US airstrikes on Syria: ఐసిస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా.. సిరియాపై అమెరికా వైమానిక దాడులు

Eenadu icon
By International News Team Updated : 20 Dec 2025 11:12 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: సిరియాలో అమెరికా సిబ్బందిపై ఇటీవల జరిగిన దాడికి అగ్రరాజ్యం ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా సిరియాలో శుక్రవారం రాత్రి నుంచి వైమానిక దాడులు ప్రారంభించింది (US Launches airstrikes on Syria). యూఎస్‌ రక్షణ కార్యదర్శి   పీట్‌ హెగ్సేత్‌ ఈ దాడులను ధ్రువీకరించారు.

ఈ నెల ఆరంభంలో పాల్మిరాలో అమెరికన్‌, సిరియా దళాల కాన్వాయ్‌ లక్ష్యంగా ఐసిస్‌ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు అమెరికన్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిజ్ఞ చేశారు. అందులోభాగంగా తాజాగా దాడులకు దిగారు. దీనికి ‘ఆపరేషన్‌ హాక్‌ఐ స్ట్రైక్‌’ అని పేరు పెట్టారు. పీట్‌ హెగ్సేత్‌ ఈ ఆపరేషన్‌ వివరాలు వెల్లడించారు. ఐసిస్‌ ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలు, ఆయుధ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు తెలిపారు. ‘ఇది యుద్ధానికి ప్రారంభం కాదు. ఐసిస్‌కు మేం విధిస్తున్న శిక్ష. ఈరోజు మేము మా శత్రువులను వేటాడాం. వారిలో చాలామందిని చంపేశాం. దీన్ని కొనసాగిస్తాం’ అని ఓ పోస్టులో రాసుకొచ్చారు. తమ పౌరులను రక్షించేందుకు అమెరికా ఏమాత్రం వెనుకాడబోదన్నారు. తమ దేశ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటే.. ఎవరినైనా సరే వేటాడుతామని హెచ్చరించారు. మధ్య సిరియా అంతటా డజన్లకొద్దీ ఐసిస్‌ స్థావరాలపై ఈ దాడులు జరిగాయని అమెరికా అధికారులు తెలిపారు.

  • తైపీలో బీభత్సం సృష్టించిన దుండగుడు

దీనిపై ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ వేదికగా పోస్టు పెట్టారు. అక్కడి ఐసిస్‌ స్థావరాలపై భీకర దాడులు చేసినట్లు తెలిపారు. ఐసిస్‌ను పూర్తిగా నిర్మూలిస్తే సిరియాకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఈ చర్య గురించి అక్కడి ప్రభుత్వానికి తెలుసని, ఉగ్రవాదులను అంతం చేసేందుకు వారు మద్దతిచ్చారని తెలిపారు.


► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 08:46 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • శ్రీలంక సర్కారు కీలక నిర్ణయం.. ఎంపీల పెన్షన్లు రద్దు SriLanka: పొరుగు దేశం శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదం పొందింది. 
  • ఎవరెస్టంత ఎత్తు వెళ్లే హెలికాప్టర్లు భారత్‌లోనే తయారీ - మోదీ భారత్‌- ఫ్రాన్స్‌ సంబంధాలు ప్రత్యేకమైనవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్‌ దశాబ్దాలుగా భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామిగా ఉందని చెప్పారు.
  • బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం Bangladesh PM Tarique Rahman: బంగ్లాదేశ్‌ నూతన ప్రధానిగా తారిఖ్‌ రెహమాన్‌ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు.
  • వీసా హక్కు కాదు : అమెరికా విదేశాంగ శాఖ కఠిన వీసా విధానాలపై అమెరికా విదేశాంగ మరోసారి స్పందించింది. వీసా అనేది హక్కు కాదని, విదేశీ పర్యటకులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే దాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది.
  • ఇమ్రాన్‌ఖాన్‌కు అనారోగ్యం.. పాకిస్థాన్‌కు కపిల్‌దేవ్, గావస్కర్ రిక్వెస్ట్ Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు మెరుగైన చికిత్స అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాక్‌ను కోరారు. 
  • అమెరికా బాటలో చైనా.. మెరైన్‌ కోర్‌ ఏర్పాటు ప్రపంచవ్యాప్తంగా సైనిక ఆపరేషన్లు చేసేందుకు అమెరికా మాదిరిగా చైనా సైతం మెరైన్‌ కోర్‌ను ఏర్పాటుచేసింది. 
  • యూనస్‌ నోట మళ్లీ ‘సెవెన్‌ సిస్టర్స్‌’.. వెళ్లిపోతూ భారత్‌పై కవ్వింపులు Bangladesh: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటివరకు తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహమ్మద్‌ యూనస్‌ సోమవారం తన పదవి నుంచి వైదొలిగారు.
  • పిల్లలపై లైంగిక వేధింపులు.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్‌ Indian Man Arrested: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారత్‌కు చెందిన ఓ వ్యక్తి అమెరికాలో అరెస్ట్‌ అయ్యాడు. నిందితుడిని ఓడెల యశస్వీ కొత్తపల్లిగా గుర్తించారు.
  • ముంబయి తీరంలో సీజ్‌ అయిన నౌకలు ఇరాన్‌వే! చమురు అక్రమ రవాణాకు పాల్పడుతున్న కారణంగా భారత్‌ కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది సీజ్‌ చేసిన మూడు నౌకలకు ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
  • కిమ్‌ కుమార్తెకు వారసత్వ పగ్గాలు! నిరంకుశ పాలనకు చిరునామాగా నిలిచే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రాజ్యంలో కుటుంబ పోరుకు తెరలేచిందా? అధికార పగ్గాల కోసం కిమ్‌ సోదరి, కుమార్తె పోటీ పడనున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి.
  • గ్రహాంతర జీవులు సంప్రదింపులు జరిపినట్లు ఆధారాల్లేవు: ఒబామా గ్రహాంతర జీవులున్నాయంటూ ఓ పాడ్‌కాస్ట్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
  • బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం చైనాలో వీసా లేకుండా పర్యటించే అవకాశం బ్రిటన్, కెనడా దేశాల ప్రజలకు మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది.
  • పాక్‌లో భారీ చోరీ.. 700 తులాల బంగారు కడ్డీలు మాయం! పాకిస్థాన్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు.. 300 మిలియన్‌ పాకిస్థానీ రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.