Youth: మూడు పదులు వచ్చేలోపు ఇవి చేసేయండి!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: యువతలో చాలామంది.. తమ చదువులు పూర్తి చేసుకొని పాతికేళ్లకే ఉద్యోగాల్లో చేరిపోతారు. ఆ తర్వాత ఐదేళ్ల కాలం వారి జీవితానికి చాలా ముఖ్యం. అదే.. వారి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అందుకే, 30 ఏళ్లు వచ్చేలోపు కెరీర్ నుంచి సామాజిక సేవ వరకు అన్ని ప్రణాళికలు రూపొందించుకోవాలి. అదెలాగంటే...!
నైపుణ్యం
విద్యార్హతను బట్టి ఉద్యోగం రావొచ్చు. కానీ, కెరీర్‌లో మరింత ఉన్నతస్థాయికి చేరాలంటే నైపుణ్యాలు అవసరం. ఉద్యోగానికి ఉపయోగపడే మరిన్ని నైపుణ్యాలు నేర్చుకోవాలి. నిత్య విద్యార్థిలా ఉండి.. కొత్త విషయాలు తెలుసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవాలి.
ఆర్థిక స్వాతంత్ర్యం
ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచే చిన్న మొత్తమైనా సరే.. పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. సొంతింటి కల నెరవేర్చుకోవడానికి శ్రీకారం చుట్టాలి. వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టాలి. రిటైర్‌మెంట్ ఫండ్స్, ఎమర్జెన్సీ ఫండ్స్ ఏర్పాటుచేసుకోవాలి. ఐటీ రిటర్న్స్ ఇతర ఆర్థిక లావాదేవీలపై అవగాహన ఉండాలి.
ఆరోగ్యం
ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే భవిషత్తులో సమస్యలు రాకుండా చూసుకునే వీలుంటుంది. మంచి ఆహారపు అలవాట్లు, సమయానికి నిద్ర పోవడం అలవర్చుకోవాలి. వ్యాయామం రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. మానసిక ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలి.
ఆత్మ విశ్వాసం
ఎలాంటి స్థితిలో ఉన్నా ఆత్మవిశ్వాసంతో ఉండటం నేర్చుకోవాలి. మీ బలాలు ఏంటో తెలుసుకొని వాటిపై దృష్టిపెట్టాలి. నేను చేయగలను అనే ధీమాతో పనులు ప్రారంభించాలి. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భయపడకుండా సవాళ్లను ఎదుర్కొనేలా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి.

విహారం
కుటుంబం, ఉద్యోగమే కాదు.. ప్రపంచం చాలా పెద్దది. తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. తెలుసుకోవాలంటే.. ఒంటరిగా కనీసం ఒక్క విదేశీ విహారయాత్రకైనా వెళ్లాలి. అక్కడి సంస్కృతి సంప్రదాయాలు, సమాజం ఏవిధంగా ఉందో తెలుసుకోవాలి. ఎన్నో అనుభూతులు, అనుభవాలను పొందాలి.
అభిరుచి
చాలామంది జీవితాల్లో కెరీర్ ఎంత ముందుకువెళ్తున్నా.. అభిరుచులు ఎప్పుడు వెనకబడి ఉంటాయి. జీవిత చరమాంకంలో నా అభిరుచిని బయటపెట్టి ఉంటే బాగుండేదే అని బాధ పడుతుంటారు. అలాంటి పరిస్థితి రానివ్వొద్దు. మీ ఇష్టాలు, కోరికలు చిన్నవే అయితే కచ్చితంగా తీర్చుకోవాలి.
ప్రవృత్తి/వ్యాపారం
ఉద్యోగంతోపాటు ఏదైనా ప్రవృత్తి, వ్యాపారంలో మెలకువలు నేర్చుకోవాలి. వీలైతే వాటిని ప్రారంభించాలి. ఆర్థికంగా మెరుగవడానికి, కష్ట సమయంలో నిలదొక్కుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
సమాజసేవ
ఎంత ఎత్తుకు ఎదిగినా సమాజంపై బాధ్యత, అభాగ్యులపై కరుణ చూపించాలి. సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలి. స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇవ్వడం, వాలంటీర్‌గా చేరి పనులు చేయడం వంటివి అలవాటు చేసుకుంటే ఆత్మసంతృప్తి లభిస్తుంది. అది మానసిక ఆనందాన్నిస్తుంది.
► Read latest Explained Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 11:41 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పేరుకే పెద్దమనిషి.. భారత్ అంటే నిలువెల్లా విద్వేషమే! ఆయన చేసింది బ్యాంకు వ్యాపారం.. గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీలు ఇచ్చి అయినకాడికి వసూలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి.
- ప్రేమికుల రోజు సరదాలా?ఖర్చే లేకుండా రొమాంటిక్ అనుభవాలు పొందొచ్చు! ప్రేమికుల రోజు.. కేవలం ప్రేమ జంటలే కాదు, భార్యాభర్తలూ చేసుకోదగ్గ వేడుక. సాధరణంగా ఈ రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
- టెండర్లపై ‘ఏఐ’ నిఘా.. అక్రమాలు, సిండికేట్‌లు ఇకపై కుదరవు! రహదారులు, రైల్వే ప్రాజెక్టులు సహా అభివృద్ధి పనులు.. ఇలా ప్రభుత్వంలో ప్రధాన నిర్మాణ ప్రాజెక్టులకు టెండర్లు తప్పనిసరి.
- విహారయాత్ర సరే.. బడ్జెట్ మాటేంటి? నెలవారీ ఖర్చులు, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల మధ్య విహారయాత్రకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడం కష్టమే. అయితే, చేసే ఖర్చుల్లోనే కొంత మొత్తం పొదుపు చేస్తే విహారానికి బడ్జెట్ పెద్ద సమస్యే కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి దానికి ఏం చేయాలంటే..
- వద్దన్నా వస్తున్నారు.. యూరప్‌లో ట్రావెల్ ఓవర్‌క్రౌడింగ్! చాలా దేశాల ప్రభుత్వాలు తమ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ.. మా దేశంలో పర్యటించాలని ప్రకటనలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి.
- ‘మని’ ద్వీపకల్పం.. అక్కడ అంతా ఒకే సమూహం గ్రీసులో ఉన్న ఓ మానవ సమూహం తరతరాలుగా అనేక దాడులను ఎదుర్కొని నిలిచింది.
- పిల్లల్ని కనబోతున్నారా.. మరి వీటి గురించి ఆలోచించారా? పెళ్లి చేసుకున్న యువజంటలతో బంధువులు అనే మొదటి మాట..‘పిల్లల్ని ఎప్పుడు కంటారు? తొందరగా కనేయండి’అని. వైవాహిక జీవితానికి తల్లిదండ్రులు అనే హోదానే పరిపూర్ణత ఇస్తుందని సమాజం నమ్ముతుంది.
- మాటలెందుకు? మీమ్స్ ఉండగా.. జెన్ జీ లైఫ్‌స్టైల్ ఇదీ! ఎవరైనా బొద్దుగా ఉన్న వ్యక్తి తారసపడితే ‘ఒడియమ్మా బంటీ’ అంటున్నారు.. ఏదైనా పనిని ఆశ్చర్యపరిచేలా వేగంగా చేసినా, ఎవరూ చేయలేని పనిని చేసి చూపించినా ‘ఫ్లాష్‌మ్యాన్’ అని పిలుస్తున్నారు. ఎందుకు అంటారా? ఇటీవల సోషల్‌మీడియాలో ట్రెండ్ అయినా మీమ్స్ అవి.
- టైమ్‌కి పని అవ్వాలంటే.. ఈ టెక్నిక్స్ తెలిసుండాలి! అనుకున్న పనులు సమయానికి పూర్తి కావాలంటే సమయ పాలన చాలా ముఖ్యం. దీన్ని పట్టించుకోకపోతే పనులన్నీ గందరగోళంగా, అసంపూర్తిగా ఉంటాయి.
- జిప్ కోడింగ్.. గల్లీ దాటని ప్రేమ! గతంలో ప్రేమ కోసం సప్తసాగారాలు దాటిన కథలు విన్నాం. ఈ టెక్నాలజీ యుగంలో ఎంత దూరమున్నా మొబైల్‌లో మాట్లాడుతూ, వీడియో కాల్స్‌తో నెట్టుకొస్తున్న లాంగ్ డిస్టెన్స్ ప్రేమలనూ చూస్తున్నాం. కానీ, ఇప్పుడు కాలంతోపాటు యువత ఆలోచనలూ మారుతున్నాయి.
