ఫిట్‌నెస్‌ని పెంచే దాండియా..!

దాండియా, గర్బా.. గుజరాతీ సంప్రదాయ జానపద నృత్యాల్లో ఇవెంతో ప్రత్యేకమైనవి. బృందావనంలో రాధాకృష్ణుల లీలా వినోదాన్ని కళ్లకు కట్టినట్లుగా ఈ నృత్యాల ద్వారా ప్రదర్శిస్తారు. దసరా నవరాత్రుల్లో భాగంగా గుజరాత్‌తో పాటు, పశ్చిమ భారతదేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా తొమ్మిది రోజుల పాటు ఈ నృత్యాలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది.

Eenadu icon
By Vasundhara Team Published : 16 Oct 2026 18:51 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

దాండియా, గర్బా.. గుజరాతీ సంప్రదాయ జానపద నృత్యాల్లో ఇవెంతో ప్రత్యేకమైనవి. బృందావనంలో రాధాకృష్ణుల లీలా వినోదాన్ని కళ్లకు కట్టినట్లుగా ఈ నృత్యాల ద్వారా ప్రదర్శిస్తారు. దసరా నవరాత్రుల్లో భాగంగా గుజరాత్‌తో పాటు, పశ్చిమ భారతదేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా తొమ్మిది రోజుల పాటు ఈ నృత్యాలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇది కాలానుగుణంగా దేశవ్యాప్తం అవడంతో పాటు ప్రపంచం నలుమూలల్లో స్థిరపడిన భారతీయులు సైతం ఏటా నవరాత్రుల్లో ఈ నృత్యాలను ప్రదర్శిస్తుంటారు. ఇవి కేవలం అందరూ కలిసి ఆనందించడానికి ఆడుకునే ఆటలు మాత్రమే కావు.. ఫిట్‌నెస్‌పరంగా కూడా ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో దాండియా ఆడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం రండి..

పాటకు తగ్గ ఆట!

దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎక్కడ చూసినా దాండియా ఆటలే కనిపిస్తాయి. ఆడ, మగ అనే తేడా లేకుండా ఈ నృత్యంలో పాల్గొని పెద్దఎత్తున సందడి చేస్తారు. యువతులంతా దాండియా స్టిక్స్ పట్టుకుని పాటకు తగ్గట్లుగా వాటిని ఒకదానికొకటి తగిలిస్తూ లేదంటే జంటగా ఆడుతూ.. సవ్య, అపసవ్య దిశలలో తిరుగుతుంటారు. ఈ క్రమంలో చేతులు, కాళ్లు, భుజాలు, నడుము.. ఇలా శరీరంలోని భాగాలన్నింటికీ చక్కటి వ్యాయామం అందుతుంది. అలాగే ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా కొనసాగే ఈ నృత్యం ఒత్తిళ్లను తగ్గించి మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందంటున్నారు నిపుణులు.

నడుముకు వ్యాయామం..

కొంతమందికి మిగతా శరీరమంతా ఎలా ఉన్నా, నడుము దగ్గరికి వచ్చేసరికి మాత్రం కాస్త లావుగా కనిపిస్తుంది. ఎక్కువసేపు కూర్చునే ఉండడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని తరచూ తీసుకోవడం.. వంటి పలు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. దాండియా ఆటలో నిల్చున్న చోటే నడుమును కుడివైపుకి, ఎడమవైపుకి తిప్పడం, ముందుకు వంగుతూ లేవడం లాంటి కొన్ని భంగిమలుంటాయి. ఇవి నడుముకు చక్కటి వ్యాయామాన్ని అందిస్తాయి.

దాండియా నృత్యంలో భాగంగా స్టిక్స్‌ని చేతుల్లో పట్టుకుని ఒకదాంతో మరొకదాన్ని కొట్టడం, కాళ్లు పైకి, కిందికి, ముందుకు, వెనక్కి వూపడం వల్ల.. కాళ్లు, చేతులపై కాస్త ఒత్తిడి పడుతుంటుంది. ఫలితంగా ఆయా భాగాలకు కూడా చక్కటి వ్యాయామం అందుతుందని చెబుతున్నారు నిపుణులు.

మానసిక ప్రశాంతతకు..

రోజంతా ఎదురయ్యే వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడి మానసిక ప్రశాంతతను పొందాలన్నా దాండియా ఆట ఓ చక్కటి మార్గమే. అందుకే ఏటా దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా సాయంత్రం పూట యువతులు ఎంతో ఉత్సాహంగా ఈ ఆటలో పాల్గొంటారు. దాండియా ఆడుతున్నప్పుడు మెదడులో ఎండార్ఫిన్లు ఉత్పత్తవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన.. వంటి మానసిక సమస్యలను దూరం చేసి శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచేందుకు తోడ్పడతాయి. అలాగే ఎంతో సరదాగా సాగే ఈ ఆట ఒత్తిడిని దూరం చేయడంతో పాటు మానసికోల్లాసాన్ని కూడా అందిస్తుంది.

సంపూర్ణ ఆరోగ్యానికీ!

శారీరక, మానసిక ఫిట్‌నెస్‌ని సొంతం చేసుకోవడానికి చాలామంది ఎంచుకునే వ్యాయామం ఏరోబిక్స్. అయితే దాండియా వల్ల కూడా ఏరోబిక్స్ చేసిన ఫలితం దక్కుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో తల నుంచి కాలి వేళ్ల వరకు.. శరీరంలోని అన్ని అవయవాలకు సరైన రక్తప్రసరణ జరుగుతుంది. అలాగే దీన్ని ఎంత వేగంగా ఆడితే గుండె కొట్టుకునే వేగం కూడా అంతగా పెరుగుతుంది. తద్వారా శరీరంలోని చెడు కొవ్వులు కరుగుతాయంటున్నారు నిపుణులు.

ఇలా కూడా!

⚛ దాండియా ఆట వల్ల శరీరానికి మంచి వ్యాయామం అంది, తద్వారా శరీరం అలసటకు గురై రాత్రుళ్లు హాయిగా నిద్రపడుతుందట. తద్వారా అటు ఆరోగ్యంగా, ఇటు దృఢంగా కూడా ఉండచ్చు.

⚛ అందరూ కలిసి ఆడుకునే ఏ ఆటైనా.. అది వారి మధ్య ఉండే సంబంధబాంధవ్యాలను రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాండియా కూడా అంతే! దాండియా ఫెస్టివల్స్‌లో మనకు పరిచయం ఉన్న వారితో పాటు పరిచయం లేని వారు కూడా ఉంటారు. వారితో కలిసి దాండియా ఆడడం వల్ల పరిచయాలు పెరుగుతాయి. సంబంధాలు బలపడతాయి.

నవరాత్రుల్లో ప్రధానమైన దాండియా నృత్యం వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నారు కదా! మరి దాండియా ఆడుతూ ఫిట్‌నెస్‌ని పెంచుకుందామా..?

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Dandiya to increase fitness..!

Dandiya, Garba.. are unique among Gujarati traditional folk dances. Radhakrishna's Leela entertainment in Vrindavan is performed through these dances. As part of Dussehra Navaratri, besides Gujarat, some other states of western India also perform these dances for nine days.

Eenadu icon
By Vasundhara Team Published : 16 Oct 2026 18:51 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

Dandiya, Garba.. These are unique among traditional Gujarati folk dances. Radhakrishna's Leela entertainment in Vrindavan is performed through these dances. As part of Dussehra Navratri, it is customary to perform these dances for nine days in Gujarat and other states of western India as well. However, it has spread throughout the country from time to time and Indians settled in all corners of the world also perform these dances on Navratri every year. These are not just games that everyone plays to enjoy together.. Experts say that they are also beneficial in terms of fitness. Let's find out the benefits of playing dandiya in this order..

A game that matches the song!

Dandiya games are seen everywhere as part of Dussehra Sharannavaratra celebrations. Both male and female participate in this dance and make a lot of noise. All the young women hold dandiya sticks and stick them to each other as per the song or play in pairs. In this order, arms, legs, shoulders, waist... all the parts of the body get good exercise. Also, experts say that this dance, which continues very happily and enthusiastically, reduces stress and provides mental peace.

Exercise for the waist..

For some people, no matter how the rest of the body looks, when it comes to the waist, it looks a bit fat. This problem can arise due to many reasons like sitting for a long time, lack of proper exercise for the body, frequent intake of fatty foods. There are some postures like turning the waist to the right and left, bending forward and getting up while standing in the Dandiya game. These give good exercise to the waist.

Dandiya dance involves holding the sticks in the hands and hitting them with each other, swinging the legs up, down, forwards and backwards...there is some pressure on the legs and arms. As a result, experts say that the respective parts will also get good exercise.

For mental peace..

Dandiya game is a good way to get mental peace and get rid of the personal and professional pressures faced throughout the day. That is why every year as part of Dussehra Sharannavaratra festival, young women participate in this game very enthusiastically in the evening. Endorphins are produced in the brain while playing Dandiya. These help to keep the body and mind calm by removing mental problems like stress and anxiety. Also, this fun game provides stress relief as well as mental relaxation.

For complete health!

Aerobics is an exercise that many choose to acquire physical and mental fitness. But experts say that aerobics can also be done by Dandiya. In this order, from head to toes, proper blood circulation is done to all the organs of the body. Also, the faster you play it, the faster your heart beats. Experts say that the bad fats in the body are melted.

Also!

⚛ Dandiya game gives the body good exercise, so that the body gets tired and sleeps comfortably at night. So that they can be healthy and strong.

⚛ Any game that everyone plays together.. there is no doubt that it doubles the relationship between them. Dandiya is the same! Dandiya festivals include those we know as well as those we don't. Playing dandiya with them increases familiarity. Relationships will be strengthened.

Didn't you know how many physical and mental benefits the Dandiya dance, which is the main part of Navratri, has? Can we increase fitness by playing Dandiya?

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :