కమ్మేసే నిర్లక్ష్యం.. కాటేసే కాలుష్యం..

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Updated : 20 Dec 2025 08:15 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇవీ... జగ్గయ్యపేట ఆటోనగర్‌లో చుట్టుపక్కల బోర్లు వేయగా వస్తున్న నీరు. పసుపు రంగు సీసాలో పారిశ్రామికవాడలో వేసిన బోరు నీరు. ముదురు తెలుపు రంగు నీరు అక్కడ నుంచి 500 మీటర్లలో వేసిన బోరు నీరు. స్వచ్ఛంగా ఉన్నవి కిమీ పైగా దూరంలో వేసిన బోరు నీరు. ఇదే కాలుష్య ప్రభావానికి తార్కాణం.

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - జగ్గయ్యపేట, గ్రామీణం: ఫార్మా కంపెనీ నిర్వాహకుల లాభాపేక్ష ప్రజలు, జంతువుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వ్యర్థాల నిర్వహణ గాలికొదిలేశారు. స్థానికంగా ప్రజలు తల్లడిల్లుతున్నా... కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.

అడ్డగోలు వ్యవహారం...

  • జగ్గయ్యపేట ఆటోనగర్‌లో ఫార్మా, కెమికల్స్, టైర్ల వ్యర్థాలతో ఆయిల్‌ తయారు చేసే కంపెనీలు 7 వరకు ఉన్నాయి. 
  • వ్యర్థాలను ట్రీట్మెంట్‌ చేశాకే బయటకు వదలాలి. ఇక్కడ ట్రీట్మెంట్‌ లేకుండా రివర్స్‌ బోరింగ్‌ ద్వారా మళ్లీ భూమిలోకే పంపుతున్నారు. 
  • భూమి పొరల్లో ఖాళీల ద్వారా చుట్టుపక్కల 2 కి.మీ. మేర కలుషితం అవుతోంది. భూగర్భ జలాలు విషతుల్యం అవుతున్నాయి అర్ధరాత్రి నుంచి రసాయన అవశేషాలతో కూడిన గాలినీ వదులుతున్నారు. 
  • షేర్‌మహ్మద్‌పేట, శాంతినగర్, డాంగేనగర్, విష్ణుప్రియ నగర్, డీవీఆర్‌ నగర్, ఆర్టీసీ కాలనీ, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లోని 15 వేల మంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
  • ఊపిరితిత్తులు, కిడ్నీ, చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. పెద్ద సంఖ్యలో గేదెలు, ఆవులు, గొర్రెలు, కుక్కలు మృత్యువాతపడ్డాయి.
  • సమీపంలోనే భూమిలో వెళుతున్న గ్యాస్, డీజిల్‌ పైపులైన్లు సైతం ఈ కాలుష్య తీవ్రతకు దెబ్బతింటే.. ప్రమాదం వాటిల్లే వీలుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆటోనగర్‌ కాలుష్యంతో అనారోగ్యం పాలువుతున్నామని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. కంపెనీల నిర్వహణ దయనీయంగా ఉందనీ.. పరిస్థితి చక్కదిద్దేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సత్వరమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదేనా నియంత్రణా...?

కాలుష్య నియంత్రణ అధికారులకు పదుల సంఖ్యలో అర్జీలు ఇచ్చారు. నమూనాలు సేకరించి హడావుడి చేయడం తప్ప ఇప్పటి వరకు ఆ నమూనాల ఫలితాలు వెల్లడించిన దాఖలాలు లేవు. కంపెనీ నిర్వాహకుల నుంచి ఆమ్యామ్యాలు తీసుకుని కనీస చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 

కమిటీగా ఏర్పాటై చక్కదిద్దుతాం..

విజయవాడ కాలుష్య నియంత్రణ బోర్డు ఈఈ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కాలుష్యం జరుగుతున్న విషయం ఇప్పటికే గుర్తించామన్నారు. ఒక్కో కంపెనీకి రూ.16 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించామనీ.. మళ్లీ సంబంధిత శాఖలన్నీ కమిటీగా ఏర్పాటై పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

► Read latest Amaravati krishna Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 07:12 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • నమ్మించి.. నిలువునా ముంచేసి.. [ 19-02-2026] ఉద్యోగాల పేరుతో దాదాపు రెండేళ్లుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాగుతున్న దందాలో చిక్కుకున్న బాధితుల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది.
  • దూసుకొస్తూ.. ప్రాణాలు హరిస్తూ..! [ 19-02-2026] ద్విచక్ర వాహనాలతో మైనర్లు రహదారులపైకి దూసుకొస్తుండడంతో.. ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మానసిక పరిపక్వత లేని వయసులో బైక్‌లను వారికి ఇచ్చి.. రహదారులపైకి వదులుతున్న తల్లిదండ్రులే అసలు దోషులని.. పోలీసులు హెచ్చరిస్తున్నారు.
  • ఎంఎస్‌ఎంఈ పార్కులకు..స్థలాలు సిద్ధం [ 19-02-2026] జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు స్థలాల ఎంపిక పూర్తయింది. ఇప్పటికే విజయవాడ మధ్య, జగ్గయ్యపేట, మైలవరంలో స్థలాల గ్రౌండింగ్‌ పనులు ఆరంభించారు.
  • ఇబ్బందిగా సిబ్బంది లేమి [ 19-02-2026] రాజధాని అమరావతి మహా నగర విస్తరణకు రెండో విడత చేపట్టిన భూసమీకరణ ప్రక్రియకు సిబ్బంది కొరత అడ్డంకిగా మారింది.
  • దాచుకున్నారు.. తీసుకోరే‘మనీ’..! [ 19-02-2026] బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి కొంతకాలం లావాదేవీలు నిర్వహించిన తరవాత ఏళ్ల పాటు వాటిని పట్టించుకోకుండా వదిలేశారు. వ్యక్తిగత, ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార సంస్థలకు చెందిన ఖాతాల్లో పదేళ్లకు పైగా లావాదేవీలు జరపకపోవడంతో వాటిని అన్‌క్లెయిమ్డ్‌ ఖాతాలుగా గుర్తించారు.
  • సేవలు నచ్చేలా.. పౌరులు మెచ్చేలా... [ 19-02-2026] సీఆర్డీఏ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి యంత్రాంగం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. ఏపీసీఆర్డీఏ పరిష్కారం 2.0 ద్వారా రైతులు కాలు కదపనవసరం లేకుండానే అర్జీ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
  • బెయిల్‌పై వచ్చి.. చోరీకి పాల్పడి [ 19-02-2026] పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల కిందట చింతలపూడిలోని ధూళిపాళ్ల ప్రమీలాదేవి ఇంట్లో రూ.70 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీ అయిన విషయం తెలిసిందే.
  • మోగనున్న పెళ్లిబాజాలు.. [ 19-02-2026] శుభకార్యాలకు వేళయ్యింది. ఈనెల 19వ తేదీ నుంచి పెళ్లి బాజాలు మోగనున్నాయి. వివాహాలతోపాటు నూతన గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభోత్సవాలు, నిశ్చితార్థాలు, శంకుస్థాపనలు ఇలా ఒక్కటేమిటి అన్నింటా వేడుకలు జరగనున్నాయి.
  • చెన్నైలో నిందితుల కోసం అన్వేషణ [ 19-02-2026] ఇటీవల యనమలకుదురులో వెలుగుచూసిన అద్దె ఖాతాల కేసులో ఇప్పుడు సీన్‌ చెన్నైకి మారింది. ఈ కేసులో అసలు సూత్రధారుల కోసం సైబర్‌ పోలీసు ప్రత్యేక బృందం చెన్నైలో మకాం వేసింది.
  • సీసీఎస్‌ పోలీసుస్టేషన్‌లో అగ్నిప్రమాదం [ 19-02-2026] గుడివాడ సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. 2000 సంవత్సరం నాటి తాలూకా పోలీసుస్టేషన్‌ రికార్డులు, కొన్ని పేపర్లు కాలిపోయాయి. స్టేషన్‌లో బుధవారం ఉదయం ఒక్కసారిగా పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం ఇచ్చారు.