- గ్రీన్‌లాండ్‌లో స్థలాన్ని కొనలేం.. ఇల్లు కావాలంటే పదేళ్లు వేచి చూడాలి! గ్రీన్‌లాండ్.. డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి గల ప్రాంతం. ఇక్కడి భూచట్టాల ప్రకారం.. భూమి అనేది ఇక్కడి ప్రజల సామూహిక వనరు. అందుకే, వ్యక్తిగతంగా ఎవరికీ యాజమాన్య హక్కులుండవు.
- నదిలో బంగారం.. అదే వారికి జీవనాధారం! హరియాణాలోని యమునానగర్ జిల్లాలో బోలి నది ప్రవహిస్తుంటుంది. ఆ నదీతీర ప్రాంతంలో నివసించే ప్రజలకు అది కేవలం నీటి వనరే కాదు.. జీవనాధారం కూడా. ఎందుకంటే ఆ నదీలో బంగారం ఉంది.
- ఊరు మొత్తానికి ఒక్కటే వంటశాల.. వృద్ధుల కోసం వినూత్న ఆలోచన! చందంకి.. గుజరాత్‌లోని మారుమూల చిన్న గ్రామం. అన్ని ఊర్లలో ఉన్నట్టుగానే ఇరుకైన వీధులు, సాధారణ ఇళ్లు, గుడి, బడి అన్ని ఉంటాయి. కానీ, ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
- పొట్ట నిండినా ఆహారంపైనే ధ్యాస.. పెరుగుతోన్న ఫుడ్ నాయిస్ ఆకలి వేస్తే భోజనం చేస్తాం. ఎప్పుడైనా అనుకోకుండా మంచి ఫుడ్ కనిపిస్తే జిహ్వా కోరికని తీర్చేస్తాం. కానీ, కొంతమందికి ఆకలి తీరినా, ఎన్ని రకాల రుచులు చూసినా ఇంకా ఏం తినాలి? ఎప్పుడు తినాలి? అని ఆహారం గురించే ఆలోచిస్తుంటారు.
- ఇజ్రాయెల్ ఆర్మీలో అందమైన భామలు! Israeli Army: ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్మీ కలిగిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. అత్యాధునిక ఆయుధ, సాంకేతిక సంపత్తి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) సొంతం.
- ఇతరుల్ని అర్థం చేసుకునేవారు ఇలా ఉంటారట! మనుషులంతా ఒకేలా ఉండరు. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. మరికొందరు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. కానీ, చాలా కొంత మందికే ఇతరులను పూర్తిగా చదవగలిగే సామర్థ్యం ఉంటుంది.
- ఈ ఆలయంలో మొక్కుకుంటే జుట్టు రాలదట! ఏ దేవాలయానికి వెళ్లినా సుఖఃసంతోషాలు కలిగించమని, ఆరోగ్యం కాపాడమని, సంపద పెరగాలని దేవుళ్లకు ప్రార్థించడం సహజం. వాళ్లు కరుణిస్తే మొక్కులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే, జపాన్‌లో ఓ విచిత్రమైన ఆలయం ఉంది. అక్కడ భక్తులు కేవలం తమ జుట్టు రాలిపోకూడదని, జుట్టు సమస్యలు తొలగిపోవాలని మాత్రమే ప్రార్థిస్తారు.
- ఎగిరే గాలిపటం.. మెరుగయ్యే జీవనం! గాలిపటాలు ఎగరవేయడం అనేది కేవలం సంప్రదాయం, సరదా మాత్రమే కాదు.. మనుషులకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాదు, ఎన్నో లాభాలు చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- ఒంటరితనానికి కారణం ఇతరులు కాదు, మన అలవాట్లే! కొంత మంది ఒంటరిగా మిగిలిపోయామని మథనపడుతుంటారు. తనకంటూ ఎవరూ లేరని, చుట్టూ ఉన్నవారు దూరం చేస్తున్నారని భావిస్తారు. నిజానికి మనలోని అలవాట్లు, ఆలోచన తీరు, మనస్తత్వాలే మనుషుల్ని మనకు దూరం చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
- అనగనగా ఓ గ్రామం.. అక్కడ ఒకే ఒక్క ఇల్లు! నిర్మానుష్య ప్రాంతంలో కాసేపు ఉండాలంటేనే భయంతో వణుకు వచ్చేస్తుంటుంది. అలాంటిది, కనుచూపుమేరలో మనుషులే కనిపించని ఓ మారుమూల గ్రామంలో ఓ కుటుంబం కొన్నేళ్లుగా నివసిస్తోంది.