జపాన్... ఆయుధం పడుతోంది!

- A
- A+
- A++

వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయాలు, ట్రంప్ తెంపరితనం, గందరగోళ నిర్ణయాలతో ఎవరినీ నమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ‘అస్త్రసన్యాసం’ చేసిన జపాన్ పూర్తిస్థాయిలో ఆయుధాలు పట్టేందుకు సన్నద్ధమవుతోంది. స్వీయరక్షణ బాధ్యతను సొంత భుజాలపైనే వేసుకుంది. దీంతో జపాన్ కూడా సైనిక శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటే భారత్‌కు ఎంతో మేలు!
రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి తర్వాత జపాన్ శాంతికాముక దేశంగా మారింది. యుద్ధవిరమణ ఒప్పందంలో భాగంగా ప్రత్యర్థులు నిర్దేశించిన కట్టుబాట్లకు అనుగుణంగా ఈ పద్ధతిని ఎంచుకుంది. పోరును సార్వభౌమ హక్కుగా పరిగణించే ఆలోచనకు శాశ్వతంగా స్వస్తి పలికింది. అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం బలప్రయోగానికి దిగరాదని నిర్ణయించింది. జపాన్ ఎన్నటికీ ప్రబల సైనికశక్తిగా మారబోదంటూ 1977లో ఎలుగెత్తి చాటిన సిద్ధాంతానికి అలాగే కట్టుబడి ఉంది. స్వీయరక్షణ కోసం పరిమిత స్థాయిలోనే సైనికశక్తిని కొనసాగించింది. దాంతో జపాన్ రక్షణ బాధ్యతను ప్రధానంగా అమెరికాయే చూసుకునేది. ఆ శాంతి సిద్ధాంతాన్ని పూర్తిగా వదిలేసినట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించకున్నా టోక్యో ఆలోచనలు మాత్రం గణనీయంగా మారుతున్నాయి.
మారిన టోక్యో వ్యూహాలు...
జపాన్ గత కొన్నేళ్లుగా గణనీయ స్థాయిలో సైనిక మార్పులను చేపడుతోంది. ఈ ఏడాది తన రక్షణ బడ్జెట్‌ను జీడీపీలో 2 శాతానికి పెంచింది. ఈ వ్యయాన్ని ఒకే ఒక్క శాతంగా నిర్దేశిస్తూ 1976లో విధించిన నిబంధనను తొలగించింది. ప్రతిదాడి సామర్థ్యాలనూ పెంచుకుంటోంది. వెయ్యి కిలోమీటర్ల పరిధి కలిగిన హైపర్సోనిక్ గ్లైడ్ ఆయుధాలు, టైప్12 క్రూజ్ క్షిపణులను మోహరించింది. అమెరికా నుంచి 400 తోమహాక్ క్షిపణులనూ కొనుగోలు చేస్తోంది. సమీకృత తీర రక్షణ వ్యవస్థలను నిర్మిస్తోంది. గగనతల, ఉపరితల, జలాంతర డ్రోన్లను ఇందుకు ఉపయోగిస్తోంది. బ్రిటన్, ఇటలీలతో కలిసి ఆరోతరం స్టెల్త్ యుద్ధవిమానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఫిలిప్పీన్స్, ఇండోనేసియాతో భద్రతా బంధాన్ని బలోపేతం చేసుకుంటోంది. వాటికి యుద్ధనౌకలను అందిస్తోంది. ఏఐ నియంత్రిత డ్రోన్లపై పెట్టుబడులు పెడుతోంది. తన నౌకాదళంలోని హెలికాప్టర్ వాహక నౌకలను పూర్తిస్థాయి విమాన వాహక నౌకలుగా ఆధునికీ కరిస్తోంది. రక్షణ ఎగుమతులపై ఉన్న ఆంక్షల నుంచి సహాయ చర్యలు, రవాణా, నిఘా, హెచ్చరిక, మందుపాతరలను గుర్తించే సాధనాలను జపాన్ మినహాయించింది. భారత్ సహా 17 దేశాలకు వీటిని విక్రయించడానికి నిర్ణయించింది. ఆయుధ ఎగుమతులకు సంబంధించి జపాన్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదే.
శాంతికాముక ముద్ర నుంచి దూరం జరిగే ప్రక్రియకు మునుపటి షింజౌ అబే ప్రభుత్వంలోనే బీజం పడింది. చైనా సైనికశక్తి నానాటికీ పెరుగుతుండటం, తైవాన్ విషయంలో ఆ దేశం తరచూ దౌర్జన్యానికి దిగడం; ఉత్తరకొరియా, రష్యాల నుంచి పొంచి ఉన్న ప్రమాదాల వంటివి జపాన్ మనసు మారడానికి కారణమయ్యాయి. దశాబ్దాలుగా జపాన్‌కు ప్రధాన రక్షకుడిగా అమెరికా ఉన్నా, అగ్రరాజ్యం మద్దతు ఏకపక్షం కాదని ఉక్రెయిన్ యుద్ధం చాటుతోంది. ఆయుధ సరఫరా కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అమెరికా స్పందన అరకొరగానే ఉంటోంది. దీనికితోడు అగ్రరాజ్యం మద్దతు ఉన్నంతమాత్రాన పూర్తిస్థాయి రక్షణ ఉన్నట్లు కాదని కూడా స్పష్టమవుతోంది. అమెరికా ఆయుధ ఉత్పత్తికీ పరిమితులున్నాయి. అందుకని ఆ దేశం నుంచి అందే సాయంలోనూ పరిమితులు ఉంటాయని జపాన్‌కు బోధపడింది. ఇరాన్ యుద్ధంలో అమెరికా బలహీనతలూ బయటపడ్డాయి. ట్రంప్ విధానాల్లో నిలకడ లోపించడం, అస్తవ్యస్త నిర్ణయాలు వంటివి టోక్యో మనసు మారడానికి కారణమయ్యాయి. పశ్చిమాసియా, ఉక్రెయిన్ యుద్ధాలతో ఆయుధాలకు డిమాండ్ పెరిగింది. అదే సమయంలో అమెరికా ఆయుధ ఉత్పత్తి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఐరోపా సహా అనేక మిత్ర దేశాలు ప్రధానంగా అగ్రరాజ్యం నుంచే అస్త్రశస్త్రాలను కొనుగోలు చేసేవి. ఇప్పుడు భిన్న దేశాలపైకి వాటి దృష్టి మరలింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ వ్యవహారాల్లో వస్తున్న పెనుమార్పుల కారణంగా అనేక దేశాలు తమ సైనికశక్తిని ఆధునికీకరిస్తున్నాయి. ఇలాంటి దేశాలు జపాన్ను నమ్మకమైన ఆయుధ సరఫరాదారుగా పరిగణించే అవకాశం ఉంది. ఈ ఉద్దేశంతో టోక్యో హైటెక్ అస్త్రశస్త్రాల ఉత్పత్తిపై దృష్టి పెడుతోంది. ఆయుధ సంస్థల్లో పునరుజ్జీవనం నింపాలన్న జపాన్ నిర్ణయం వెనుక ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. ఆయుధ ఎగుమతులపై ఆంక్షలు తొలగించడం వల్ల జపాన్‌కు చెందిన మిత్సుబిషి, కవాసాకి వంటి దిగ్గజ కంపెనీలు లాభపడే అవకాశం ఉంది.
భారత్‌కు మంచి అవకాశం
భారత్‌తో రక్షణ బంధాన్ని ఏర్పర్చుకోవడానికి జపాన్ ఇటీవల కాలంలో ఆసక్తి చూపుతోంది. క్వాడ్ కూటమిలో చిగురించిన మైత్రి బలోపేతమవుతోంది. తాజా జపాన్ సైనిక పునరుత్థానం భారత్‌కు మంచి అవకాశం. రెండు దేశాల సైన్యాలు ఉమ్మడి విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల ‘వీర్ గార్డియన్-2026’ కార్యక్రమంలో తేజస్ యుద్ధవిమానంలో జపాన్ ఎయిర్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్ అధిపతి జనరల్ తహెహిరో మోరిటా గగనవిహారం చేయడం ద్వైపాక్షిక రక్షణ మైత్రి కొత్త పుంతలు తొక్కుతోందన్న సంకేతాలను ఇచ్చినట్లయింది. భారత్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన తేజస్‌కు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత పెరగడానికి కూడా ఇది దోహదపడుతుంది. ఆ విన్యాసాల కోసం జపాన్ తన ప్రధాన యుద్ధవిమానమైన ఎఫ్-2ఏను తొలిసారిగా ఇక్కడికి పంపడం ఇండియాకు టోక్యో కల్పిస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం. సముద్ర భద్రతపైనా భారత్, జపాన్‌లు ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత యుద్ధనౌకల కోసం యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటెన్నాలను ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకూ ఒప్పందం కుదిరింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సైన్యాలు సరకులు, సేవలను ఇచ్చిపుచ్చుకోవడానికి ఇరుదేశాలు సమ్మతించాయి. ఈ మైత్రిని మరింత బలోపేతం చేసుకుంటూ జపాన్‌తో కలిసి కొత్తతరం ఆయుధాల రూపకల్పనకు కృషిచేయాలి. ఆ దేశం నుంచి అధునాతన పరిజ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. ఆయుధ ఉత్పత్తి హబ్‌గా ఎదగాలన్న భారత లక్ష్యానికి ఇది బాటలు పరుస్తుంది.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
English Translation
Japan...arming!

- A
- A+
- A++

Rapidly changing geopolitics, Trump's impatience, confusion The situation is gone without trusting anyone with decisions. With this, Japan, which has done 'arms asceticism' after the Second World War, is preparing to fully arm itself. She took the responsibility of self-defense on her own shoulders. With this, Japan is also likely to grow as a military power. It will be very good for India if such conditions are made favorable!
After the defeat in the Second World War, Japan became a pacifist country. It chose this method to comply with the commitments made by the adversaries as part of the armistice agreement. The idea of fighting as a sovereign right was put to rest forever. It has decided not to resort to the use of force for the settlement of international disputes. It remains committed to the doctrine that it proclaimed in 1977 that Japan would never become a dominant military power. It maintained a limited military force for self-defense. With that, the responsibility of Japan's defense was primarily taken care of by America. Although it has not yet officially announced that it has completely abandoned the peace doctrine, Tokyo's thinking is changing significantly.
Tokyo's Changed Tactics...
Japan has been undergoing significant military reforms over the past few years. It has increased its defense budget to 2 percent of GDP this year. It removed the 1976 rule fixing this cost at a single percent. Counterattack capabilities are also increasing. Deploys Type 12 cruise missiles and hypersonic glide weapons with a range of 1,000 kilometers. It is also buying 400 Tomahawk missiles from America. Building integrated coastal defense systems. Aerial, surface and underwater drones are being used for this. It is developing a sixth generation stealth fighter with Britain and Italy. The Philippines is strengthening its security ties with Indonesia. Providing warships to them. Investing in AI controlled drones. It is upgrading its fleet of helicopter carriers into full-fledged aircraft carriers. Japan has exempted aid, transportation, surveillance, warning and mine detection equipment from the restrictions on defense exports. It has decided to sell these to 17 countries including India. This is the biggest decision taken by Japan regarding arms exports.
The process of moving away from a pacifist image was seeded in the previous Shinzo Abe government. China's ever-growing military power, the country's frequent aggression in the case of Taiwan; Threats from North Korea and Russia caused Japan to change its mind. Although America has been Japan's main protector for decades, the war in Ukraine shows that the superpower's support is not unilateral. Although President Zelensky of Ukraine has been appealing for arms supply, America's response has been half-hearted. In addition to this, it is also clear that the support of a superpower does not mean complete protection. America's arms production is also limited. Therefore, Japan was taught that there are limits to the aid received from that country. America's weaknesses were exposed in the Iran war. Trump's lack of consistency and erratic decisions have caused Tokyo to change its mind. The demand for weapons increased with the wars in West Asia and Ukraine. At the same time, US arms production is under severe pressure. Many allied countries, including Europe, used to buy arms mainly from the superpower. Now their focus is on other countries. Many countries are modernizing their military forces due to major changes in international geopolitical affairs. Such countries are likely to regard Japan as a reliable arms supplier. With this aim, Tokyo is focusing on the production of high-tech weapons. Economic reasons were also behind Japan's decision to revive the arms industry. The removal of restrictions on arms exports is likely to benefit Japanese giants like Mitsubishi and Kawasaki.
Good opportunity for India
Japan has recently shown interest in establishing a defense relationship with India. The budding alliance in the Quad alliance is getting stronger. The latest Japanese military resurgence is a good opportunity for India. The armies of the two countries are conducting joint exercises. The recent flight of the Chief of Japan Air Self-Defense Force, General Tahehiro Morita, in a Tejas fighter jet during the 'Veer Guardian-2026' program seems to indicate that the bilateral defense alliance is breaking new ground. It will also help to increase the international prominence of India's prestigiously designed Tejas. Japan sending its main fighter jet F-2A here for the first time for those maneuvers is a proof of the priority given by Tokyo to India. India and Japan recently signed an agreement on maritime security. An agreement was also signed to jointly develop unified complex radio antennas for Indian warships. Both countries have agreed to exchange military goods and services in the Indo-Pacific region. This alliance should be further strengthened and efforts should be made to develop new generation weapons together with Japan. Try to get advanced knowledge from that country. This paves the way for India's ambition to become an arms manufacturing hub.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this regard.