Bhongir: రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి-ఆలేరు రైలుమార్గంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం... ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం(25)కు, అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని(19)తో రెండు నెలల క్రితం వివాహమైంది. సింహాచలం హైదరాబాద్‌లో ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తుండగా జగద్గిరిగుట్టలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు దంపతులు మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలులో సికింద్రాబాద్ నుంచి గురువారం రాత్రి బయలుదేరారు. రైలు వంగపల్లి రైల్వేస్టేషన్ దాటిన తర్వాత డోర్ వద్ద నిలబడి ఉన్న ఇద్దరూ జారిపడి మృతిచెందారు. శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ట్రాక్‌మెన్ గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రైల్వే జీఆర్పీ ఇన్‌ఛార్జి కృష్ణారావు తెలిపారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కర్ణాటకలో ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష కర్ణాటకలోని హంపి సమీపంలో పర్యాటకులపై దాడి, అత్యాచారం, హత్య కేసులో గంగావతి అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
- విష ప్రయోగంతో 26 వలస పక్షుల మృతి కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట్ మండలం ఎల్లూరు చెరువు వద్ద... 26 వలస పక్షులు వేటగాళ్ల విషపు ఎరకు బలయ్యాయి. బాధ్యులైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
- బీరువా ఎత్తుకెళ్లిన దొంగలు జిల్లాకేంద్రం వినాయక్‌నగర్‌లో ఆదివారం అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శమీమున్నీసాబేగం తాళం వేసి బయటకు వెళ్లారు.
- ఇంట్లోనే మృతదేహం.. అడిగితే ఆగ్రహం నాలుగు రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే ఉంచి.. ప్రార్థనలు చేస్తున్నామంటూ వింతగా మాట్లాడిన కుటుంబంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- భార్య, కుమారుడిని హతమార్చి విశ్రాంత జవాను ఆత్మహత్య ఆర్మీ విశ్రాంత జవాను ఒకరు తన భార్య, కుమారుడిని కాల్చి చంపి.. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో చోటుచేసుకుంది.
- రాజస్థాన్‌లో అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం రాజస్థాన్‌లోని ఖైర్తల్-తిరాజా జిల్లా భివాడీ ప్రాంతంలో ఉన్న ఓ రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు.
- సింగపూర్‌లో భారత్ సంతతి వ్యక్తికి జైలు శిక్ష ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమె గౌరవానికి భంగం కలిగించినందుకు భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి సింగపూర్ కోర్టు ఐదు నెలల జైలు శిక్ష విధించింది.