R Madhavan: అక్షయ్‌ను చూసి అసూయ పడట్లేదు: మాధవన్‌

Eenadu icon
By Entertainment Team Published : 20 Dec 2025 14:14 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్షయ్‌ ఖన్నా విషయంలో తాను అసూయపడడం లేదని మాధవన్‌ అన్నారు. ఇటీవల విడుదలైన ‘ధురంధర్‌’లో మాధవన్‌ పాత్రకు (R Madhavan) తగిన గుర్తింపు రాలేదని ఆయనకంటే అక్షయ్‌ ఖన్నాకే ఎక్కువ ప్రశంసలు వస్తున్నాయని నెట్టింట కొన్ని పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. తాజాగా వాటి గురించి మాధవన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను అక్షయ్‌(Akshaye Khanna) విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. 

‘‘అక్షయ్‌ ప్రతిభావంతుడు. ‘ధురంధర్‌’లో అద్భుతంగా నటించారు. ఆయనకు వస్తున్న ప్రశంసలకు పూర్తి అర్హుడు. ఆయన కెరీర్‌లో ఎన్నో వేల ఇంటర్వ్యూలు ఇచ్చారు. సినిమా కోసం ఎంతో కష్టపడతారు. మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తారు. ఆయనతో పోలిస్తే నేను చాలా తక్కువ కష్టపడతాను. అక్షయ్‌ స్థాయి వేరు. ఆయన జయాపజయాలను సమానంగా తీసుకుంటారు. ‘ధురంధర్‌’ లాంటి గొప్ప సినిమాలో నేను భాగమైతే చాలనుకున్నాను. ఆ సినిమా చరిత్ర సృష్టిస్తోంది. అంత గొప్ప చిత్రంలో నేనూ భాగం కావడం ఆనందంగా ఉంది. అక్షయ్‌, దర్శకుడు ఆదిత్యధర్‌ ఇద్దరిదీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం’’ అని మాధవన్‌ తెలిపారు.

  • ‘ధురంధర్‌’ హవా.. ‘అవతార్‌ 3’ను బీట్‌ చేసిన చిత్రం!

ఇప్పటికే ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు సందీప్‌ వంగా ( Sandeep Reddy Vanga) దీనిపై పోస్ట్‌ పెట్టారు. ‘‘ధురంధర్‌’ అనే పేరు ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుంది. ఎలాంటి గందరగోళం లేకుండా కథను తెరకెక్కించారు. సంగీతం, స్క్రీన్‌ప్లే అద్భుతంగా కుదిరాయి. రణ్‌వీర్‌ సింగ్‌, అక్షయ్‌ ఖన్నా వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశారు’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. మరుగునపడిన త్యాగాలను కళ్లకు కట్టినట్లు చూపించారని దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు. ఈ పోస్ట్‌పై ఆదిత్య (Aditya Dhar) స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలిపారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • బాలీవుడ్‌ హీరో తండ్రి మృతి.. బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర తండ్రి సునీల్‌ మల్హోత్ర కన్నుమూశారు.
  • అదే బాధగా అనిపిస్తుంది ‘‘మంచి వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమా ‘హే బల్‌వంత్‌’’ అన్నారు హీరో సుహాస్‌. ఇది తన కెరీర్‌లోనే చాలా వేగంగా పూర్తి చేసిన చిత్రమని.. దీనితో తాను ఎదురు చూస్తున్న విజయం అందుకుంటాననే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు.
  • ప్రియమణి.. ఇండో-హాలీవుడ్‌ చిత్రం తెరపై వైవిధ్యమైన పాత్రలతో భావోద్వేగాలను పంచడంతోపాటు.. యాక్షన్‌ సన్నివేశాలతోనూ అదరగొడుతుంది నటి ప్రియమణి. ఇప్పుడామె ఖాతాలో ఓ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ రూపొందించనున్న కొత్త ప్రాజెక్ట్‌ చేరింది.
  • బాలీవుడ్‌ వైపు తొలి అడుగు? గతేడాది ‘మదరాసి’, ‘కాంతార 2’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక రుక్మిణీ వసంత్‌. చిత్రపరిశ్రమకు వచ్చిన తక్కువ రోజుల్లోనే భాషతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంటోన్న ఈ భామ..
  • జోడీ కుదిరేనా! గతేడాది ‘జాక్‌’, ‘తెలుసు కదా’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
  • మరకతమణి 2కి శ్రీకారం ఆది పినిశెట్టి నుంచి వచ్చిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్‌ ‘మరకతమణి’ 2017లో విడుదలై.. ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘మరకతమణి 2’ని పట్టాలెక్కించారు ఆది.
  • ఆ పాటలు వాడొద్దు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. సరిగమ సంగీత సంస్థకు, ఆయనకు కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
  • వెబ్‌సిరీస్‌ కోసం! ‘క’, ‘కె-ర్యాంప్‌’ విజయాలతో జోరు మీదున్నారు యువ హీరో కిరణ్‌ అబ్బవరం. ఇప్పుడాయన ఓటీటీలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ ఫేమ్‌ భరత్‌ కమ్మ దర్శకత్వంలో ముస్తాబు
  • గ్రామీణ కథ ‘సెయాన్‌’ ‘సెయాన్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు శివ కార్తికేయన్‌. ‘అమరన్‌’ విజయం తర్వాత ఆయన.. కమల్‌హాసన్‌ సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. శివకుమార్‌ మురుగేశన్‌ తెరకెక్కిస్తున్నారు.
  • అలియాకు బాఫ్టా గౌరవం ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌కు మరోసారి అంతర్జాతీయ గౌరవం దక్కింది. బాఫ్టా(బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌) 79వ ఎడిషన్‌ పురస్కారాలను అందించే ప్రెజెంటర్ల జాబితాను ప్రకటించింది.
  • సంక్షిప్త వార్తలు (5) ప్రముఖ హిందీ సినీ రచయిత, నటుడు, సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌(90) అనారోగ్య పరిస్థితుల కారణంగా మంగళవారం ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. జావేద్‌ అక్తర్‌తో కలిసి ఆయన రచన చేసిన ‘షోలే’, ‘దీవార్‌’, ‘డాన్‌’ చిత్రాలు భారతీయ చిత్రసీమలో నిలిచిపోయాయి.
  • ‘లైకా’ కేసు.. విశాల్ పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్‌ హైకోర్టు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్‌’కు సంబంధించిన కేసులో ఉత్తర్వులను పాటించేందుకు గడువు కోరుతూ నటుడు విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
  • చెక్‌బౌన్స్‌ కేసు.. జైలు నుంచి రిలీజైన రాజ్‌పాల్‌ ఏమన్నారంటే? బాలీవుడ్‌ నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌ తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు.