Balakrishna: ఫలించిన అఖండ 2 ప్రయత్నం!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

సనాతన హైందవ ధర్మ పరిరక్షణ ఆవశ్యకతని చాటి చెప్పిన సినిమానే ‘అఖండ 2: తాండవం’ అన్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. ఈ సినిమాతో తాము చెప్పిన సందేశం ప్రేక్షకులకు బాగా చేరువైందన్నారు. ఆయన కథానాయకుడిగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే ‘అఖండ 2: తాండవం’. 14 రీల్స్ ప్లస్ నిర్మించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను శుక్రవారం వారణాసిని సందర్శించి, కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కథానాయకుడు బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ‘‘అఖండ 2: తాండవం’ కేవలం తెలుగు సినిమా కాదు, భారతీయులందరూ చూడదగిన సినిమా. నేటితరం సనాతనధర్మం గురించి తెలుసుకోవాలన్న మా ప్రయత్నం ఫలించింది. భక్తి, ధర్మం ప్రధానంగా సినిమాని రూపొందించినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అభినందనలు తెలిపార’’న్నారు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్‌ని గుర్తు చేసుకున్నారు. ఆయన తన యాభయ్యేళ్ల నట ప్రయాణం గురించి కూడా మాట్లాడారు. సినిమా అంటే కేవలం నటన మాత్రమే కాదనీ, ప్రపంచవ్యాప్తంగా ప్రజలతో కనెక్ట్ అయ్యే మాధ్యమం అని, ఇన్నేళ్లు కథానాయకుడిగా కొనసాగుతుండడం ఆనందంగా ఉందన్నారు బాలకృష్ణ.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 03:10 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- నేనూ వాళ్ల బాటలోనే...! సుహాస్ - శివానీ నాగారం జంటగా నటించిన ‘హే భగవాన్’ చిత్రం పేరు మార్చుకుంది. సెన్సార్ బోర్డు సూచనల మేరకు ఈ టైటిల్‌ని ‘హే బల్‌వంత్’గా మార్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది.
- అట్లూరి జీవితం నేటి తరానికో పాఠం కష్టేఫలి అనే సూత్రానికి ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు నిలువెత్తు నిదర్శనమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
- ఏఐ.. నిశ్శబ్దంగా సినిమా భాషని తిరగరాస్తోంది చిత్రపరిశ్రమలో తదుపరి పెద్ద విభజన.. ఏఐ(కృత్రిమ మేధ)ని స్వీకరించేవారికి, వ్యతిరేకించేవారికి మధ్య ఉండదని, ఆ సాధనాలతో మేధో సంపత్తిని నిర్మించేవారికి, వాటిని ఉపయోగించేవారికి మధ్య ఉంటుందని అంటున్నారు హీరో రానా.
- ఓటీటీలో ఈ వారం కొత్త వారం మొదలైంది.. వినోదాల జాతరకి కూడా సమయం ఆసన్నమైంది. అదేనండీ.. ఓటీటీలో వచ్చే కొత్త కథల గురించే ఇదంతా. ఎప్పటిలాగే ఈ వారం కూడా నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్ చేయడానికి వైవిధ్యమైన సిరీస్‌లు, సినిమాల్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి ఓటీటీలు.
- సూపర్ డీలక్స్ తర్వాత పాకెట్ నావెల్ నలుగురు వ్యక్తుల జీవితాల్లోని సంఘటనలతో రూపొంది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రం ‘సూపర్ డీలక్స్’. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, దర్శకుడు త్యాగరాజన్ కుమార రాజా కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రమిది.
- కథ ఇంకా పూర్తి కాలేదు ‘దల్దాల్’ సిరీస్‌లో డీసీపీ రీటా ఫెరీరా పాత్రలో కనిపించి నిందితుల్ని పరుగులు పెట్టించింది బాలీవుడ్ కథానాయిక భూమి పెడ్నేకర్. అమ్రిత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు సురేశ్ త్రివేణి సృష్టికర్త.
- ‘జై హనుమాన్’ సన్నాహాలు ‘హను-మాన్’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడాయన ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
- సంక్షిప్త వార్తలు (4) బాలీవుడ్ కథానాయకుడు రాజ్‌కుమార్ రావ్.. త్వరలో ముంబయికి చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్, క్రికెటర్ సౌరభ్ గంగూలీ బయోపిక్‌లతో తెరపైకి రావడానికి సన్నద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన..