Data: డౌటే లేదు.. డేటాదే హవా

Eenadu icon
By Business News Desk Published : 20 Dec 2025 04:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

డేటా.. డేటా.. తరచూ వినిపిస్తున్న పదం ఇది. సమీప భవిష్యత్తులో డేటా వినియోగం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ సంస్థలను, పెట్టుబడులను మనదేశంలో డేటా కేంద్రాల వ్యాపారం ఆకర్షిస్తోంది. ఏఐ (కృత్రిమ మేధ), డేటా లోకలైజేషన్, లో లేటెన్సీ నీడ్స్‌ (గేమింగ్, ట్రేడింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్‌ వంటి రియల్‌ టైమ్‌ అప్లికేషన్లు...). ఇవే  మనదేశంలో డేటాకు గిరాకీ అనూహ్యంగా పెరగటానికి ప్రధాన కారణాలు. 

ఇటీవల కాలంలో వివిధ నగరాల్లో కొత్త డేటా కేంద్రాలు పెద్దఎత్తున ఏర్పాటవుతున్నాయి. ఈ రంగంలోకి భారీగా పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. వచ్చే రెండేళ్ల కాలంలో మనదేశంలో డేటా సెంటర్లకు రూ.55,000- 60,000 కోట్ల వరకూ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇటీవల క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు మరికొన్ని విదేశీ సంస్థలు, స్థానిక కంపెనీలు కొత్త డేటా కేంద్రాల ఏర్పాటులో తీరిక లేకుండా ఉన్నాయి. 

డేటా కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం ‘మౌలిక సదుపాయాల పరిశ్రమ’ హోదా ఇచ్చింది. దీనివల్ల రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. విద్యుత్తు సరఫరా, మానవ వనరుల లభ్యత సులువవుతుంది. ఇదే కాకుండా వ్యయాలను తగ్గించే లక్ష్యంతో మూలధన ఆస్తులకు జీఎస్‌టీలో ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ) సదుపాయాన్ని కల్పించింది.

  • ఇవాళ ఎవరి నోట విన్నా చాట్‌జీపీటీ, గూగుల్‌ జెమినై... పేర్లు వినిపిస్తాయి. షాపింగ్‌ చేసే ముందు ఏ వస్తువు కొనాలి, ఏ బ్రాండు బాగుంది, ఇతర బ్రాండ్లతో పోలిక ఏమిటి...? అనే ఎన్నో సందేహాలకు ఏఐని మన దేశంలో వినియోగదార్లు అధికంగా వాడుతున్నారని తాజా సర్వేలు పేర్కొంటున్నాయి. 
  • ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలా ఇతర విభాగాలు, అంశాలకు సంబంధించిన సమాచారం కోసం ఏఐ మీద ఆధారపటం రోజురోజుకూ పెరుగుతోందే తప్ప తగ్గే పరిస్థితి లేదు. దీనికి అనుగుణంగా ఎన్నో రకాలైన ఏఐ టూల్స్‌ సైతం అందుబాటులోకి వస్తున్నాయి. 
  • ఇంటర్నెట్‌ వినియోగం 2019లో 33.4% మాత్రమే. ఈ ఏడాది ప్రారంభం నాటికి ఇది 55.3 శాతానికి పెరిగింది. అదే విధంగా ఒక వినియోగదారుడి నెలవారీ సగటు డేటా వినియోగం 2019లో 11.5 జీబీ కాగా, ఇప్పుడు అది 32 జీబీకి చేరుకుంది. 
  • డేటా లోకలైజేషన్‌ నిబంధనలతో స్థానికంగా డేటాను నిల్వ చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ‘జనరేట్‌’ అయ్యే డేటాలో మనదేశం వాటా అయిదో వంతు కాగా, అంతే స్థాయిలో డేటా కేంద్రాల సామర్థ్యం లేదు. అన్ని దేశాల్లో ఉన్న డేటా కేంద్రాల సామర్థ్యంలో మన వాటా కేవలం 3 శాతం మాత్రమే. 
  • అందువల్ల పెరుగుతున్న గిరాకీని తట్టుకోవాలంటే అధిక సామర్థ్యం కల డేటా కేంద్రాలు అవసరం. 
  • ప్రస్తుతం మనదేశంలో 280 డేటా కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలకు ఉన్న సామర్థ్యం 1.2 గిగావాట్లు (జీడబ్ల్యూ) కాగా, కొత్త కేంద్రాల ఏర్పాటుతో 2030 నాటికి ఇది 8 గిగావాట్లకు పెరుగుతుందని జెఫరీస్‌ అనే సంస్థ ఇటీవల అంచనా వేసింది. 
  • ముంబయి, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో డేటా కేంద్రాల సామర్థ్యం అధికంగా ఉంది. ఈ జాబితాలో త్వరలో విశాఖపట్నం చేరనుంది.
  • అధిక వినియోగం డేటా కేంద్రాల నిర్వాహకులకు కాసులు పండించనుంది. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.20,000 కోట్ల ఆదాయాల స్థాయికి డేటా కేంద్రాల పరిశ్రమ చేరుకుంటుందని అంచనా. 

