

ఎదురుగాలే ఎదుగుదలకు ఊతం!

- A
- A+
- A++

పరిస్థితులన్నీ అనుకూలిస్తూ అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ మనలో దాగి ఉన్న అసలు సామర్థ్యం బయటపడేది మాత్రం ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే. నిజానికి జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలన్నీ అడ్డంకులు కావు. చాలాసార్లు అవే మన ప్రగతికి సోపానాలు. గాలిపటం గాలితో కలిసి ఎగరదు. గాలికి ఎదురుగా పైకి ఎగురుతుంది. వెనుకనుంచి గాలి వీస్తే గాలితో పాటు కొట్టుకుపోతుంది. ఎదురుగాలే దాన్ని పైకి లేపుతుంది.
బలమైన ఈదురుగాలులూ, భారీ అలలతో కూడిన సముద్రంలోకి వెళ్లినప్పుడే నౌక కెప్టెన్ నైపుణ్యం ఏంటో తెలుస్తుంది. వాతావరణం అనుకూలంగా ఉండి అలలులేని సముద్రంలో ఎవరైనా ఓడను నడపగలరు. తుపానులో కూడా దిశను కోల్పోకుండా ఓడను గమ్యం వైపు నడపగలిగినవాడే నిజమైన నావికుడు. ప్రతికూల పరిస్థితులే మనలోని నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. మనం చేసే ప్రతి పనినీ అందరూ ఆమోదించాలని ఆశించడం సహజం. కానీ అది సాధ్యం కాదు. మన ఆలోచనలనూ, నిర్ణయాలనూ, పనితీరునూ ఎవరైనా విమర్శించవచ్చు. అంతమాత్రాన వాళ్లు శత్రువులు కారు. కొన్నిసార్లు మనకు కనిపించని లోపాన్ని మరొకరు చూపిస్తారు. విమర్శ ఎదురైనప్పుడు, ‘నన్నెందుకు విమర్శించారు’ అని బాధపడటంకన్నా ‘ఇందులో నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా?’ అని ఆలోచించాలి. విమర్శను అహంకారంతో తిరస్కరిస్తే ఒక పాఠాన్ని కోల్పోవచ్చు. విమర్శలోని ఉపయోగకరమైన అంశాన్ని ‘ఫీడ్ బ్యాక్’లా స్వీకరిస్తే అది మనల్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశమవుతుంది. మన తప్పును చూపించే వ్యక్తి మనకు నచ్చకపోవచ్చు. కానీ అతడు చూపించిన తప్పు మనకు ఉపయోగపడవచ్చు. ఇదే ‘గ్రోత్ మైండ్సెట్’లోని సారం! అలాగే ప్రతి తిరస్కరణా మన విలువను తగ్గించదు. కొన్నిసార్లు అది సామర్థ్యానికి మరింత పదును పెడుతుంది. ఉహించని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, ‘నాకే ఇలా ఎందుకు జరుగుతోంది?’ అనుకోకుండా, ‘ఈ పరిస్థితి నాకు ఏం నేర్పడానికి వచ్చింది!’ అని ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్న మన దృష్టికోణాన్ని మార్చగలదు. ప్రతికూలతను శాపంగా చూసే మనస్తత్వం నుంచి పాఠంగా చూసే దిశగా తీసుకెళ్లగలదు.
గాలిపటం ఎప్పుడూ గాలితో ‘యుద్ధం’ చేయదు. గాలిని ఉపయోగించుకుంటుంది. మనమూ ప్రతికూల పరిస్థితులతో పోరాడనక్కర్లేదు. వాటిని అర్థం చేసుకుని మన ఎదుగుదలకు అనుకూలంగా మలచుకోవాలి. గాలిపటం ఎంత ఎత్తుకు ఎగిరినా దారంతో కలిసి ఉన్నంతవరకే అది సురక్షితం. ఎగరడానికి గాలి ఒక్కటే సరిపోదు. పటం దృఢంగా ఉండాలి. దారం బలంగా ఉండాలి. పట్టుకున్న చేయి స్థిరంగా ఉండాలి. సరైన దిశ కూడా ముఖ్యం. జీవితంలో ప్రతికూలతలు ఉంటేనే మన ఎదుగుదల జరిగిపోతుందని కాదు. వాటిని ఎంత సమర్థంగా ఎదుర్కొన్నామన్నది ముఖ్యం. క్రమశిక్షణ, విలువలు, ఆత్మవిశ్వాసం అనే ‘దారం‘తో జీవితాన్ని అనుసంధానించుకున్నప్పుడే ఎంత ఎత్తుకు ఎదిగినా మనమూ స్థిరంగా ఉండగలం. అసలు ‘ఎదురు గాలి’ అనేదే ఉండకూడదని కోరుకోవడం కంటే, ఎంతటి ఎదురు గాలిలోనైనా ఎగరగలిగే బలమైన ‘రెక్కల’ను కోరుకుందాం!
ప్రపంచ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 32శాతం మేర (414 కోట్ల హెక్టార్లలో) విస్తరించి ఉన్నాయి. అందులో 54శాతానికి రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనాలే నెలవులు. వ్యవసాయం, ఇతర అవసరాల కోసం విచ్చలవిడిగా అడవులను నరికేయడంతో 1990 నుంచి దాదాపు 49 కోట్ల హెక్టార్ల పరిమాణంలో అరణ్యాలు నాశనమయ్యాయి. ఆయా కాలాల్లో అటవీ విస్తీర్ణం ఏటా కొత్తగా కాస్త పెరిగినా, అడవుల నరికివేతా విచ్చలవిడిగా సాగింది. ఆ వివరాలు.. (కోట్ల హెక్టార్లలో)

బలహీనులే తమ స్థితిగతులకు బాధ్యత వహించరు. పరిస్థితుల మీదో, ఇతరుల మీదో నింద వేస్తారు. బలమైన వ్యక్తిత్వం ఉన్నవారు తాము నమ్మిన విలువలకు కట్టుబడి ఉంటారు. ఆ క్రమంలో ఎలాంటి కష్టనష్టాలనైనా ఎదుర్కొంటారు.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
English Translation
- A
- A+
- A++

pIf all the conditions are favorable and everything happens as we expect, life will happen. It goes smoothly. But the real potential that is hidden in us comes out only when faced with negative situations. In fact, all the adversities in life are not obstacles. Many times they are the stepping stones to our progress. A kite does not fly with the wind. Fly up against the wind. If the wind blows from the back, it will be washed away with the wind. It is the opposite wind that lifts it up.
The skill of the ship captain is known only when he goes into the sea with strong gusts and huge waves. Anyone can sail a ship in a calm sea if the weather is favorable. A true sailor is one who can steer the ship towards its destination without losing direction even in a storm. Adversity is what sharpens our skills. It is natural to expect everyone to approve of everything we do. But that is not possible. Anyone can criticize our thoughts, decisions and performance. They are not enemies after all. Sometimes someone else points out a flaw that we don't see. When faced with criticism, instead of thinking 'why did you criticize me', you should think 'Is there anything to learn from this?' Arrogantly rejecting criticism can lead to missing a lesson. Accepting the useful aspect of criticism as 'feedback' is an opportunity to improve ourselves. We may not like the person who points out our fault. But the mistake he shows may be useful to us. This is the essence of 'Growth Mindset'! Nor does every rejection devalue us. Sometimes it sharpens the ability. When faced with unexpected negative situations, one should ask, 'Why is this happening to me?', 'What has this situation taught me?' That question can change our perspective. It can take you from a mindset of seeing negativity as a curse to seeing it as a lesson.
A kite never 'fights' the wind. Uses air. We also don't want to fight against negative situations. We have to understand them and adapt them for our growth. No matter how high a kite flies, it is safe as long as it stays together with the string. Air alone is not enough to fly. The map should be solid. The thread should be strong. The holding arm should be steady. Correct direction is also important. If there are negatives in life, it does not mean that our growth happens. What matters is how effectively we deal with them. When we connect life with the 'thread' of discipline, values and self-confidence, we can remain stable no matter how high we rise. Instead of wanting no real 'headwind', let's want strong 'wings' that can fly in any headwind!
Forests cover 32 percent (414 million hectares) of the world's total geographical area. Russia, Brazil, Canada, America and China account for 54 percent of that. Around 49 crore hectares of forests have been destroyed since 1990 due to indiscriminate deforestation for agriculture and other purposes. During those periods, although the forest area increased a little every year, the cutting of forests went on sporadically. That detail.. (in crores of hectares)

The weak are not responsible for their condition. They blame the circumstances and others. People with a strong personality stick to the values they believe in. In that order they will face any difficulties.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this regard.