
Nara Lokesh: రెడ్ బుక్‌లో మూడు పేజీలే అయ్యాయి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, కాకినాడ: ‘ఎంత మంచి సినిమా అయినా అందులో చిన్న విలన్ ఉంటాడు. మనకూ ఓ విలన్ ఉన్నాడు. ఆయనొస్తే అరెస్టు చేస్తారట. మన నాయకుడిని జైలులో వేసి ఏం చేయగలిగారు.. ఇప్పుడు ఆయన బెదిరింపులకు మనం భయపడాలా..? ఆయన కంటే ముందు ఇలాగే మాట్లాడినవారి పరిస్థితి ఇప్పుడేమైందో గుర్తుతెచ్చుకోండి’ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో పట్టణ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఈ మధ్య వారు ఎగిరెగిరి వస్తున్నారు. రప్పారప్పా అంటున్నారు. మేం రెండు రప్పాలిస్తాం. రెడ్ బుక్‌లో మూడు పేజీలే అయ్యాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు’ అంటూ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు.
సొంతపార్టీలోనే పోరాడాను..
‘జగన్‌తో ఎంత పోరాడానో పార్టీలో సంస్కరణలు తీసుకురావడానికి సొంతవారితోనూ అంతే పోరాడా. మారిన కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకొస్తున్నాం. ఈ రోజుకు కూడా చంద్రబాబునాయుడితో పోరాడతా. కానీ ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తలవంచి దాన్ని అమలుచేసే వ్యక్తిని నేను’ అని లోకేశ్ పేర్కొన్నారు.
కార్యకర్తలు కాదు.. కుటుంబ సభ్యులు మీరు..
‘తెదేపా కార్యకర్తలంతా కుటుంబ సభ్యులే. అంజిరెడ్డి తాత, మంజుల, తోట చంద్రయ్యలే నాకు స్ఫూర్తి. ఫ్యాక్షన్ దాడిలో మృతి చెందిన చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం. రాష్ట్రానికి చంద్రబాబే బ్రాండ్. కుప్పం, హిందూపురం నియోజకవర్గాలు తెదేపాకు కంచుకోట. ఇప్పుడు మంగళగిరి, రాజమహేంద్రవరం కంచుకోటగా చరిత్ర తిరగరాయాలి. మంగళగిరి నియోజకవర్గంతో పోటీ పడతామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సవాల్‌ను స్వీకరిస్తున్నా. కష్టకాలంలో ఆదిరెడ్డి కుటుంబం మాకు అండగా నిలిచింది. మేం కూడా వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం. . వచ్చే 15 ఏళ్ల వరకు కూటమి కలిసికట్టుగానే పోటీచేస్తుంది’ అని స్పష్టం చేశారు. అనంతరం పార్టీలో బాగాపనిచేసిన కార్యకర్తలకు ధ్రువపత్రాలిచ్చారు. అందరితోను ఫోటోలు దిగి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో జోనల్ కో ఆర్డినేటర్ సుజయ్‌కృష్ణరంగారావు, నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సంక్షిప్త వార్తలు(16) జోడు రథాలు.. మిన్నంటిన శివనామస్మరణలు.. కిక్కిరిసిన వీధులతో శ్రీకాళహస్తిలో రథోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది.
- స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి: రొమానా క్రోపిలోవా మధ్య ఆదాయ దేశాల్లో విద్యలో తీసుకొచ్చిన కొన్ని ఏఐ సాధనాలు విఫలమవుతున్నాయని ఫ్యాబ్ ఏఐ ఎడ్యుటెక్ డైరెక్టర్ రొమానా క్రోపిలోవా తెలిపారు.దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంప్యాక్ట్ సమ్మిట్‌లో సోమవారం ఆమె మాట్లాడుతూ..
- ప్రభుత్వ సేవలు మరింత సులభతరం ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించారు.
- సింగిల్ జడ్జి ఉత్తర్వులపై దామోదరనాయుడు అప్పీల్ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌గా తన నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డాక్టర్ టి.దామోదరనాయుడు దాఖలు చేసిన రెండు అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
- వైకాపా హయాంలోని ఇళ్ల పట్టాలపై విచారణ చేయాలి ఎన్నికలకు ముందు వైకాపా ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో అసలైనవి ఎన్ని, నకిలీవి ఎన్ని అనే అంశంపై ప్రభుత్వం విచారణ జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు.
- జస్టిస్ బాలాజికి ఘన సన్మానం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మెడమల్లి బాలాజిని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు.
- నూజివీడు కోర్టుకు హాజరైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో నమోదైన కేసులో వైకాపాకు చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సోమవారం నూజివీడులోని న్యాయస్థానంలో హాజరయ్యారు.
- తంబళ్లపల్లె కోర్టుకు జోగి సోదరులు ములకలచెరువు నకిలీ మద్యం కేసులో వైకాపా నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము, ఇతర నిందితులు బాలరాజు, రాజేష్, మణిమారన్, ఎన్.రవి, అన్బురాసు, అల్లాబక్షు కోర్టులో వాయిదాకు హాజరయ్యారు.
- డ్వాక్రా మహిళలకు తీపికబురు మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకొని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు అందించనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
- రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల.. మే నెల కోటా విడుదల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల మే నెల కోటాను ఈనెల 18న ఉదయం పది గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- 498 కేసులో లుకౌట్ నోటీసా? పోలీసులు యాంత్రిక ధోరణిలో లుకౌట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ చేసేస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది.
- బీసీ కోటా ఖరారుకు డెడికేటెడ్ కమిషన్! స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలుకు వీలుగా రాష్ట్రంలో బీసీల జనాభా అధ్యయనానికి డెడికేటెడ్ కమిషన్‌ను నియమించనుంది.
- నెల్లూరు మేయర్, ఏలూరు డిప్యూటీ మేయర్ స్థానాలకు 26న ఎన్నికలు రాష్ట్రంలోని నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థల్లో ఖాళీ అయిన మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు.
- త్యాగనిరతికి నిలువెత్తు ఆకృతి రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన ఆ మహనీయుడి త్యాగనిరతిని భావితరాలకు తెలియజేసేందుకు శాఖమూరు వద్ద ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పేరుతో ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది.
- రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరలో వీ2వీ వ్యవస్థ ‘కృత్రిమ మేధ(ఏఐ)తో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం సాధ్యం. త్వరలోనే ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం అందే సాంకేతిక వ్యవస్థను (వీ2వీ) అందుబాటులోకి తీసుకురానున్నాం.
- ఇంటింటికీ నీటి సరఫరాపై నిఘా గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటి సరఫరాలో నాణ్యత ప్రమాణాలను ఏఐతో ఎలా పర్యవేక్షిస్తున్నారో వివరించారు ‘ఆర్ఘ్యం’ సంస్థ సీనియర్ మేనేజర్ భావన బడోలా.
- క్రీడాకారుల ఆటను ఏఐతో ట్రాక్ చేస్తున్నాం క్రీడాకారుల ఆట తీరు, వ్యక్తిగత శిక్షణ కార్యక్రమాలను కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా ట్రాకింగ్ చేస్తున్నామని లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపకులపతి కపానా శర్మ తెలిపారు.
- సముద్రాలకు ప్లాస్టిక్ నుంచి విముక్తి ఏఐ ఆధారిత విధానాలతో సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపొచ్చని కర్ణాటకలోని ఉడుపికి చెందిన బేరు కోస్ట్ క్లియర్ సంస్థ వ్యవస్థాపకురాలు దివ్యా హెగ్డే అనుభవపూర్వకంగా తెలిపారు.
- సాగరతీరంలో మిలన్ సంబరాలు అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష (ఐఎఫ్‌ఆర్-2026), మిలన్ వేడుకల్లో భాగంగా తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో సోమవారం సన్నాహక విన్యాసాలు జరిగాయి.
- తిరుమలలో తెలంగాణ భవన్‌కు స్థలం కేటాయించండి తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, భద్రాచలం సమీపంలోని ఐదు ఏపీ గ్రామాల్ని తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరినట్టు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.