డేటా కేంద్రాల విస్తరణలో సవాళ్లు సైతం లేకపోలేదు. డేటా కేంద్రాలకు ఎంతో అధిక విద్యుత్తు అవసరం. 2030 నాటికి డేటా కేంద్రాలు దేశ  విద్యుత్తు లభ్యతలో 3 శాతం వినియోగిస్తాయని అంచనా. ప్రస్తుతం ఇది 1 శాతం మాత్రమే. దీన్ని బట్టి విద్యుత్తు సామర్థ్యం ఎంతగానో పెరగాలని తెలుస్తోంది. ఇదే కాకుండా నీటి అవసరాలు కూడా ఎంతగానో పెరుగుతాయి. అధిక నీటి లభ్యత ఎలా అనేది ప్రధాన సమస్య కాగా, డేటా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో కాలుష్యం తలెత్తి పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భూగర్భ జలాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సవాళ్లకు తగిన పరిష్కారాలు కనుగొనటం పైనే డేటా కేంద్రాల పరిశ్రమ విస్తరణ ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఒక ఛార్జింగ్‌తో 543 కి.మీ. ప్రయాణం మారుతీ సుజుకీ ఇండియా తన తొలి బ్యాటరీ విద్యుత్‌ వాహనం (బీఈవీ) ఇ విటారాను దేశీయంగా విడుదల చేసింది. బ్యాటరీ యాజ్‌ ఎ సర్వీస్‌ (బాస్‌) పథకం కింద  ఇ విటారా బీఈవీలను రూ.10.99 లక్షల పరిచయ ధరకు విక్రయించబోతోంది.
  • ఏఐ రెడీ డేటా సెంటర్లపై రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు పునరుత్పాదక ఇంధన ఆధారిత, భారీ స్థాయి ఏఐ (కృత్రిమమేధ) రెడీ డేటా సెంటర్ల అభివృద్ధి నిమిత్తం 2035 కల్లా 100 బి. డాలర్ల (సుమారు రూ.9 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్‌ ప్రకటించింది.
  • ఔషధ తయారీలో ‘ఏఐ’శకం ప్రపంచ ఔషధ రంగం కూడా కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. మందుల ఆవిష్కరణ మొదలు, వాటి తయారీ వరకు ప్రతి దశలోనూ ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
  • ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ప్రపంచ దేశాలకు జనరిక్‌ ఔషధాల సరఫరాలో అగ్రగామిగా ఉన్న భారత్, 2030 నాటికి బయోలాజిక్స్, బయోసిమిలర్స్‌ విభాగాల్లో భారీ మార్పులు చూడబోతోందని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సహ-ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ ప్రసాద్‌ అన్నారు.
  • పుంజుకున్న ఐటీ షేర్లు వరుసగా రెండో రోజూ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, భారీ యంత్రపరికరాల రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం ఇందుకు దోహదం చేసింది.
  • ఏఐ సమిట్‌.. నియామకాల వేదిక! దేశీయ అగ్రగామి కార్పొరేట్‌ సంస్థలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, అదానీ గ్రూపు.. దిల్లీలో జరుగుతున్న ఏఐ సమిట్‌ను నిపుణుల నియామకాలకు ఒక వేదికగా వాడుకుంటున్నాయి. దేశీయ ఏఐ రంగంలో అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు వేగవంతం అవుతున్నాయి.
  • ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్‌! విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష సేవల సంస్థ స్పేస్‌ ఎక్స్‌ అధిపతి.. అమెరికా అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (54), ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌ (లక్ష కోట్ల డాలర్లు-రూ.90 లక్షల కోట్లు కలిగిన వ్యక్తి)గా అవతరించనున్నారు.
  • జియో ఆరోగ్య ఏఐతో నిమిషాల్లోనే పరిశీలన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం ఏఐ ఆధారిత క్లినిక్‌ మోడల్‌ను ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో జియో ఆరోగ్య ఏఐ ఆవిష్కరించింది.
  • ఈడీ విచారణకు టీనా అంబానీ గైర్హాజరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు రిలయన్స్‌ గ్రూపు ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ భార్య టీనా అంబానీ మళ్లీ గైర్హాజరు అయ్యారు. మనీలాండరింగ్‌ కేసులో విచారణ నిమిత్తం ఆమెకు ఈడీ ఇప్పటివరకు రెండు సార్లు సమన్లు జారీ చేసింది.
  • బంగారు రుణాలకు ప్రత్యేక శాఖలు బంగారం ధర పెరిగి, ఆభరణాల తనఖా రుణాలకు గిరాకీ పెరుగుతున్నందున, ప్రత్యేకంగా ‘గోల్డ్‌ లోన్‌’ శాఖలు ప్రారంభిస్తున్నట్లు ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ వెల్లడించింది.  గుజరాత్‌లోని జామ్‌నగర్, జునాగఢ్‌లలో ఈ విభాగంలో ప్రత్యేక శాఖలు నెలకొల్పినట్లు పేర్కొంది.
  • సంక్షిప్త వార్తలు(5) సీఓపీడీ, ఆస్తమా, బ్రాంకేటైసిస్‌ రోగులకు శ్వాసను మెరుగుపరచేందుకు, కంజెషన్‌ను తగ్గించేందుకు ఒక పరికరాన్ని ఆవిష్కరించినట్లు జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ పేర్కొంది.