Meteorological Department forecasts heavy rain for Hyderabad

సాక్షి, హైదరాబాద్‌:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ప్యూచర్‌ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. ఒక్కసారిగా భారీ వాన రావడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్‌ జామయ్యింది.

కాగా కాసేపటి క్రితమే వాతావరణ శాఖ హెదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేసింది. నగరంలో రానున్న రెండు గంటలపాటు  భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హోర్డింగుల వద్ద నిల్చోవద్దని సూచించింది.


ఇదీ చదవండి:తెలంగాణలో కరువు మంటలు


English Translation
Meteorological Department forecasts heavy rain for Hyderabad

Sakshi, Hyderabad:Hyderabad will receive heavy rain in many areas. Along with Future City, there will be rain in many places. Due to sudden heavy rain, motorists are facing dire situations. Due to the heavy water on the roads, the traffic got stuck in many places.

However, a while back, the weather department has forecast heavy rain for Hyderabad. It said that there is a possibility of heavy rain in the city for the next two hours. It has been said that there is a possibility of gale force winds in many areas. Orange alert has been issued in this background. In the face of strong winds, the public has been advised not to stop at the hoardings.


Read:Drought in Telangana Fire