డిప్యూటీ సీఎం పవన్‌.. మంత్రి దుర్గేశ్‌ సరదా ముచ్చట్లు

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 20 Dec 2025 19:46 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

నిడదవోలు(పెరవలి): పెరవలిలో ఏర్పాటు చేసిన అమరజీవి జలధార కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు.. డిప్యూటీ సీఎం పవన్‌ను శాలువాతో సత్కరించి మోమోంటో అందించారు. పవన్ మాట్లాడుతూ వేదికపై ఉన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ను బాహుబలి అంటూ సంభోదించడంతో సభావేదిక ఆవరణం చప్పట్లతో మార్మోగింది. ఉపసభాపతి రఘరామకృష్ణరాజును ఉద్దేశించి ఆయన ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో మాట్లాడకపోతేనే మంచిదనిపిస్తుందని.. ఆయనే ఆరడుగుల బుల్లెట్ అనడంతో వేదికపై నవ్వులు విరిశాయి. సభా ప్రారంభానికి ముందు పవన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పత్తిపాడు ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభను పిలిచి జ్యోతి ప్రజ్వలన చేయాలన్నారు. రాష్ట్రనైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ బూరుగుపల్లి శేషారావు పవన్‌తో కరచాలనం చేశారు. వేదికపై మంత్రి దుర్గేశ్‌.. పవన్ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. పెరవలి మండలం తీపర్రులో దళితుల శ్మశానవాటిక సమస్య పరిష్కరించాలని కోరుతూ పెరవలి జాతీయ రహదారి కూడలిలో ఆ గ్రామస్థులు ప్లెక్సీతో ప్రదర్శన చేశారు. 

► Read latest East godavari Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • యథేచ్ఛగా విద్యుత్తు చౌర్యం ‘దొంగలు’ [ 19-02-2026] జిల్లాలో అక్రమ విద్యుత్తు వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. ఎన్ని చర్యలు చేపట్టినా అక్రమార్కులకు అడ్డుకట్ట పడటం లేదు. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు విద్యుత్తు అక్రమ వినియోగానికి సంబంధించిన కేసులను పరిశీలిస్తే విస్తుపోవాల్సిందే.
  • గోదావరి తగ్గుతోంది.. సీలేరు ఆదుకుంటోంది [ 19-02-2026] ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని మూడు డెల్టాల్లో సుమారు 8.96 లక్షల ఎకరాలకు 9,000 క్యూసెక్కుల సాగునీటిని అందిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పంట చిరుపొట్ట దశలో ఉంది. 
  • ఇలా కోర్సు పూర్తిచేస్తే.. అలా కొలువు కొట్టొచ్చు [ 19-02-2026] పరిశ్రమ డిమాండ్లను తీర్చగలిగే పాఠ్యాంశాలు (కరిక్యులమ్‌) రూపొందించినప్పుడే విద్యార్థులు త్వరితగతంగా కొలువులు సాధించొచ్చు. ఇటీవల కాకినాడ జేఎన్టీయూకి వచ్చిన విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇదే అంశమై మాట్లాడుతూ కంపెనీలు తమ పరిశోధనలకు విశ్వవిద్యాలయాలకు సాయపడాలని సూచించారు.
  • మన్యం ఎర్రమట్టిపై మాఫియా కన్ను? [ 19-02-2026] మన్యంలో ఎర్రమట్టిపై మాఫియా కన్ను పడింది. మైదాన ప్రాంతాలకు రవాణా చేసేందుకు ఇబ్బందిలేని సమీప గిరిజన ప్రాంతంలో ఎర్రమట్టి ఉన్న భూములను సేకరిస్తున్నారు.
  • నగర వాసులకు నరకం.. వైకాపాదే పాపం [ 19-02-2026] రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల సందర్భంగా వైకాపా శ్రేణులు చూపిన అత్యుత్సాహం నగర వాసులకు నరకం చూపింది.
  • సైకిల్‌ మెకానిక్‌పై పెట్రోలు పోసి నిప్పు [ 19-02-2026] పంక్చర్లు వేసే సామగ్రిని సకాలంలో తిరిగి ఇవ్వలేదనే కోపంతో ఓ బైక్‌ మెకానిక్, పక్కనే ఉన్న సైకిల్‌ మెకానిక్‌పై పెట్రోలు పోసి నిప్పు అంటించిన ఘటన బుధవారం తుని పట్టణంలో చోటుచేసుకుంది.
  • తల్లిదండ్రులను చూసేందుకు వచ్చి తిరిగిరాని లోకాలకు.. [ 19-02-2026] కొంతకాలంగా నాటుకోళ్లు మకాంలో కూలీపనులు చేస్తున్న తల్లిదండ్రులను చూసేందుకు వచ్చిన ఆ యువకుడు మంగళవారం రాత్రి ప్రమాదానికి గురై మృత్యుఒడికి చేరాడు.
  • బుడతడు.. 35 దేశాల పేర్లు [ 19-02-2026] డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన కాసు నాగేంద్ర, గాయత్రి దంపతుల కుమారుడు ఖియాన్ష్‌ వెంకటరుషికి రెండున్నరేళ్లు. ఈ బుడతడు ఒకటి కాదు.. రెండుకాదు ఏకంగా 35 దేశాల పేర్లు అనర్గళంగా చెప్పేస్తున్నాడు.
  • కోర్టుకు బాంబు బెదిరింపులు [ 19-02-2026] రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టుకు బుధవారం బాంబు బెదిరింపులు రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. కోర్టు అధికారిక ఈ-మెయిల్‌కు బెదిరింపులతో కూడిన మెయిల్‌ రావడంతో అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు.
  • విద్యుత్తు సేవలు ఎలా ఉన్నాయి? [ 19-02-2026] ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వివిధ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అందుతున్న సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకునేందుకు ఇటీవల అభిప్రాయాలు సేకరించింది.
  • అభాగ్యులకు ఆసరా..! [ 19-02-2026] ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం.. పేద వర్గాలకు ఆసరాగా నిలుస్తోంది. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, అభయహస్తం, మత్స్యకారులు, చేనేత, కల్లుగీత కార్మికులు తదితరులు 1,96,395 మందికి ప్రతి నెలా.. రూ.84.25 కోట్లు అందిస్తున్నారు.
  • ఎన్టీఆర్‌ వైద్యసేవ పేరుతో ప్రైవేటులో అదనపు వసూళ్లు [ 19-02-2026] ఎన్టీఆర్‌ వైద్య సేవ పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల్లో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు.