Actor Siraj Mehadi Reacts Small Films Problems

హైదరాబాద్‌: సినిమా తీయడం ఒక ఎత్తయితే.. దాన్ని థియేటర్లలో విడుదల చేయడం మరో ఎత్తు! చిన్న సినిమా నిర్మాతలకు అసలు పరీక్ష సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాతే మొదలవుతోందా? పెట్టుబడులు పెట్టి, అప్పులు చేసి సినిమాలు తీస్తున్న నిర్మాతలకు థియేటర్లు దొరకకపోవడం.. ఓటీటీ, శాటిలైట్ హక్కులు విక్రయించుకునే అవకాశాలు లేకపోవడం వెనుక ఎవరున్నారు? చిన్న సినిమాల విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వివక్ష కొనసాగుతోందా? ‘ఓ అందాల రాక్షసీ’ హీరో, నిర్మాత షిరాజ్ మెహదీ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా, వాటి వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తున్నారంటూ పరిశ్రమలోని కొందరు ప్రముఖులు, సంస్థల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిన్న సినిమాల నిర్మాతల కష్టాలను పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా నిర్మాణం కోసం నిర్మాతలు భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, వ్యాపారం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సినిమా తీయడానికి ముందుకొచ్చిన నిర్మాతకు, సినిమా పూర్తయిన తర్వాత అండగా నిలిచేవారు లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిలిం చాంబ‌ర్.. సినిమా నిర్మాణానికి ప్రోత్సాహం ఇవ్వకపోగా, విడుదల సమయంలోనూ అడ్డంకులు ఎదురైతే చిన్న నిర్మాతలు ఎవరిని ఆశ్రయించాలని ప్రశ్నించారు. తెలుగు ఫిలిం చాంబ‌ర్ స్థానంలో తెలంగాణ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందేని డిమాండ్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చిన్న సినిమాలను ఆదుకోవాలని షిరాజ్ మెహదీ విజ్ఞప్తి చేశారు. చిన్న బడ్జెట్ చిత్రాలకు సబ్సిడీలు అందించడం, థియేటర్ల కేటాయింపుల్లో పారదర్శకత తీసుకురావడం, ఓటీటీ, శాటిలైట్ హక్కుల విక్రయాలకు అవకాశాలు పెంచడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే చిన్న సినిమాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.


English Translation
Actor Siraj Mehadi Reacts Small Films Problems

Hyderabad: If making a film is one step.. release it in theatres. Another height to do! Does the real test for small filmmakers begin after the production of the film? Who is behind the lack of theaters for the producers who have invested and taken loans to make films? Discrimination continues in the Telugu film industry when it comes to small films? The sensational allegations made by 'O Andala Rakshasi' hero and producer Shiraj Mehdi have now become a topic of discussion. He expressed his concern that there is no one who cares about the hardships of the producers of small films. It is stated that the producers are spending huge amount of money for the production of the film and are facing difficulties in business. He expressed his regret that it was unfortunate that the producer who came forward to make the film did not have people who stood by him after the completion of the film.

Film Chamber did not give encouragement to the production of the film, but asked who should the small producers turn to if they face obstacles during the release. They demanded that a Telangana branch should be established in place of the Telugu Film Chamber.

Telangana Chief Minister Revanth Reddy and Shiraj Mehdi appealed to the state government to respond immediately and support small films. They asked for measures like providing subsidies to small budget films, bringing transparency in theater allocations, and increasing opportunities for sales of OTT and satellite rights. He opined that if the government takes the initiative, there will be a chance for justice for small films.