Keralam CM reviews pilgrimage preparations offers prayers at Sabarimala

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్  రాబోయే శబరిమల మండల–మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ఏర్పాట్లను సమీక్షించేందుకు  శనివారం నీలక్కల్‌ను సందర్శించారు .మలయాళ మాసమైన 'తులాం' సందర్భంగా ఐదు రోజుల పాటు నిర్వహించే నెలవారీ పూజల కోసం ఈ ఆలయం సాయంత్రం వేళ తెరుచుకుంది. శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు చేయడంతో పాటు, వచ్చే నెలలో ప్రారంభం కానున్న వార్షిక తీర్థయాత్ర సీజన్ కోసం సన్నిధానంలో, పాదయాత్ర మార్గంలో చేపట్టిన ఏర్పాట్లను సతీశన్ పరిశీలించారు.

 దేవస్వం శాఖ మంత్రి కె. మురళీధరన్, పర్యాటక శాఖ మంత్రి పి.సి. విష్ణునాథ్‌లతో కలిసి, సతీశన్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పంప నుండి సాంప్రదాయ పాదయాత్రను ప్రారంభించి, సాయంత్రం 5 గంటల తర్వాత సన్నిధానానికి చేరుకున్నారు. ఆయన విఐపి (VIP) ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. 2017లో అప్పటి ముఖ్యమంత్రి పినరయి విజయన్ సందర్శించిన తర్వాత, ఒక ముఖ్యమంత్రి శబరిమల ఆలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి.  అంతుకు తంత్రి కందరారు బ్రహ్మదత్తన్ సమక్షంలో మేల్శాంతి ఇ.డి. ప్రసాద్ నంబూతిరి గర్భాలయాన్ని తెరిచారు. ఆ తర్వాత ఉపదేవతల ఆలయాలను తెరవడం మరియు పద్దెనిమిది పవిత్ర మెట్ల సమీపంలో 'ఆళి' (పవిత్ర అగ్నిగుండం)  లాంటి  కార్యక్రమాలు జరిగాయి.
 

 


English Translation
Kerala CM reviews pilgrimage preparations offers prayers at Sabarimala

Kerala Chief Minister V.D. Satishan visited Neelakkal on Saturday to review the arrangements for the upcoming Sabarimala mandal-Makaravilakku pilgrimage season. The temple opened in the evening for the five-day monthly pujas during the Malayalam month of 'Tulam'. Prayers were offered at Sabarimala Ayyappa Temple. Apart from offering prayers, Satheesan also reviewed the arrangements made along the padayatra route in Sannidha for the annual pilgrimage season that begins next month.

Minister of Religion K. Muralidharan, Minister of Tourism P.C. Accompanied by Vishnunath, Satishan started the traditional padayatra from Pampa around 3 pm and reached Sannidhana after 5 pm. He entered the temple premises through the VIP gate and visited the Lord. This is the first time a Chief Minister has visited the Sabarimala temple since then Chief Minister Pinarayi Vijayan visited in 2017.  In the presence of Tantri Kandararu Brahmadatta, Melshanthi E.D. Prasad Namboothiri sanctum sanctorum was opened. This was followed by ceremonies like the opening of the temples of the Upadevatas and the 'Aali' (sacred fire) near the eighteen sacred steps.