కాంగ్రెస్ నాయకుడి పాడె మోసిన మంత్రి పొంగులేటి

- A
- A+
- A++

కూసుమంచి: ఇటీవల ఖమ్మం జిల్లాలోని పాలేరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ మండల నాయకుడు యడవల్లి రామిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. రామిరెడ్డి అంతిమయాత్రలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి రామిరెడ్డి పాడె మోశారు. అంతిమయాత్ర పూర్తయ్యే వరకు సుమారు రెండు గంటల పాటు ఇక్కడే ఉన్న మంత్రి.. చివరిసారిగా నివాళులర్పించే సమయంలో మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. రామిరెడ్డి అంతిమయాత్రలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రామదాసు ఇంట.. సరిగమల పులకింత [ 19-02-2026] భక్త రామదాసు నడయాడిన నేల.. కీరవాణి స్వర ఝరిలో ఓలలాడింది. సుస్వరాల గానమాలికలో.. సంగీత హోరులో ఖమ్మం మెట్టు పులకించింది. దేదీప్యమానంగా కాంతులీనిన వేదికపై సీతా సమేత శ్రీరాముడిని స్మరిస్తూ.. స్తంభాద్రిని కొలుస్తూ.. గాయనీగాయకులు ఆలపించిన గీతాలు సమ్మోహనపరిచాయి.. సంగీత విభావరితో నగరం మైమరిచిపోయింది.
- ఇన్‌స్టాలో డీల్స్ [ 19-02-2026] అడవుల గుండా, వాహనాల సీట్ల కింద గంజాయిని దాచి తరలించటాన్ని చూశాం.. కానీ చీకటి వ్యాపారం రూపు మార్చుకుంది. యువత చేతిలోని స్మార్ట్‌ఫోన్లు గంజాయి విక్రయాలకు అడ్డాలుగా మారుతున్నాయి.
- కల్లూరు పురపాలికను ఆదర్శంగా తీర్చిదిద్దండి: తుమ్మల [ 19-02-2026] నూతనంగా ఏర్పడిన కల్లూరు పురపాలికను ఆదర్శంగా తీర్చిదిద్దాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
- రేపటితో పత్తి కొనుగోళ్లు సమాప్తం! [ 19-02-2026] ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారత పత్తి సంస్థ(సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు తుది దశకు చేరాయి. ఈనెల 20(శుక్రవారం)తో పూర్తికానున్నాయి. ఉభయ జిల్లాల్లో సుమారు నాలుగు నెలల్లో రూ.583.23కోట్ల పత్తిని సీసీఐ సేకరించింది. 82.50% సొమ్మును కర్షకులకు చెల్లించింది.
- చదివిందే మళ్లీ చదవండి! [ 19-02-2026] ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. పరీక్షల సమయం సమీపిస్తున్నకొద్దీ విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు.
- వేగంగా పనులు.. సకాలంలో బిల్లులు [ 19-02-2026] నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఊపందుకుంటోంది. రెండు దశల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సుమారు 33వేల ఇళ్లకు మంజూరు పత్రాలు లభించాయి
- పక్కాగా పసిడి లెక్క [ 19-02-2026] భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిరుపయోగంగా ఉన్న ఆభరణాల లెక్కలు తీస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే శ్రీరామ నవమికి బంగారం, వెండిని బాండ్లు రూపంలోకి మార్చాలని యోచిస్తున్నారు.
- నిఘా ఉంటేనే.. చోరీలకు అడ్డుకట్ట [ 19-02-2026] జిల్లాలో ఏటా 100 నుంచి 150 విద్యుత్తు నియంత్రికల దొంగతనాలు సంభవిస్తున్నాయి. రైతులు, విద్యుత్తుశాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అధిక శాతం దొంగతనాలు పంటలు ముగిసిన తర్వాత, వేసవికాలంలోనే జరుగుతుంటాయి