IND vs PAK U19 Asia Cup: పాక్‌తో ఫైనల్.. మన కుర్రాళ్లు కుమ్మేస్తారా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: అండర్-19 ఆసియా కప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న యువ భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం (డిసెంబర్ 21) ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో (IND vs PAK) భారత్ తలపడనుంది. ఇరుజట్ల బలబలాలను చూస్తే.. ఆయుష్ మాత్రే నాయకత్వంలోని భారత జట్టే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్. లీగ్ దశలో పాక్‌ను భారత కుర్రాళ్లు 90 పరుగుల తేడాతో మట్టికరిపించారు. మరోసారి దాయాదికి షాకిచ్చి రికార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్‌ను పట్టేయాలని భారత్ తహతహలాడుతోంది. టోర్నీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన టీమ్ఇండియా.. రెండు మ్యాచ్‌ల్లో 400కుపైగా స్కోర్లు చేసింది. దీన్ని బట్టి మన బ్యాటర్ల జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైభవ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్ కుందు సూపర్‌ఫామ్‌లో ఉన్నారు. యూఏఈపై వైభవ్ 95 బంతుల్లోనే 171 పరుగులు చేయగా.. మలేసియాపై అభిజ్ఞాన్ డబుల్ సెంచరీ (209) బాదాడు. మిడిల్ ఆర్డర్‌లో ఆరోన్ జార్జి నిలకడగా రాణిస్తుండగా.. కాన్షిక్ చౌహాన్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. లీగ్ స్టేజ్‌లో పాక్‌పై 25 బంతుల్లో 38 పరుగులు చేసిన కెప్టెన్ ఆయుష్ మాత్రే నుంచి టీమ్ఇండియా భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. బౌలింగ్ విషయానికొస్తే.. పేసర్ దేపేశ్ దేవేంద్రన్ భారత్‌కు కీలకం కానున్నాడు. ఈ కుర్రాడు మంచి వేగం, కచ్చితత్వంతో బంతులు విసురుతూ ఆరంభంలోనే వికెట్లు తీస్తున్నాడు. ఇతను మలేసియాతో మ్యాచ్‌లో 22 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద నాలుగు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. దీపేశ్ మరోసారి విజృంభిస్తే భారత్‌కు తిరుగుండదు.
- టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో గిల్‌కు నో ఛాన్స్.. కారణం చెప్పిన చీఫ్ సెలక్టర్
పాక్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. లీగ్ స్టేజ్‌లో భారతో జరిగిన మ్యాచ్‌లో తప్ప మిగిలి వాటిలో పాక్ నెగ్గింది. సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్‌ను 121కే ఆలౌట్ చేసి 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్‌పై భారత బౌలర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరముంది. ఎందుకంటే టోర్నీలో 299 పరుగులతో ఇతనే టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. పేసర్ అబ్దుల్ సుభాన్ బంతితో అదరగొడుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లోనే 11 వికెట్లు తీసిన సుభాన్‌ను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటున్నారో చూడాలి.
ఎక్కడ చూడాలి?
భారత్, పాక్ అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీలివ్ ఓటీటీ ప్లాట్‌పాంలో మ్యాచ్ ప్రత్యక్షప్రసారం ఉంటుంది.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 20:34 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- టీ20 ప్రపంచకప్ సూపర్ 8... మిగిలిన రెండు బెర్తులు ఎవరికి? టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశకు ఆరు టీమ్‌లు క్వాలిఫై అవ్వగా.. మరో రెండు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.
- రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ హాఫ్ సెంచరీలు.. కెనడాపై న్యూజిలాండ్ ఘన విజయం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా పొట్టిప్రపంచకప్‌లో భాగంగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
- అభిషేక్ శర్మ.. అభిమన్యుడు కాదు అర్జునుడు అతడు..! టీమ్‌ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) పేరు చెబితే సునామీ ఇన్నింగ్స్‌లే గుర్తుకువస్తాయి. ప్రత్యర్థి బౌలర్లను అతడు హడెలెత్తించే ఊచకోతే జ్ఞప్తికి వస్తుంది. కానీ.. అభిషేక్ శర్మ గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా తడబడుతున్నాడు.
- యువరాజ్ సమ్రా సూపర్ సెంచరీ.. న్యూజిలాండ్ విజయ లక్ష్యం 174 టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా న్యూజిలాండ్, కెనడా జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన కెనడా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది.
- గౌతమ్ గంభీర్‌కు కీలక పదవిని ఆఫర్ చేసిన రాజస్థాన్ రాయల్స్! ప్రస్తుతం టీమ్ఇండియా (Team India) హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్‌కు (Gautam Gambhir) ఐపీఎల్ (IPL) ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కీలక పదవిని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
- తిరుమల శ్రీవారి సేవలో అమెరికా క్రికెటర్లు తిరుమల శ్రీవారిని అమెరికా క్రికెటర్లు దర్శించుకున్నారు.
- తూచ్.. నేను నఖ్వీని అలా అనలేదు..: మాట మార్చిన షోయబ్ అక్తర్! పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ 24 గంటలైనా గడవక ముందే మాట మార్చాడు. తాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) అధ్యక్షుడు నఖ్వీని అసమర్థుడు, నిరక్షరాస్యుడు అనలేదని యూటర్న్ తీసుకున్నాడు.
- పది పరీక్షలకు వైభవ్ దూరం భారత అండర్-19 ప్రపంచకప్ స్టార్.. రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు.
- కోపం వదిలెయ్ సోదరా! పాకిస్థాన్‌తో ఆదివారం మ్యాచ్ అనంతరం భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ చాలా కోపంగా కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
- అక్కడ మెరుపుల్లేవ్ టీ20 అనగానే గుర్తొచ్చేది సిక్సర్లు, ఫోర్లే! ఎంత బాదితే అభిమానులకు అంత ఆనందం. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో బ్యాటర్లు అదరగొడుతున్నారు.
- కంగారూలు మళ్లీ పడ్డారు లంకేయులు అదరహో.. కంగారూలకు మళ్లీ షాక్! శ్రీలంక వరుసగా మూడో విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8కు దూసుకెళ్లింది.
- పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్! భారత స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు అతని తాత రామ్ అనుగ్రహ పాండే. మోడల్ అదితి హుండియాతో ఇషాన్ వివాహం జరగొచ్చని పాండే సూత్రప్రాయంగా చెప్పాడు.
- అజ్మతుల్లా ఆల్‌రౌండ్ ప్రదర్శన చిన్న జట్లలోకెల్లా బలమైన జట్టే అయినా, అదృష్టం కలిసిరాక తొలి రెండు మ్యాచ్‌ల్లో బోణీ కొట్టలేకపోయిన అఫ్గానిస్థాన్.. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని సాధించింది.
- ఇంగ్లాండ్ సూపర్-8కు టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ సూపర్-8కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్-సి పోరులో ఆ జట్టు ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచింది.
- అతడో అసమర్థుడు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ నఖ్వి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాక్ మంత్రి కూడా అయిన అతడు.. తన ఇష్టానుసారంగా బోర్డును నడిపించాడు.
- పాక్‌తో మ్యాచ్‌లో కాస్త ఎక్కువ ఒత్తిడి: అక్షర్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుందని భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అన్నాడు. అయితే మైదానంలోకి దిగాక తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని అతను చెప్పాడు.
- బాబర్, షాహీన్‌లపై వేటు? టీ20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ పరాజయ ప్రభావం.. సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజాం, షాహీన్ అఫ్రిదిలపై పడేలా ఉంది.
- సంక్షిప్త వార్తలు (4) ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి సిద్ధమైంది. ఆ జట్టు.. మంగళవారం గ్రూప్-బి పోరులో ఐర్లాండ్‌ను ఢీకొంటుంది.
- వరల్డ్ కప్ తర్వాత.. ఆ మోడల్‌తో మా మనవడి పెళ్లి: ఇషాన్ తాతయ్య ఇషాన్ కిషన్ పెళ్లిపై ఓ స్పష్టత వచ్చేసింది. ఎప్పుడు జరగబోతుందో కూడా ఇషాన్ తాతయ్య అనురాగ్ పాండే వెల్లడించారు.
- ఇషాన్ అద్భుతం.. రోహిత్ మాకు ఏం చెప్పాడంటే?: సంజనతో బుమ్రా చిట్‌చాట్ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. మ్యాచ్ తర్వాత తన భార్య, క్రికెట్ వ్యాఖ్యాత సంజనా గణేశన్‌తో చిట్‌చాట్‌లో బుమ్రా మాట్లాడాడు.