Vizag: విశాఖలో అదుపుతప్పిన నేవీ గ్లైడర్‌ .. మరో ప్రాంతంలో దిగడంతో కలకలం

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 19 Dec 2025 19:25 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విశాఖపట్నం: విశాఖలో ఒక నేవీ సెయిలర్ గ్లైడింగ్ చేస్తూ నిర్దేశిత ప్రాంతంలో కాకుండా మరో చోట దిగిపోవడం కలకలం రేపింది. విశాఖలోని సింధియా కోరమండల్ శివారు జిప్సం యార్డు వద్ద గ్లైడర్‌తో నేవీ సెయిలర్ దిగిపోయారు. గాలివాటం వల్ల  లేదా సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగి ఉంటుందని నౌకాదళ అధికారులు భావిస్తున్నారు. సెయిలర్, గ్లైడర్ ను అదుపులోకి తీసుకుని శిక్షణ స్థావరానికి తరలించారు. తూర్పు నౌకాదళ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగా నుంచి నేవీ పారా చ్యూట్ గ్లైడర్‌తో ఈ సెయిలర్ పయనమయ్యాడు. గాజువాక డిపో సమీపంలో ఉన్న ఐఎన్ఎస్ ఏకశిల ఆవరణలో దిగాల్సిన గ్లైడర్ మరో ప్రాంతంలో దిగడంతో ఆందోళన నెలకొంది. ఎట్టకేలకు సురక్షితంగా భూమిపై దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Vizag: Navy glider that went out of control in Visakha .. Confusion as it landed in another area

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 19 Dec 2025 19:25 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Visakhapatnam: In Visakhapatnam, a Navy sailor landed in a place other than the designated area while gliding. A Navy sailor landed with a glider at a gypsum yard in Scindia's Coromandel suburb of Visakhapatnam. Naval officials believe that this may have happened due to wind or a technical fault. The sailor and the glider were taken into custody and taken to the training base. The sailor took off from the Eastern Naval Air Station INS Dega on a Navy Parachute Glider. There was concern when the glider, which was supposed to land in the INS Ekshila compound near the Gajuwaka depot, landed in another area. Everyone breathed a sigh of relief as they finally landed safely on the ground.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :