప్టర్‌ 1’ (kotha lokah chapter 1). కేవలం మౌత్‌ టాక్‌తోనే బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిందీ సినిమా. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూలుచేసింది. అంతేకాదు, అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి మలయాళీ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రం ‘జియో హాట్‌స్టార్‌’ (Jio Hotstar)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 12:46 IST