Sanjoy Paul: భారత సాంకేతిక నిపుణుడికి యూఎస్‌లో అరుదైన గౌరవం

Eenadu icon
By National News Team Published : 20 Dec 2025 00:07 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హ్యూస్టన్‌: భారతదేశానికి చెందిన సాంకేతిక నిపుణుడు సంజోయ్‌ పాల్‌కు (Sanjoy Paul) అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో విద్యారంగంలో ఆవిష్కర్తలకు ఇచ్చే అత్యున్నత నేషనల్ అకాడమీ ఆఫ్‌ ఇన్వెంటర్స్‌ (ఎన్‌ఏఐ) జాబితాలో స్థానం సంపాదించారు. ఈ మేరకు అకాడమీ ఇటీవల ప్రకటించింది. పాల్‌ ప్రస్తుతం రైస్‌ నెక్సస్‌ ఇన్నోవేషన్‌ హబ్‌, ఏఐ హ్యూస్టన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, రైస్‌ యూనివర్సిటీ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2025 సంవత్సరానికి సంబంధించి 169 మంది ఎంపిక కాగా.. అందులో పాల్ కూడా ఉన్నారు.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్స్‌ (IEEE) విభాగంలో పాల్‌ 95 పేటెంట్‌ హక్కులను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, నెట్‌వర్కింగ్‌, ది ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (IoT) విభాగాల్లో గుర్తింపు పొందారు. అంతకుముందు పాల్‌.. బెల్‌ ల్యాబ్స్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, యాక్సెంచర్‌ సంస్థల్లో సీనియర్ రీసెర్చ్‌, లీడర్‌షిఫ్‌  బాధ్యతలు నిర్వర్తించారు. ఏఐ, రోబోటిక్స్‌, 5జీ, డిజిటల్‌ ట్విన్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి పట్టభద్రులైన పాల్‌.. థామస్‌ ఆల్వా ఎడిసన్‌ పేటెంట్‌ అవార్డు,  విలియం ఆర్‌. బెన్నెట్‌ అవార్డ్‌, ఇన్ఫోసిస్‌ ఎక్స్‌లెంట్‌ అవార్డ్‌, ఎంఐటీ టెక్నాలజీ రివ్యూస్‌ గ్రాండ్‌ ఛాలెంజెస్‌ ఫర్‌ ఇండియా అవార్డ్‌ సహా పలు పురస్కాలను అందుకున్నారు.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Sanjoy Paul: Rare honor for Indian technologist in US

Eenadu icon
By National News Team Published : 20 Dec 2025 00:07 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Houston: Indian technologist Sanjoy Palku. (Sanjoy Paul) got a rare honor. He has earned a place in the National Academy of Inventors (NAI) list, the highest award given to inventors in the field of education in America. The Academy recently announced this. Paul currently serves as the Executive Director of the Rice Nexus Innovation Hub, AI Houston, and the Associate Vice President of Technology Development at Rice University. 169 people have been selected for the year 2025, including Paul.

Paul holds 95 patent rights in the Institute of Electrical and Electronics Engineers (IEEE) section. Besides, he has been recognized in the fields of Artificial Intelligence, Machine Learning, Networking, The Internet of Things (IoT). Earlier, Paul held senior research and leadership positions in Bell Labs, Wipro, Infosys and Accenture. Played a key role in research and development of AI, robotics, 5G, digital twin technologies. Paul who graduated from IIT Kharagpur.. Thomas Alva Edison Patent Award, William R. He has received many awards including Bennett Award, Infosys Excellence Award, MIT Technology Reviews Grand Challenges for India Award.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :