Google: అమెరికాను వీడి బయటకెళ్లొద్దు: ఉద్యోగులకు గూగుల్ సూచన

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ (Social Media Vetting) కారణంగా చాలామంది దరఖాస్తుదారుల వీసా అపాయింట్‌మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరుకు వాయిదా పడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ కొందరు ఉద్యోగులను హెచ్చరించింది. అమెరికాను వీడి బయటకువెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు ఆంగ్ల మీడియా కథనం పేర్కొంది.
అమెరికాకు తిరిగి రావడానికి వీసా స్టాంపింగ్ అవసరమయ్యే ఉద్యోగులు నెలలపాటు ఎదురుచూడాల్సి వస్తుందని గూగుల్ న్యాయనిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యూఎస్ వీసాలపై ఉన్న సిబ్బంది అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈమేరకు యాజమాన్యం సిబ్బందికి మెయిల్ పంపింది. డిసెంబరు 15వ తేదీ నుంచి హెచ్1బీ, హెచ్4 వీసా దరఖాస్తుదారులకు సోషల్ వెట్టింగ్‌ను అమెరికా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాంతో వీసా అపాయింట్‌మెంట్లలో జాప్యం ఎదురవుతోంది. ఎఫ్,జే,ఎం వంటి వీసాల పైనా ఈ ప్రభావం ఉంటుందని గూగుల్ నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా ( USA) వెలుపల ఉన్నవారి విషయంలో మాత్రం ఎలాంటి సూచనలు చేయలేదు.
- గ్రీన్‌కార్డ్ లాటరీని నిలిపేసిన ట్రంప్
కాగా.. కొత్త వెట్టింగ్ విధానం వల్ల వీసా ( Visa) ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చికి రీషెడ్యూల్ చేసినట్లు ఇటీవల అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. వీరి ఇంటర్వ్యూ తేదీలను ఇప్పుడు అక్టోబరు నెలకు వాయిదా వేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసేందుకు అదనపు సమయం పడుతోందని, అందువల్లే ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి గందరగోళంలో పడింది. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు సాధించి.. ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకున్నవారు ఇబ్బందులు పడుతున్నారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- చర్చలు సాగిస్తూనే.. పశ్చిమాసియాకు అమెరికా యుద్ధ విమానాలు..! Iran-USA అమెరికా- ఇరాన్‌ల మధ్య అణుఒప్పందానికి సంబంధించి ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 24 గంటల్లో అగ్రరాజ్యం దాదాపు 50 అత్యాధునిక యుద్ధ విమానాలను పశ్చిమాసియాలో మోహరించింది.
- మాకు పింఛన్లు వద్దు శ్రీలంక చట్టసభ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం ముగిశాక పింఛన్లు తీసుకోరాదని వారు నిర్ణయించారు.
- అమెరికా పౌరహక్కుల నేత జెస్సీ జాక్సన్ మృతి అమెరికాలో శ్వేతజాతి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ అనుచరుడు, రెండుసార్లు దేశాధ్యక్ష పదవికి పోటీచేసిన మానవ హక్కుల ఉద్యమ ప్రముఖుడు రెవరెండ్ జెస్సీ ఎల్.జాక్సన్ మంగళవారం మరణించారు.
- భారత్ సాయం మాకు అత్యంత కీలకం అంతర్జాతీయ సమాజ అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్ అందిస్తున్న సాయం తమకెంతో కీలకమని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ స్పష్టం చేశారు.
- బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బీఎన్‌పీ నేత తారిఖ్ రహమాన్ (60) మంగళవారం పదవీ ప్రమాణం చేశారు.
- సౌదీలో దర్శనమిచ్చిన రంజాన్ నెలవంక సౌదీ అరేబియాతో సహా పలు గల్ఫ్ దేశాల్లో రంజాన్ నెలవంక దర్శనమిచ్చింది. దీంతో ఉపవాసాలు, భక్తిశ్రద్ధలకు ప్రత్యేకమైన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనట్లయింది.
- విన్యాసాలకు హర్మూజ్ జలసంధి తాత్కాలిక మూసివేత అస్త్ర ప్రయోగాలతో కూడిన సైనిక విన్యాసాలు జరగకుండా హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
- అమెరికా ఐస్ హాకీ ప్రాంగణంలో కాల్పులు ఐస్ హాకీ క్రీడా ప్రాంగణంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందిన ఘటన ఇక్కడి పాటుకెట్‌లోని డెన్నిస్ ఎం.లించ్ ఎరీనాలో జరిగింది.
- శ్రీలంక సర్కారు కీలక నిర్ణయం.. ఎంపీల పెన్షన్లు రద్దు SriLanka: పొరుగు దేశం శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదం పొందింది.
- ఆ యుద్ధ నౌకలు మునిగిపోవచ్చు! ట్రంప్‌నకు ఖమేనీ హెచ్చరికలు అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు.