అప్పటి వరకూ ఖాళీనే.. రంజీ బరిలో శుభ్‌మన్‌ గిల్

Eenadu icon
By Sports News Team Published : 17 Oct 2026 18:01 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Shubman Gill! ఇంటర్నెట్ డెస్క్: మరో ఐదు రోజుల్లోనే న్యూజిలాండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. కివీస్‌తో తొలుత టీ20 సిరీస్‌ను ఆడనుంది. ఆ తర్వాత వన్డేలు, టెస్టుల్లో తలపడనుంది. అక్టోబర్ 22 నుంచి పొట్టి సిరీస్ మొదలువుతుంది. ఇక వన్డేలు నవంబర్ 4వ తేదీన ప్రారంభమవుతాయి. ఇప్పటి నుంచి దాదాపు రెండు వారాలపాటు భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ ఖాళీనే. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. రంజీ ట్రోఫీ (Ranji Trophy) బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం నుంచి రెండో రౌండ్ ప్రారంభం కానుంది. ఛత్తీస్‌గఢ్‌పై పంజాబ్ జట్టు తరఫున గిల్‌ ఆడనున్నాడు. కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ నేపథ్యంలో ప్రాక్టీస్ కోసం రంజీ మ్యాచ్‌ను వినియోగించుకోవాలని భావిస్తున్నాడు. 

  • రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఊహాగానాలు.. ముంబయి హెడ్‌కోచ్‌గా వైదొలగిన మహేల జయవర్దనే

ఐదుగురిని వ్యక్తిగత నెట్‌ బౌలర్లుగా..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ చేరుకోవాలంటే న్యూజిలాండ్ (India vs Newzealand) సిరీస్ అత్యంత కీలకం. రెండు టెస్టుల్లోనూ కివీస్ పేస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు కెప్టెన్ గిల్ ( Shubman Gill) మంచి ఆలోచన చేశాడు. గతంలో ఏ భారత సారథి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. తన కోసం ఐదుగురిని వ్యక్తిగత నెట్‌బౌలర్లుగా న్యూజిలాండ్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అందుకు అయ్యే ఖర్చును తానే భరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీసీసీఐ పలువురిని నెట్‌ బౌలర్లుగా పంపించనుంది. వారితోపాటు అదనంగా తీసుకెళ్లనున్నాడు. టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ A జట్టుతో భారత్‌ A ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఆడనుంది. వన్డే సిరీస్‌ నేపథ్యంలో గిల్‌ అందుబాటులో ఉండటం లేదు. దీంతో టెస్టు సిరీస్‌కు నెట్ బౌలర్ల సాయంతో సన్నద్ధం కావాలని గిల్ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • గుండెకు బైపాస్‌.. సంకల్పంలో ‘పవర్‌’ఫుల్‌.. దటీజ్‌ శంకరరావు! D V Shankar Rao: సంకల్ప బలానికి వయసు అడ్డంకి కాదని, గుండెకు బైపాస్ సర్జరీ జరిగినా ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని జయించవచ్చని నిరూపించారు భద్రాచలానికి చెందిన 74 ఏళ్ల రిటైర్డ్ ఎస్‌బీఐ అధికారి డి.వి. శంకరరావు.
  • రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఊహాగానాలు.. ముంబయి హెడ్‌కోచ్‌గా వైదొలగిన మహేల జయవర్దనే Mahela Jayawardene: ఐపీఎల్ 2027 (IPL 2027)కు ముందు ముంబయి ఇండియన్స్‌ తమ ఫ్రాంఛైజీలో భారీ మార్పులు చేస్తోంది. అందులో భాగంగానే పరస్పర అంగీకారంతో ముంబయితో బంధానికి మహేల జయవర్దనే ముగింపు పలికారు.
  • వెస్టిండీస్‌తో ఆఖరి టీ20.. వైభవ్‌ సూర్యవంశీ ఆసక్తికర పోస్టు Vaibhav Sooryavanshi: అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-2తో సమంగా ఉన్న భారత్, వెస్టిండీస్‌ మధ్య శనివారం రాత్రి ఆఖరిపోరు జరగనుంది. రెండు జట్లు దూకుడుగా ఆడుతుండటంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సిరీస్ ఎవరి సొంతమవుతుందా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
  • ఇది నిజంగా అన్యాయమే.. యశస్వికి చోటు దక్కకపోవడంపై అశ్విన్‌ మండిపాటు Ravichandran Ashwin: న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal)కు నిరాశ ఎదురైంది.
  • చివరిది చిక్కేదెవరికో.. హోరాహోరీగా సాగుతోన్న పొట్టి సిరీస్‌లో ఆఖరి సమరానికి వేళైంది. భారత్, వెస్టిండీస్‌ మధ్య నిర్ణయాత్మక అయిదో టీ20 నేడే. వెస్టిండీస్‌ ఊహించినదాని కన్నా ఎక్కువ దూకుడునే ప్రదర్శిస్తోన్న నేపథ్యంలో..
  • మెరిసిన దీప్తి, నికీ జింబాబ్వేతో మహిళల టీ20 సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. పసికూనను అలవోకగా కొట్టేస్తారనుకుంటే.. కాస్త పరీక్ష తప్పలేదు. స్వల్ప ఛేదనలో 19కే నాలుగు వికెట్లు కోల్పోయి, భారత్‌ చిక్కుల్లో పడింది.
  • నన్ను వేలాడేసింది సైమండ్స్‌ కాదు 2013 ఐపీఎల్‌ సందర్భంగా ఓ మ్యాచ్‌ అనంతరం మద్యం మత్తులో ఒక ఆస్ట్రేలియా క్రికెటర్‌ తనను హోటల్లో 15వ ఫ్లోర్‌ నుంచి వేలాడదీసి పట్టుకున్న ఘటన గురించి భారత సీనియర్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ వెల్లడించడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
  • తాత్కాలిక వన్డే కెప్టెన్‌గా శ్రేయస్‌ భారత టీ20 జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. తాత్కాలికంగా వన్డే సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ నెల 22న మొదలయ్యే న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్‌ 5 టీ20లు, 5 వన్డేలు 2 టెస్టులు ఆడుతుంది.
  • సుహాస్, అభిజీత్‌ గెలుపు ఏషియాడ్‌లో పతక వేట మళ్లీ మొదలైంది. జపాన్‌ వేదికగా ఆసియా పారా క్రీడలు ఆదివారం షురూ కానుండగా..
  • ఫైనల్లో అమృత అండర్‌-23 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత రెజ్లర్‌ అమృత పూజారి ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం నువ్వానేనా అన్నట్లు సాగిన మహిళల 72 కిలోల సెమీఫైనల్లో ఆమె 10-8తో వెన్‌జిన్‌ కియు (చైనా)పై విజయం సాధించింది.
  • నా బయోపిక్‌లో ప్రియాంక అయితే... తన జీవిత చరిత్రను సినిమాగా తీస్తే బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ ప్రియాంక చోప్రా నటించాలని ఆకాంక్షిస్తున్నట్లు భారత హాకీ స్టార్‌ సవితా పునియా తెలిపింది. ‘‘నా జీవిత చరిత్ర పై సినిమా వస్తుందని అనుకోవడం లేదు.
  • వస్తోంది మిక్స్‌డ్‌ క్రికెట్‌ టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్‌ టెన్నిస్‌ లాంటి పలు ఆటల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఆడుతుంటారు. కానీ క్రికెట్లో మాత్రం ఈ కలయికను ఇప్పటిదాకా చూడలేదు. ఇప్పుడు శ్రీలంకలో ఈ చిత్రం చూడబోతున్నాం.
  • ప్లేఆఫ్స్‌లో నైట్స్, మరాఠాస్‌ ఆర్చరీ ప్రిమియర్‌ లీగ్‌లో కాకతీయ నైట్స్, మైటీ మరాఠాస్‌ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించాయి. శుక్రవారం విజయం సాధించిన ఆ జట్లు ముందడుగేశాయి.
  • సంక్షిప్త వార్తలు (4) భారత మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు అన్వయ్‌ ద్రవిడ్‌.. వినూ మన్కడ్‌ ట్రోఫీలో మెరుపు శతకం బాదాడు. కర్ణాటక అండర్‌-19కు సారథ్యం వహిస్తున్న అన్వయ్‌ (151; 100 బంతుల్లో 20×4, 3×6) భారీ శతకంతో జట్టుకు 5 వికెట్ల విజయాన్నందించాడు.
  • రాణించిన దీప్తి, నిక్కీ.. జింబాబ్వేపై భారత్‌ విజయం భారత మహిళల జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 114/5 పరుగులు చేసింది.
  • కివీస్‌తో వన్డేలు, టెస్ట్‌లు.. భారత జట్లు ఇవే.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ పూర్తి కాగానే టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్కడ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ కోసం స్క్వాడ్‌ను ప్రకటించిన బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ.. తాజాగా వన్డే, టెస్టు మ్యాచ్‌లకు సంబంధించి జట్ల వివరాలు వెల్లడించింది.
  • భారత్ ‘బ్యాటు’ గర్జిస్తేనే.. విండీస్‌ ‘పట్టు’ తప్పేది! భారీ స్కోర్లు నమోదవుతున్న వేళ.. భారత బ్యాటర్లూ చెలరేగిపోవాల్సిన అవసరం ఉంది. 
  • ఇది మిక్స్‌డ్‌ జెండర్ క్రికెట్‌.. ఒకే జట్టులో అమ్మాయిలు, అబ్బాయిలు తొలిసారి నిర్వహిస్తోన్న మిక్స్‌డ్‌ జెండర్ టోర్నీకి కొలంబో వేదికగా నిలిచింది.
  • బెంగళూరులోనే భువీ పునరాగమనం.. భువనేశ్వర్‌ కుమార్‌ పునరాగమనం ఇంకాస్త ముందుగానే జరగనుంది. ఇప్పటికే కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన అతడిని.. విండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్‌కూ బీసీసీఐ తీసుకుంది.
  • రూ. 285 కోట్ల ఆదాయం.. మాకు దమ్మిడీ రాదు: విండీస్ బోర్డు సీఈవో భారత్‌తో సిరీస్‌ ఆడినా తమకు ఆదాయపరంగా ఎలాంటి ప్రయోజనం లేదని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. 

English Translation

Translation pending...