పిలుస్తోంది.. ప్రకృతి ఒడి..!

- A
- A+
- A++

ఈనాడు డిజిటల్- కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రం ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 29న కనువిందు చేసే తెప్పోత్సవం, 30న అత్యంత పవిత్రమైన ఉత్తర ద్వార దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలిరానున్నారు. రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు పర్యాటకంగా ఆకట్టుకునే ప్రాంతాలు భద్రాద్రి జిల్లాలో కొలువై ఉన్నాయి.
వనవాస స్మృతుల వేదిక..
భద్రాచలం నుంచి 35కిలోమీటర్ల దూరంలో గోదావరి తీరాన వెలిసిన పర్ణశాల.. రామాయణ కావ్యాన్ని కళ్లముందుంచే ఒక అద్భుత దృశ్యం. సీతాదేవి స్నానమాచరించి తన నారచీరలను ఆరవేసిన గుర్తులు ఇక్కడి రాళ్లపై ఇప్పటికీ దర్శనమిస్తాయి. పర్ణశాల వద్ద గోదావరి నదిలో భక్తులు బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. పర్ణశాల సమీపంలోని ‘గుండాల’ వద్ద భూమిలో నుంచి వేడినీరు ఉబికి రావటం ఒక ప్రకృతి వింత. భక్తులు ఇక్కడ స్నానం చేయటాన్ని పవిత్రంగా భావిస్తారు.
అరుదైన జంతుజాలాలకు వేదిక ‘పులిగుండాల’
పచ్చని అడవులు, అరుదైన పక్షిజాతులు, జంతువులు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు.. ఇలా ప్రకృతి అందాలకు చిరునామాగా మారాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కనకగిరి గుట్టలు, పులిగుండాల అటవీప్రాంతం. ఇక్కడ ఎకో టూరిజం అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. పర్యాటకులు కనకగిరి కొండ వ్యూ పాయింట్ ద్వారా ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్నారు.
కనువిందు చేసే కిన్నెరసాని అందాలు
దట్టమైన అడవులు, ఎత్తైన కొండల మధ్య నిర్మించిన కిన్నెరసాని ప్రాజెక్టు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యాటకశాఖ ఇక్కడ బోటింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. నీలిరంగు నీటిపై పడవలో ప్రయాణిస్తూ.. చుట్టూ ఉన్న కొండలను చూస్తుంటే ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. జలాశయం మధ్యలో అక్కడక్కడా కనిపించే చిన్నచిన్న దీవులు ప్రకృతి ప్రేమికులకు పసందైన విందును అందిస్తాయి. కిన్నెరసాని పర్యటనలో పిల్లలు, పెద్దలను సమానంగా ఆకట్టుకునే మరో ప్రదేశం జింకల పార్కు. ఇక్కడ వందలాది జింకలు తమ సహజసిద్ధమైన వాతావరణంలో స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. అద్దాలమేడ, కాటేజీల నుంచి ప్రాజెక్టును వీక్షించటం ద్వారా మధురానుభూతి పొందవచ్చు.
మరిన్ని చూడదగిన ప్రాంతాలు..
- దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్పలో పంటపొలాలు, ఆదివాసీ ఆవాసాలు, ఆహార అలవాట్లను పరిశీలించవచ్చు. పర్యాటకుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా క్యాంప్ ఫైర్, రేలా నృత్య ప్రదర్శనలు ఉండనున్నాయి.
- భద్రాచలంలో గిరిజన మ్యూజియం మరింత ఆకర్షణగా నిలవనుంది. ముక్కోటి వేడుకలకు వచ్చే భక్తులు.. ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఇదో చక్కని వేదిక.
- భద్రాచలం గోదావరి గట్టుపైన సెల్ఫీ పాయింట్ ద్వారా గోదావరి నది అందాలను బంధించవచ్చు.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రామదాసు ఇంట.. సరిగమల పులకింత [ 19-02-2026] భక్త రామదాసు నడయాడిన నేల.. కీరవాణి స్వర ఝరిలో ఓలలాడింది. సుస్వరాల గానమాలికలో.. సంగీత హోరులో ఖమ్మం మెట్టు పులకించింది. దేదీప్యమానంగా కాంతులీనిన వేదికపై సీతా సమేత శ్రీరాముడిని స్మరిస్తూ.. స్తంభాద్రిని కొలుస్తూ.. గాయనీగాయకులు ఆలపించిన గీతాలు సమ్మోహనపరిచాయి.. సంగీత విభావరితో నగరం మైమరిచిపోయింది.
- ఇన్‌స్టాలో డీల్స్ [ 19-02-2026] అడవుల గుండా, వాహనాల సీట్ల కింద గంజాయిని దాచి తరలించటాన్ని చూశాం.. కానీ చీకటి వ్యాపారం రూపు మార్చుకుంది. యువత చేతిలోని స్మార్ట్‌ఫోన్లు గంజాయి విక్రయాలకు అడ్డాలుగా మారుతున్నాయి.
- కల్లూరు పురపాలికను ఆదర్శంగా తీర్చిదిద్దండి: తుమ్మల [ 19-02-2026] నూతనంగా ఏర్పడిన కల్లూరు పురపాలికను ఆదర్శంగా తీర్చిదిద్దాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
- రేపటితో పత్తి కొనుగోళ్లు సమాప్తం! [ 19-02-2026] ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారత పత్తి సంస్థ(సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు తుది దశకు చేరాయి. ఈనెల 20(శుక్రవారం)తో పూర్తికానున్నాయి. ఉభయ జిల్లాల్లో సుమారు నాలుగు నెలల్లో రూ.583.23కోట్ల పత్తిని సీసీఐ సేకరించింది. 82.50% సొమ్మును కర్షకులకు చెల్లించింది.
- చదివిందే మళ్లీ చదవండి! [ 19-02-2026] ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. పరీక్షల సమయం సమీపిస్తున్నకొద్దీ విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు.
- వేగంగా పనులు.. సకాలంలో బిల్లులు [ 19-02-2026] నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఊపందుకుంటోంది. రెండు దశల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సుమారు 33వేల ఇళ్లకు మంజూరు పత్రాలు లభించాయి
- పక్కాగా పసిడి లెక్క [ 19-02-2026] భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిరుపయోగంగా ఉన్న ఆభరణాల లెక్కలు తీస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే శ్రీరామ నవమికి బంగారం, వెండిని బాండ్లు రూపంలోకి మార్చాలని యోచిస్తున్నారు.
- నిఘా ఉంటేనే.. చోరీలకు అడ్డుకట్ట [ 19-02-2026] జిల్లాలో ఏటా 100 నుంచి 150 విద్యుత్తు నియంత్రికల దొంగతనాలు సంభవిస్తున్నాయి. రైతులు, విద్యుత్తుశాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అధిక శాతం దొంగతనాలు పంటలు ముగిసిన తర్వాత, వేసవికాలంలోనే జరుగుతుంటాయి